For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మదర్స్ డే స్పెషల్ : అమ్మకు ప్రేమతో అందించే గిప్స్ట్ ఇంట్లో తయారుచేసుకోవడం ఎలా..?

By Lekhaka
|

“భగవంతుడు అన్నిచోట్ల ఉండలేదు కాబట్టి, అమ్మని సృష్టించాడు” అని ఒక ప్రసిద్ధ నానుడి ఉంది. అది ఎంత నిజమో అనేది అందరికీ తెలుసు!


ఒక బిడ్డ అనుబంధం అతను/ఆమె కు తన తల్లితో చాలా ప్రత్యేకమైనది.

ఒక తల్లి శారీరకంగా 9 నెలల బాధను భరించినప్పటికీ, ఆ బాధను ఎల్లప్పుడూ భరిస్తూనే ఉంటుంది, తన పిల్లలు ఎటువంటి ప్రతికూల పరిస్థితుల నుండి బాధపడకూడదని అనుకుంటుంది.

అందువల్ల, మీ జీవితంలో అత్యంత ప్రాధాన్యత గల వ్యక్తికీ ధన్యవాదాలు తెలియచేయడానికి ఒక ప్రత్యేకమైన రోజే అవసరం లేదు, అయినప్పటికీ ఈ 2017 మే 14 మీ జీవితంలో ఈ ప్రత్యేకమైన రోజుని స్త్రీలకూ అంకితం చేయండి.

సరే, ఒక స్త్రీ మనకు ఎంత ప్రత్యేకమో ఎందుకు చూపించరు. మీరు వివిధ రకాల వస్తువుల ద్వారా వాటి ప్రత్యేకతను తెలియచేయండి. ఆమెకు ప్రత్యేకమైన బహుమతులను ఎంచుకోండి; అయితే, మీ స్పర్శతో కూడిన సృష్టికి మించిన వ్యక్తిగత బహుమతి లాంటిది మరోటి ఉండదు.

మీరు మీ అమ్మ కోసం కొన్ని బహుమతుల ఆలోచనలు చేస్తుంటే, ఇంకేం చేయకండి, నీకు సహాయం చేసేందుకే మేము ఇక్కడ ఉన్నాము అని చెప్తే చాలు. మీరు మీ అమ్మని ఎంతో ప్రేమతో, ఆశ్చర్యపరిచేలా చేయడానికి కింద కొన్ని మంచి వ్యక్తిగత బహుమతులను సూచి౦చాము. వాటిని చూడండి.

వంటగదిలో చేతికి/నిత్యావసరాల కిట్:

వంటగదిలో చేతికి/నిత్యావసరాల కిట్:

తల్లులు మన కుటుంబానికి సూపర్ హీరోలు. వారు ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. అందుకని వారికి చేతికింద కొన్ని వస్తువులు అవసరమవుతాయి. తేలికైన సంచులతో, ఈ తేలికైన కిట్ ని మీరు ఇంట్లోనే తయారుచేయవచ్చు. ఇది చూడడానికి ఒక పార్స్ లా ఉండి, క్యారీ చేయడానికి తేలికగా ఉంటుంది.

చెక్క మెనూ కార్డ్:

చెక్క మెనూ కార్డ్:

ఇది తినడానికి ఇష్టపడే పిల్లల కోసం, తినిపించడానికి ఇష్టపడే తల్లుల కోసం. మీరు ఈ మెనూ కార్డ్ ని మీకోసం మీ అమ్మ ఆమె వంటకాల జాబితాను రాసుకోడానికి వంట గది గోడమీద అతికించండి.

ఇంట్లోతయరుచేసిన ఫోటో ఫ్రేమ్:

ఇంట్లోతయరుచేసిన ఫోటో ఫ్రేమ్:

ఒకదాన్ని కొనడానికి బదులుగా, ఇంట్లోనే తయారుచేయండి. అలా చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి. మీ ఇంట్లో ఒక పాత ఫోటో ఉన్నట్లయితే, దాన్ని రంగుదారలతో కప్పి, ఆ దారాలతో మీరు ఇష్టపడే డిజైన్ లేదా రెండు పూలతో అలంకరించండి. అందులో మీ ఫోటోలు, మీ అమ్మతో గడిపిన అందమైన సమయలతో కూడినవి జతపరిచి, అదే ఆమెకు బహుమతిగా ఇవ్వండి.

అందమైన వాజ్:

అందమైన వాజ్:

మీరు పాత వాజ్ తో విసుగుచెందారా? అయితే, దానికి ఒక అంద౦గా తయారుచేయండి! మీరు అద్దాలు, రంగుల పేపర్లు, పెయింట్లు మొదలైనవి ఉపయోగించి పాత వాజ్ ని కొత్త బ్రాండ్ లా కనిపించేలా చేయండి. మీరు ఇంటిని అలంకరించడానికి ఎంత అస్శక్తి చూపిస్తున్నారో చూసి నిజంగా మెచ్చుకుంటారు.

ఇంట్లో తయారుచేసే కార్డ్ లు:

ఇంట్లో తయారుచేసే కార్డ్ లు:

మీరు ఈ ఆలోచనలతో ఊహల్లో తేలిపోవచ్చు. మీ ఫామిలీ ఫోటో తో ఒక కోలేజ్ ని తయారుచేసి ఆమెకు బహుమతిగా ఇవ్వండి. అందమైన కార్డ్లు తయారుచేయడానికి మీరు వినూత్నమైన ఆలోచనలతో ముందుకు వచ్చి, వాటిని మీ అమ్మకు మదర్డ్ డే రోజు బహుమతిగా ఇవ్వండి.

ఇంట్లో తయారుచేసిన క్యాండిల్స్:

ఇంట్లో తయారుచేసిన క్యాండిల్స్:

మీరు ఏవైనా సుగంధ భరితమైన క్యాండిల్స్ తయారుచేయాలనే ఆలోచన వస్తే, అంతకంటే మంచిది లేదు అని చెప్పగలము. కాకపోతే, మీరు ఇంట్లోనే క్యాండిల్స్ ని తయారుచేయవచ్చు. మీ ఇంట్లో వదిలేసినా క్యాండిల్స్ ఉన్నాయా? అయితే, వాటిని కరిగించి, ఆ లిక్విడ్ ని మౌల్డ్స్ లో పోయండి. చల్లారాక, అందమైన క్యాండిల్ తయారవుతుంది.

సువాసనతో కూడిన సబ్బు:

సువాసనతో కూడిన సబ్బు:

తల్లులు సాధారణంగా కుటుంబంలో ప్రతి ఒక్కరినీ పట్టించుకోడంలో మునిగి వారిని వారు పట్టించుకోడానికి సమయం ఉండదు. చేమంతి లేదా లావెండర్ తో ఒక సబ్బుని తయారుచేయమని సూచిస్తున్నాము, ఇది ఆమె చర్మాన్ని మృదువుగా చేసి, శరీరానికి విశ్రాంతిని ఇస్తుంది, ఆమె చర్మానికి సంరక్షణగా కూడా ఉంటుంది. మీరు ఏదైనా DIYs ఇంట్లో వాటిని ఎలా తయారుచేయాలో నేర్చుకోండి, అవి నిజంగా చాలా తేలిక, మన కష్టానికి విలువ కూడా ఉంటుంది.

అయితే, ఇవే మదర్స్ డే రోజు మీర్ ఇంట్లోనే తయారుచేస్ వివిధ రకాల బహుమతుల ఆలోచనలు; అయితే, మీ అమ్మకు అత్యంత ప్రధానమైన బహుమతి పైవాటికంటే ఎక్కువ ఖచ్చితంగా మీరు చూపించే LOVE.

English summary

Brilliant Gift Ideas For Mother's Day | మదర్స్ డే రోజున అమ్మకు అందివ్వాల్సిన గిప్ట్స్ |మదర్స్ డే కోసం ఇంట్లో తయారుచేసుకునే బహుమతులు

Surprise your mother with some special homemade gifts on this mother's day, here are some amazing ideas, check it out and try now.