Just In
- 3 hrs ago
Today Rasi Phalalu :ఓ రాశి వారు రియల్ ఎస్టేట్ వ్యాపార నిర్ణయాల్లో తొందరపడొద్దు..
- 14 hrs ago
మీ కొలెస్ట్రాల్ స్థాయిని మరియు PPని తగ్గించడానికి ఈ 3 పదార్థాల మిశ్రమాన్ని తాగడం సరిపోతుంది!
- 15 hrs ago
రాత్రి పడుకునే ముందు పాలలో చెంచా నెయ్యి కలుపుకుని తింటే ఎన్ని లాభాలో తెలుసా?
- 16 hrs ago
రొమాన్స్ లో గ్యాప్ రాకుండా చూసుకోండి.. లేదంటే ఎన్ని ప్రమాదాలో తెలుసా...
Don't Miss
- Sports
IPL 2022: ముంబై ఇండియన్స్, సీఎస్కే చెత్త రికార్డు..!
- News
పొత్తుపై పవన్ కళ్యాణ్ తాజావ్యాఖ్యలు; ఏపీలో బీజేపీ, టీడీపీ సఖ్యతకు మార్గం సుగమం చేస్తుందా?
- Automobiles
ఈ కారు వెల అక్షరాల రూ.1,105 కోట్లు..! ప్రపంచంలోనే ఇది అత్యంత ఖరీదైన కారు..!!
- Movies
మరోసారి హాట్ వీడియో వదిలిన విష్ణుప్రియ: టాప్‌ను పైకి లేపేసి అందాల జాతర
- Finance
ఈ ఏడాది నిఫ్టీకి ఇదే సెకండ్ బిగ్గెస్ట్ గెయిన్, రూ.5 లక్షల కోట్ల సంపద పెరిగింది
- Technology
స్పామ్ కాల్లతో విసిగిపోయారా? అయితే ఇలా బ్లాక్ చేయండి...
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
దివాళీ స్పెషల్: మీ ఇంటిని అలంకరించడానికి అద్భుత ఐడియాలు..!
ఇది అక్టోబర్ నెల మరియు దేశమంతా దీపాల పండగకి సన్నాహాలలో మునిగిపోయింది. దీపావళిని మనదేశంలో చాలా పెద్దఎత్తున జరుపుకుంటారు. ఏడాదంతా వేచిచూసే పండగ ఇది. ఈ పండగకి ప్రజలు నెలల ముందు నుంచే సన్నాహాలు మొదలు పెడతారు. ఇల్లు శుభ్రపరిచి, కావాల్సిన షాపింగులు అన్నీ చేసి తయారవుతారు.
పండగలో ముఖ్య విషయం ఇళ్ళని దీపాలతో అలంకరించటం. లక్ష్మీపూజకి ముందు ఇళ్లని శుభ్రపరుస్తారు ఎందుకంటే శుభ్రంగా ఉన్న ఇళ్లకే లక్ష్మీదేవి మొదట అడుగుపెడుతుందట. తర్వాత అలంకరిస్తారు. దీపావళిని దీపాల పండగ అంటారు కాబట్టి దీపాలు, లైట్లతో ఇళ్లను అలంకరిస్తారు.
ప్రతి ఇల్లు ఎలక్ట్రిక్ లైట్లతో, ప్రమిదలలోని దీపాలతో వెలిగిపోతూ లక్ష్మీదేవిని తమ ఇంటికి ఆహ్వానిస్తారు. అదేకాక మనిళ్ళకి స్నేహితులు, బంధువులు కూడా వస్తారు కాబట్టి అలంకరిస్తే ఆ వాతావరణమే మారిపోతుంది.
దీపాల అలంకరణే కాక పండగప్పుడు ఇతర అలంకరణలు కూడా చేస్తారు. మీ తర్వాత షాపింగ్ సమయంలో మీ ఇంటిని పండగకి సిద్ధం చేసుకోడానికి కొనదగిన కొన్ని వస్తువుల లిస్టును మేము పొందుపరిచాం. చదవండి-

తోరణాలు
దీపావళి అలంకరణలలో ప్రసిద్ధమైన తోరణాలను బంధన్వర్స్ అని కూడా పిలుస్తారు. వీటిని గుమ్మాలకి కడతారు. ఇవి కూడా లక్ష్మీ అమ్మ వారిని ఇళ్ళలోకి ఆకర్షిస్తాయి. మార్కెట్లో చేతితో తయారుచేసినవి, ఎంబ్రయిడరీ చేసిన రకరకాల తోరణాలు, వివిధ రంగులు, డిజైన్లలో లభిస్తాయి.మీ ఇంటికి తగ్గ విధంగా మీరు ఎంచుకోవచ్చు. పండగ శోభకి ఇవి కూడా అద్దం పడతాయి.

అలంకరణ లాంతర్లు –
ఈ దీపావళికి మీ ఇంటిని సమకాలీన పద్ధతులలో వెలిగిపోయేలా చేయాలనుకుంటే, లాంతర్లను ఎంచుకోండి. ఇవి మీ అలంకరణకే ఒక స్టైల్ ను తెస్తాయి. రోడ్డు పక్కన నుండి, ఖరీదైన స్టోర్ల వరకూ అన్ని చోట్ల అనేక రకాల డిజైన్లతో ఇవి లభిస్తాయి. తోట లేదా ఇంటిపైన పార్టీ ఇస్తున్నట్లయితే, ఇవి పండగ వాతావరణం తేవడానికి చాలా ఉపయోగపడతాయి.

ప్రమిదలు –
దీపావళికి మొదట కొనేవి ప్రమిదలు. ఈ కాలంలో వాటికి కూడా అనేక రకాలు వచ్చేసాయి. మట్టితో చేసిన ప్రమిదలలో నూనెపోసి వెలిగించే దీపాల ఫ్యాషన్ కాదు ఇప్పుడు. ఇప్పుడు వివిధ ఆకృతులలో, మెరుపులతో, మైనంతో నింపినవి, వాడటానికి సులభంగా ఉండే అనేకరకాల ప్రమిదలు వచ్చేసాయి. ఆధునికపరంగా అయితే ఎలక్ట్రిక్ ప్రమిదలు- పిల్లలు ఉన్నప్పుడు సురక్షితంగా వాడదగ్గవి. మార్పులేవైనా,వాటి పని ఒకటే- లక్ష్మీదేవి వచ్చే దారిని వెలిగిపోయేలా చేసి ఆమెను ఇంట్లోకి ఆహ్వానించటం.

రంగురంగుల ముగ్గు-
ఇంటిముందు ముగ్గును వేయటం చాలా పవిత్రంగా భావిస్తారు. ముఖ్యంగా పండగలప్పుడు తప్పనిసరి. ముగ్గులలోని సానుకూల తరంగాలు దేవతలను ఆకర్షిస్తాయని అంటారు. ఆధునిక ముగ్గులలో రంగులు, ప్రమిదలు, పువ్వులు కూడా కన్పిస్తాయి. ముందు నుంచే అలవాటు ఉండాలి కానీ, ఇప్పుడు ఆన్ లైన్ లో అనేక ముగ్గుల పాఠాలు కూడా అందుబాటులో ఉన్నాయి.

పోట్పౌర్రి-
ఆశ్చర్యకరంగా, ఎక్కువ మంది ఈ వస్తువును పండగలకి కూడా ఎంచుకుంటున్నారు. ఇవి కళ్ళకి విందే కాక, ఇళ్ళలో మంచి సుగంధం వ్యాపించేలా చేస్తాయి. ఒక ఆలోచనతో అలంకరించే పోట్పౌరి బౌల్స్ ఆధునిక మరియు సంప్రదాయ లుక్ ను మీ ఇంటికి తెస్తాయి.

విగ్రహాలు:
దీపావళి రోజున మరో ఇంటిఅలంకరణ వస్తువు విగ్రహాలు, ముఖ్యంగా దేవుని విగ్రహాలను అందంగా అలంకరించడం. అందుకు మీరు కొన్ని మొటల్ విగ్రహాలు సైడ్ టేబుల్స్ వద్ద అలంకరించండి. పక్కన లేదా ఎదురుగా కొన్ని దీపాలను వెలిగించడం ద్వారా ఆప్రదేశంలో ప్రకాశవంతంగా ఉంటుంది.

లివింగ్ రూమ్ -
ఈ గది ఆకర్షణీయంగా వుండాలి. గోడలకు మంచి రంగు వేయండి. ఇతర అలంకరణ సామాగ్రి దీపాలు, రగ్గులు కూడా ఈ గదిలో పెట్టండి. వీటి రంగులు గోడల రంగులకు వ్యతిరేకంగా వుండాలి. ఒక టేబుల్ వేసి దానిపై ఒక గాజు పాత్రలో రంగురంగుల పూలు వేయండి. అందులోనే తేలియాడే కేండిల్స్ వుంచండి. కర్టెన్లు మార్చండి. మంచి లైట్ షేడ్ లో లైట్ పెట్టి గది కి ఒక మూలగా వేలాడదీయండి.

పూజ గది -
పండుగ రోజంటే ఈ గదిని వచ్చిన అతిధులు తప్పక దర్శిస్తారు. దీని అలంకరణతోనే పండుగ వాతావరణం ప్రతిబింబిస్తుంది. రంగురంగుల పూలు, దీపాలు, రంగుల బల్బులు, రంగు రంగుల ముగ్గులు, వీటన్నిటితో అలంకరణ పూర్తయినట్లే. ముగ్గులు వేసి వాటిపై పూల రేకులు వెదజల్లితే బాగుంటుంది. ముగ్గులో దీపాలు పెట్టండి. తలుపులు, కిటికీలు, పూజా టేబుల్ మొదలైనవి పూలతో నిండి వుండాలి.

టెర్రస్ లేదా వరండా -
సాధారణంగా ఈ ప్రదేశంలో మనం క్రేకర్లు కాలుస్తాం. ఇక్కడ స్ధలం అధికం కనుక చాలా దీపాలు పెట్టవచ్చు. వరండా అంచులు ఎలక్ట్రిక్ లైట్లు తోరణాలు పెట్టండి. లేదా విభిన్నంగా వుండాలంటే, రంగు రంగుల కేండిల్స్ పెట్టండి. వాసన వచ్చే కేండిల్స్ అయితే చక్కటి సువాసన వస్తుంది. ఈ దీపాలు క్రేకర్స్ అంటించుకునేటందుకు సౌకర్యంగా కూడా వుంటాయి. వరండా ప్రవేశంలో ఆకర్షణీయమైన రంగుల ముగ్గు వేసి దీపాలు పెడితే అలంకరణ పూర్తయినట్లే. ఇంటికి వెలుగులు రావాలంటే ఈ అలంకరణ దీపావళికి చేయండి.

అరోమాటిక్ క్యాండిల్స్:
ఇవి యే గిఫ్ట్ స్టోర్‌లో అయినా దొరుకుతాయి.ఇవి వెలిగించగానే ఇల్లంతా సుగంధ భరితం అవుతుంది.చాలా మంది ఈరోజు లక్ష్మీ పూజ కూడా చేస్తారు కదా. అటువంటప్పుడు ఇవి వెలిగిస్తే ఒక విధమైన భక్తి భావన కలుగుతుంది.