For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ వంటగదిని అందంగా అలంకరించుకోవడానికి కొన్ని సూపర్ టిప్స్

By Lekhaka
|

మన ఇల్లు ప్రత్యేకంగా, ఆకర్షణీయంగా తయారుచేసుకోడానికి మనందరం ఇష్టపడతాము . మీరు మీ మీ ఇల్లు అందంగా ఉంచుకోవడానికి ప్రధాన ఎంపిక ఇంటి అలంకరణలు. కానీ, ఇది కేవలం లివింగ్ రూమ్ లేదా పడక గదికే సాధ్యపడుతుంది. ఇంకా వంటగది విషయానికి వస్తే, మీరు కొద్దిగా విభిన్నంగా ఆలోచించాలి.

వంటగది దానిని ఉపయోగించే వారి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబింప చేసే ప్రదేశం. కాబట్టి, మీరు మీ వంటగదిని ప్రకాశింప చేయాలనే అద్భుతమైన ఆలోచనలు చేసేటపుడు జాగ్రత్త వహించండి.

స్త్రీలు ఎక్కువ సమయం వంటగదిలోనే గడుపుతారు, దాన్ని ఎంతో ఖచ్చితంగా అలంకరించే ముఖ్యమైన ప్రదేశం.

హోమ్ డెకార్ ని ఎక్కువగా ఉపయోగించకపోవడమే అత్యంత ముఖ్యమైన చిట్కా. అంతేకాకుండా, వంటగది వస్తువులను వంటగది అలంకరణలో భాగంగా తయారుచేయాలి అనుకోవడం. మీ వంటగది ప్రత్యేకంగా కనిపించడానికి మీరు ఖరీదైన వస్తువులను కొనుగోలు చేయాలి అనుకోవడం మీ దురభిప్రాయం. మీరు మీ వంటగదిని ఖచ్చితంగా క్రియేటివ్ గా ఉంచుకోవాలి అనుకుంటే కొంత సమయం తీసుకుని, వినూత్నమైన ఆలోచనలు చేయండి.

కిచెన్ గార్డెన్ చిట్కాలు

ఇక్కడ, మీ వంటగదిని ఎలా ప్రకాశవంతం చేయాలో కొన్ని వినూత్న ఆలోచనల గురించి వివరించబడింది. ఇది మీ వంటగదిని పూర్తిగా పునరుధ్ధరించే సెషన్ అని హామీ ఇస్తున్నాం, దీనివల్ల ఆ ప్రదేశం చల్లబడుతుంది కూడా.

ప్రత్యేకమైన బౌల్స్ ని కప్పులను ఉపయోగించుకోండి

ప్రత్యేకమైన బౌల్స్ ని కప్పులను ఉపయోగించుకోండి

వంటగది పాత్రలు, కప్పులు, సాసర్లు, ప్లేట్లు ఏవైనా సందర్శకులను ఆకర్షిస్తాయి అనేది ఒక విషయం. సాధారణమైన సాదా రూపకల్పనలకు బదులుగా, మరలా దానిని మరోసారి చూడాలి అనిపించే ప్రత్యేకమైన రూపకల్పనలను ఎంచుకోండి. మీ స్థానిక షాపులలో అలాంటివి దొరకకపోతే, ఆన్లైన్ షాపింగ్ చేయండి.

నిల్వ చేసుకునే కంటెయినర్లు

నిల్వ చేసుకునే కంటెయినర్లు

మీరు ఇతర ప్రయోజనాల కోసం కొనుగోలు చేసే సరుకులతో పాటు వచ్చిన పాత్రలను ఉపయోగించడం ఆపేయండి. వివిధ పరిమాణాలలో అదే డిజైన్లలో పాత్రలను కొనడానికి ప్రయత్నం చేయండి. దీనివల్ల వంటగది మరింత అందంగా, పద్దతిగా కనిపిస్తుంది. స్పైస్ జాడీలు ఖచ్చితమైన ఉదాహరణ.

కిచెన్ గార్డెన్ లో ఉల్లిపాయల పెంపకం..టిప్స్

డిజైనర్ డిన్నర్ సెట్లు

డిజైనర్ డిన్నర్ సెట్లు

డిజైనర్ డిన్నర్ సెట్లు మీ వంటగది అలంకరించే వస్తువులలో ముఖ్యపాత్రను పోషిస్తాయి. బ్రాండ్ కంపెనీల సెట్లకు ప్రాధాన్యం ఇవ్వండి. మీకు మీ వంటగదిలో ప్రత్యేకమైన కలరింగ్ చేయాలనుకొన్నప్పుడు, గోడ రంగుకు విరుద్ధమైన రంగుకు ప్రాధాన్యతను ఇవ్వండి. సరిగా ఏర్పాటు చేసుకున్నారా, సర్డుకున్నారా అని పరిశీలించుకోండి.

ఒక థీమ్ ని సెట్ చేసుకోండి

ఒక థీమ్ ని సెట్ చేసుకోండి

ప్రతిదీ కొనుగోలు చేసే బదులుగా మీ దృష్టిని కనుగొనండి, ఏదైనా ఒక థీమ్ లేదా కలర్ స్కీం తో కూడిన వస్తువులను కొనుగోలు చేయండి. ఇవి మీ వంటగది అందాన్ని పెంచుతాయి. మీ వంటగదిని ప్రకాశవంతం చేసే వినూత్న ఆలోచనలలో ముఖ్యమైన వాటిలో ఒకటి.

ఒక షో పీస్ ని ఉంచండి

ఒక షో పీస్ ని ఉంచండి

మీ వంటగదిని ఆర్ట్ గ్యాలరీలా తయారు చేయకండి, కానీ అదేవిధంగా, వంటగదిలోకి ప్రవేశించగానే గుర్తించే ఒక అలంకార పీస్ ని ఉంచండి. వాటికోసం ఎక్కువ ఖర్చుపెట్టాల్సిన అవసరం లేదు. ఒక ఫ్లవర్ వాజ్ ఆ ప్రయోజనానికి ఉపయోగపడుతుంది.

గోడ రంగులు

గోడ రంగులు

మీరు లేత రంగులు ఉపయోగిస్తే వంటగది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. దీనివల్ల ఆ ప్రదేశం చాలా విశాలంగా కనిపిస్తుంది. మీరు తరచుగా గోడలను మురికిగా ఉంచేట్లయితే, వాషబుల్ రంగులు వేయించుకోండి. మీరు రంగుల థీం కలవారయితే, దానికి అనుగుణంగా ప్రణాళిక వేసుకోండి.

ఫర్నిచర్, క్యాబినేట్లు

ఫర్నిచర్, క్యాబినేట్లు

ఫర్నిచర్, వంటగది క్యాబినేట్లను కొనుగోలు చేసేముందు బాగా పరిశీలించడానికి సమయం తీసుకోండి. మీ వంటగదికి ఖచ్చితంగా సరిపోయేవాటిని ఎంచుకోండి. క్యాబినేట్లకు తగినంత నిల్వ స్ధలం అవసరం, దానివల్ల మీ వంటగది అస్తవ్యస్తంగా కనిపిస్తుంది. మీ వంటగదిని ప్రకాశవంతం చేసే వినూత్న ఆలోచనలలో ఒకటి.

కాబట్టి, ఈ సూచనలను ప్రయత్నించి, ఆనందంతో ముంచేసే వంటగదికి గర్వపడే యజమానిగా ఉండి, మీ అతిధుల పొగడ్తలకు ఆనందించండి.

English summary

7 Creative Ideas To Brighten Up Your Kitchen

The most important tip is to avoid the over use of home decors. Instead, think of making the kitchen belongings a part of your kitchen décor. It is a misconception that you have to spend on costly items to make your kitchen look unique. Take some time and put in some innovative ideas to get that perfect kitchen.