For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నవరాత్రి కోసం ఆసక్తికరమైన గోలు ధీమ్స్ (బొమ్మల కొలువు/బొమ్మల అలంకరణ)

By Lekhaka
|

నవరాత్రి అనేది తొమ్మిది రోజుల పండుగ. ఈ పండుగను భారతదేశంలో ప్రతి సందులో చాలా ఆనందంగా జరుపుకుంటారు. హిందీలో నవరాత్రి అంటే తొమ్మిది రోజులు అని అర్ధం. ఈ తొమ్మిది రోజులు దుర్గా దేవిని వేర్వేరు రూపాల్లో పూజిస్తారు. పదోవ రోజును విజయదశమి లేదా దసరా అని పిలుస్తారు. సాధారణంగా మొదటి మూడు రోజులు దుర్గా దేవిని, ఆ తర్వాత మూడు రోజులు లక్ష్మి దేవిని,ఆ తర్వాత మూడు రోజులు సరస్వతి దేవిని పూజిస్తారు.

దక్షిణ భారతదేశంలో పవిత్రమైన ప్రదేశాలను "గోలు" అని పిలుస్తారు. గోలు లేదా కోలు అంటే ప్రదర్శన అని అర్ధం. దక్షిణ భారతదేశంలో ప్రజలు తమ ఇంటిలో బొమ్మలు మరియు విగ్రహాలను అందంగా అలంకరిస్తారు. ఇది ప్రధాన దేవతలను సూచిస్తుంది.

నవరాత్రి కలర్ ఫుల్ గా ఉండాలంటే? ఇంటి అలంకరణ చిట్కాలునవరాత్రి కలర్ ఫుల్ గా ఉండాలంటే? ఇంటి అలంకరణ చిట్కాలు

దుర్గా దేవి ఈ తొమ్మిది రోజులు తమ నివాసంలో నివసిస్తుందని నమ్మకంతో స్వీట్స్ నైవేద్యం పెడతారు. నవరాత్రి గోలు కోసం అనేక రకాల గోలు ధీమ్స్ ఆలోచనలు ఉంటాయి. ఉదాహరణకు జూ థీమ్, పార్క్ థీమ్, చెరువు థీమ్ వంటి ఆలోచనలు ఉంటాయి.

మీరు తొమ్మిది రోజులు గోలు ధీమ్స్ చేయలేకపోతే చివరి మూడు రోజులు చేసిన మంచి ఫలితం కలుగుతుంది. నవరాత్రికి అత్యుత్తమైన గోలు ఆలోచనలను తెలుసుకుందాం.

గోల్డెన్ గోలు థీమ్

గోల్డెన్ గోలు థీమ్

ఈ ధీమ్ ని నవరాత్రి కోసం ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ థీమ్ లో అష్ట లక్ష్మి, దశావతారాలు,ఉత్సవ వెంకటేశ్వర స్వామి,రామాయణం వంటి వివిధ రకాల సమూహాలు ఉంటాయి. ఈ థీమ్ బంగారం వలె మెరుస్తూ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

భిన్నత్వంలో ఏకత్వం (మతపరమైన గోలు థీమ్)

భిన్నత్వంలో ఏకత్వం (మతపరమైన గోలు థీమ్)

ఈ థీమ్ లో గోలు లేదా బొమ్మలు మరియు చెట్లను రక్షించే విధంగా ఉండి ప్రారంభంలో భారత మాత ఉంటుంది. అలాగే ఈ ధీమ్ భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లోని స్త్రీలను కూడా వర్ణిస్తుంది. ఈ గోలు థీమ్ లో జాతీయ పక్షి,జాతీయ పుష్పం,జాతీయ జంతువు కూడా ఉంటాయి. ఈ థీమ్ లోకి ప్రవేశించాక గరుడ వాహనం, తిరుపతి పెరుమాళ్ తాయార్, శ్రీనివాస పెరుమాళ్ కళ్యానం అలాగే సాధారణ గ్రామ జీవితం కూడా ఉంటుంది. ఇంకా ముందుకు వెళ్ళితే గుహ లక్ష్మీని, అలాగే విభిన్న మతాలు మరియు మహిళల పరిణామాలను చూడవచ్చు.

సామజిక గోలు థీమ్

సామజిక గోలు థీమ్

ఈ థీమ్ సాంస్కృతిక నేపథ్యంతో సంబంధం లేకుండా.అందరికీ ఒక సామాజిక సందేశాన్ని ఇస్తుంది. ఇది సాధారణంగా కుడి వైపు 3 ఎడమ వైపు 3 కిందకు ఒక థీమ్ తో ఉంటుంది. ఎడమ వైపు గురువాయురప్పన్, లక్ష్మి, కృష్ణ, రాధా, దుర్గా దేవి, సరస్వతి దేవి, విటల్ మరియు రుక్మయి ఉంటారు.

కృష్ణుని శ్రావ్యమైన వేణు గానంను వింటూ రాధా మరియు గోవులు ఉంటాయి. ఎడమ వైపు రెండో లైన్ లో కార్తీక్,దేవజని, కృష్ణ,వాసుదేవుడు,వల్లి మరియు గరుడా, విష్ణు, పద్మావతి మరియు బాలాజీ ఉంటారు. ఇక మూడో లైన్ లో రామాయణంలో పాత్రలు రాముడు,సీత,లక్ష్మణుడు,శంకరాచార్య,హనుమంతుడు మరియు శివుడు,పార్వతి,వినాయకుడు మరియు ఇతర దేవతలు ఉంటారు .

కింద భాగంలో పండ్లు,కూరగాయలు వంటివి ఉంటాయి. మధ్య భాగంలో అమ్మాయిలను రక్షించండి వంటి సాంఘిక సందేశం మరియు దానికి సంబందించిన చిత్రాలు ఉంటాయి.

సౌర వ్యవస్థ గోలు థీమ్ (నవగ్రహ ఆలయాలతో పాటు)

సౌర వ్యవస్థ గోలు థీమ్ (నవగ్రహ ఆలయాలతో పాటు)

ఈ థీమ్ 9 గ్రహాల యొక్క టెలిస్కోపిక్ వీక్షణలను కలిగి ఉంటుంది. అంతేకాక నవగ్రహాల ఆలయాల నమూనాలు కూడా ఉంటాయి. ప్రతి గ్రహం సంబంధిత రాళ్లతో సరిహద్దును కలిగి ఉంటుంది. తొమ్మిది గ్రహాలు తొమ్మిది రంగులకు ప్రాతినిధ్యం వహిస్తాయి. వాటి గురించి తెలుసుకుందాం.

అంగారకుడు - పెద్ద అగ్నిపర్వతాలు, ఎరుపు పగడాల రాళ్ళు మరియు వైధేశ్వరన్ ఆలయంతో ప్రదర్శించబడుతుంది.

సూర్యుడు - ఎరుపు రంగు, ఎర్రని వేడి బాల్ మరియు సూర్యనారాయణ టెంపుల్

శుక్రుడు - వజ్రం, ఎత్తైన పర్వతాలు, ఎర్ర రంగు, వేడి గ్రహం మరియు కన్జనూర్ టెంపుల్

బుధుడు - ఆకుపచ్చ రంగు, బూడిద క్రేటర్స్, పచ్చ మరియు తిరువెంకరు దేవాలయం

భూమి - జీవితం యొక్క పూర్తి గ్రహం, భాస్కర, ఆర్యభట్ట,బ్రహ్మగుప్త, గెలీలియో ఆవిష్కరణ - టెలిస్కోప్

చంద్రుడు - ముత్యం, తెలుపు రంగు,తింగలూర్ టెంపుల్ మరియు ఉపగ్రహము

గురుడు - పసుపు రంగు, పసుపు నీలం, పసుపు-ఆకుపచ్చ వృత్తాలు మరియు అలంగుడి ఆలయం

ప్లూటో - ఘనీభవించిన గ్యాస్ తో ఉండే గ్రహం

శని - గోధుమ, పసుపు మరియు తెలుపు రంగు, నీలం రాయి, రంగుల రింగులు

నెప్ట్యూన్ - సముద్ర నీలం రంగు

యురేనస్ - ఆకుపచ్చ నీలం

మీనాక్షి కళ్యాణం థీమ్

మీనాక్షి కళ్యాణం థీమ్

ఈ థీమ్ లో మీనాక్షి ఆలయాన్ని ప్రతిబింబించే నమూనా కలిగి ఉంటుంది. ఈ ధీమ్ ని కార్డ్ బోర్డు మరియు ప్యాకింగ్ సామగ్రిని ఉపయోగించి తయారుచేస్తారు. ఈ కథలో 12 భాగాలు ఉన్నాయి. అయితే ప్రధాన గోలులో 2 సన్నివేశాలను మరియు ఆలయం యొక్క రెండు భాగాలను ప్రదర్శిస్తారు.

శ్రీపురం గోల్డెన్ టెంపుల్ థీమ్

శ్రీపురం గోల్డెన్ టెంపుల్ థీమ్

ఈ థీమ్ వెల్లూర్ లో ఉన్న శ్రీపురం లోని గోల్డెన్ టెంపుల్ యొక్క ప్రతిరూపాన్ని కలిగి ఉంటుంది. మీరు నక్షత్రపు ఆకారాన్ని (శ్రీ చక్రా అని కూడా పిలుస్తారు) మధ్యలో ఉన్న మార్గాన్ని మరియు చుట్టూ పచ్చదనంతో నిండి ఉంటుంది.

శ్రీ చక్రం చుట్టూ పాటలు పాడే భక్తులు ఉంటారు. మొత్తం ఆలయాన్ని అలంకరించడానికి రీసైకిల్ చేసిన వస్తువులను ఉపయోగిస్తారు. శ్రీ చక్రాన్ని హైలైట్ చేయడానికి లెడ్ దీపాలతో అలంకరిస్తారు.

దీనితో పాటు ప్రధానమైన గోలు 7 దశలలో ఉంటుంది. అదనంగా థర్మోకొల్ ని ఉపయోగించి మహిషసురా మార్దిని మరియు దుర్గా దేవి లను పెద్ద పరిమాణంలో తయారుచేయవచ్చు.

కన్యాకుమారి థీమ్

కన్యాకుమారి థీమ్

ఈ థీమ్ కన్యాకుమారి కథను వర్ణిస్తుంది. మీరు సముద్రాన్ని తయారు చేసేందుకు నీలం రంగు సెల్లోఫేన్ కాగితాన్ని ఉపయోగించవచ్చు. సీషోర్ చేయడానికి ఇసుక ఉపయోగించండి. కథ సముద్ర తీరంలో బొమ్మలతో చిత్రీకరించబడాలి. మీరు ప్లాస్టిక్ బొమ్మలను పురాణ పాత్రల ప్రకారం రంగుల దుస్తులతో అలంకరించాలి. మరొక వైపు ఒక సరస్సులో ఒక ప్లాస్టిక్ పడవలో గోపికలతో శ్రీ కృష్ణుని రాసలీలలు చూపించవచ్చు.

ఐర్లాండ్ గోలు థీమ్

ఐర్లాండ్ గోలు థీమ్

ఈ థీమ్ క్రింది దశలను కలిగి ఉంటుంది:

1) వివాహ వేడుక

2) త్రిమూర్తులు మరియు దేవతలు

3) దశావతారాలు

4) ఇంద్రుడు సభలో మేనక,రంభ మరియు ఊర్వశి నృత్య ప్రదర్శన చేయటం

5) పొంగల్ వేడుకలు

6) ముగ్గురు దేవతలు

7) అష్టాలక్ష్మి మరియు వైకుంఠం

పార్క్ గోలు థీమ్

పార్క్ గోలు థీమ్

మీరు ఒక పార్క్ గోలు థీమ్ ను తయారుచేయవచ్చు. దీనిలో ఆలయం మరియు ఆలయం నుండి ఊరేగింపును చేయవచ్చు. అలాగే పూజారులు, బ్యాండ్ వంటి వర్గీకృత అంశాలను ప్రాతినిధ్యం వహించే బొమ్మలను పెట్టవచ్చు. అన్ని వస్తువులను మీరు సొంతంగా తయారుచేయవచ్చు. మీరు నదిలో బోట్లు మరియు నౌకలను ఉంచవచ్చు. వాటికి సెయిలింగ్ చూపవచ్చు.అంతేకాకుండా మీరు దేవాలయానికి దగ్గరగా ఉన్న గ్రామాలను కూడా తయారు చేయవచ్చు.

English summary

నవరాత్రి కోసం ఆసక్తికరInteresting Golu Themes This Navratriమైన గోలు ధీమ్స్

This navratri check out some of the special golu themes that you can decorate in your house.
Story first published:Saturday, September 23, 2017, 9:56 [IST]
Desktop Bottom Promotion