For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చిన్నపిల్లల కోసం 10 గుమ్మడికాయ అలంకరణ ఐడియాలు

ఇదిగో ఇక్కడ వివిధ గుమ్మడికాయను అలంకరించే ఐడియాలను ఒకచోట పొందుపరిచాను, చదవండి.

|

హాలోవీన్ పండగ సమయంలో కుటుంబాలన్నీ ఒక్కచోట చేరి సంతోషంగా సమయం కలిసి గడుపుతాయి. ఎన్నో ఉల్లాసాన్నిచ్చే ఆటలు ఆడుకుంటారు. అందులో ఒకటి గుమ్మడికాయలను అలంకరించటం. చిన్నపిల్లలు తమంతట తాము గుమ్మడికాయను కోసి ఆకారాలు తయారుచేయలేరు కాబట్టి వారి గుమ్మడికాయలను అలంకరించటానికి వేరే ప్రత్యామ్నాయ మార్గాలు వెతకాల్సి ఉంటుంది.

ఇదిగో ఇక్కడ వివిధ గుమ్మడికాయను అలంకరించే ఐడియాలను ఒకచోట పొందుపరిచాను, చదవండి...

1. వాషి టేప్

1. వాషి టేప్

వాషి టేపును సాధారణంగా ఇప్పుడు ఈస్టర్ ఎగ్స్ ను, గుమ్మడికాయలను అలంకరించటానికి ఎక్కువ వాడుతున్నారు. మీ పాప లేదా బాబుకి దీన్ని ఇచ్చి వారికి నచ్చిన విధంగా అతికించడానికి వదిలేయండి.

జిగ్ జాగ్ లైన్లు,ఒక క్రమం లేకుండా ఎటుపడితే అటు అతికిస్తే, గుమ్మడికాయ అందంగా కన్పిస్తుంది. మీ పిల్లలకి వాషి టేప్ ఇచ్చి చూడండి, వారెంత సృజనాత్మకమైన వారో తెలుస్తుంది.

2. వేలితో పెయింటింగ్

2. వేలితో పెయింటింగ్

గుమ్మడికాయలను అలంకరించాలనుకునే పిల్లలకు వేలితో పెయింటింగ్ చేయమంటే అంతకన్నా ఆనందం ఉండదు. వారికి యాప్రాన్లు కట్టేసి గుమ్మడికాయలకి వేలితో పెయింటింగ్ చేయమని ఇచ్చేయండి మరి.

3.స్టాంపు

3.స్టాంపు

మార్కెట్లో అనేకరకాల స్తాంపులు దొరుకుతాయి. వాటిని ఇంకుపాడ్ పై ముంచితే చాలు గుమ్మడికాయపై ఎక్కడైనా స్టాంపులా వేసేయొచ్చు.

4.హాస్యకర కటింగ్స్ అతికించడం

4.హాస్యకర కటింగ్స్ అతికించడం

మీసాలు, సీతాకోకచిలుకలు,లేదా మొహంలో భావాలు ఏవైనా ఆకారాలలాగా కట్ చేయవచ్చు. వీటిని నచ్చిన ఆకారాలలో గట్టి కార్డ్ బోర్డ్ షీటుపై కట్ చేసి గుమ్మడికాయపై అతికించండి.

5.జిగురుతో అందాలు

5.జిగురుతో అందాలు

ఈ అలంకరణ ఆలోచన ముఖ్యంగా చిన్నిపాపలకి తప్పక నచ్చుతుంది. కొన్నిరకాల పూసలు, మెరుపు, రంగురాళ్ళు, బటన్లు, రిబ్బన్లు మరియు ఇతర అందమైన వస్తువులు కొని జిగురుతో వారిని గుమ్మడికాయపై అతికించనివ్వండి.

ఈ అతికించినవాటితో మీ గుమ్మడికాయకి పండగ వాతావరణం వచ్చేస్తుంది.

6. మైనంతో చేసిన

6. మైనంతో చేసిన

పలకపై గీయటం ఒక స్టెన్సిల్ ను కొని మీ పాప లేదా బాబుకి దానిలో ఉండే ఖాళీలని వివిధ డిజైన్లు, గీతలతో పూరించటానికి సాయపడండి.

ఈ అక్షరాల,వివిధ ఆకారాల స్టెన్సిల్ ను గుమ్మడికాయపై అతికించి మీ బిడ్డను ఖాళీలన్నీ పూరించమని చెప్పండి, అయ్యాక పైన మైనం ఫ్రేమును తీసేస్తే అసలు డిజైన్ అందంగా గుమ్మడికాయపై కన్పిస్తుంది.

7. క్యాండీ

7. క్యాండీ

మీ పిల్లలను హాలోవీన్ సందర్భంగా గుమ్మడికాయపై క్యాండీని అతికించమని చెప్తే వారికి అంతకన్నా కావాల్సింది ఏముంటుంది?

ఈ విధంగా వారు దాచిపెట్టుకున్న అదనపు చాకొలెట్ క్యాండీలన్నీ మీ పాప లేదా బాబు పొట్టలోకి వెళ్ళకుండా వదిలించవచ్చు.

8. తీగలు

8. తీగలు

మీ పిల్లలకి వివిధ రంగులున్న తాళ్ళను ఇచ్చి వారు గుమ్మడికాయ చుట్టూ ఎలా తిప్పి ఒక డిజైన్ వచ్చేలాగా చుడతారో మీరే చూడండి.

9. ఆకులు

9. ఆకులు

మీ పిల్లలని వారి గుమ్మడికాయలకి ఆకులు అతికించనివ్వచ్చు. అవి మామూలు ఆకుపచ్చని ఆకులైనా కావచ్చు లేదా శిశిర రుతువులో వచ్చే ఆరెంజ్ రంగు ఆకులైనా కావచ్చు.

కానీ గుర్తుంచుకోండి, ఒకవేళ ఆరెంజ్ రంగు ఆకులు వాడుతుంటే, గుమ్మడికాయను వేరే రంగులో పెయింట్ చేయటం మర్చిపోకండి. ఎందుకంటే గుమ్మడికాయ రంగు, ఆకుల రంగు ఒకటే అయిపోయే ప్రమాదం ఉంది.

10. దుస్తులతో అలంకరణ

10. దుస్తులతో అలంకరణ

పిల్లలకి ఆసక్తికరమైన ఆటలు, ఏదైనా పాత్రలలో నటించడం చాలా నచ్చుతుంది. వారికి వదిలేస్తే గుమ్మడికాయలకి జుట్టుగా, హ్యాట్లుగా వూలును, ముక్కులాగా కాబ్స్ ని అతికిస్తారు.

మీరు ఇంకా వారి మధ్య ఎవరు గుమ్మడికాయను త్వరగా అలంకరిస్తారని పోటీ కూడా పెట్టవచ్చు.

మీ పిల్లలను ఈ హాలోవీన్ సమయంలో గుమ్మడికాయను కోసే పని లేకుండా ఇన్ని విధాలుగా అలంకరణలో బిజీగా ఉంచండి.

English summary

10 Pumpkin Decorating Ideas For Toddlers |Halloween Decoration | Pumpkins Halloween Decorating Ideas | Halloween Decor Ideas

Halloween is the time when families get together and do fun activities, one of these activities being pumpkin decorating. Toddlers cannot carve a pumpkin so it becomes essential to find some other alternative way to allow them to decorate their pumpkins.Here are few simple ways to use pumpkins for Halloween decorations.
Desktop Bottom Promotion