For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉత్తమమైన కిచెన్ క్లీనింగ్ హ్యాక్స్

|

కిచెన్ ని పరిశుభ్రంగా ఉంచుకోవడమనేది ఒక రకంగా కళే. ఎన్ని జాగ్రత్తలు తీసుకుని శుభ్రపరచినా కిచెన్ లో ఎక్కడో ఒక చోట అపరిశుభ్రత తాండవిస్తుంది. ఇది, కాస్తంత ఇబ్బందికరంగా ఉంటుంది. స్టవ్ ని అలాగే కౌంటర్ టాప్స్ ని శుభ్రపరిచేటప్పుడు అలాగే కిచెన్ లో పేరుకున్న మొండి జిడ్డును వదిలించుకునేందుకు ప్రయాస పడవలసి వస్తుంది. ఇటువంటి సమస్యలతో మీరు కూడా ఇబ్బంది పడుతున్నారా? అయితే, మీ కోసమే మేము కొన్ని చిట్కాలను తీసుకువచ్చాము. ఇప్పటి వరకు ప్రొఫెషనల్ గ్రేడ్ క్లీనింగ్ ప్రోడక్ట్స్ పై డబ్బును ఖర్చు పెట్టి కిచెన్ శుభ్రంగా తయారవుతుందని భావించి ఉండవచ్చు. అయినా, మీరు ఆశించిన ఫలితాన్ని మీరు పొందలేకపోయి ఉండవచ్చు.

ఇక్కడ మేము ప్రస్తావించిన కిచెన్ హ్యాక్స్ అనేవి మీ కిచెన్ ను శుభ్రంగా మారుస్తాయి. ఇంతకాలం, మీరు కోరుకుంటున్న పరిశుభ్రమైన కిచెన్ ను మీకు అందించడానికి తమ వంతు పాత్ర పోషిస్తాయి. ఇంతకు ముందు మీరు కిచెన్ క్లీనింగ్ కోసం వాడిన కమర్షియల్ ప్రోడక్ట్స్ ఇవ్వలేనటువంటి శుభ్రతను మీకు ఈ సులభమైన హ్యాక్స్ అందిస్తాయి. ఇంకొక ఆసక్తికర విషయం ఏంటంటే, ఈ రెమెడీస్ కై మీరు కమర్షియల్ క్లీనింగ్ ప్రోడక్ట్స్ పై పెట్టినంత ఖర్చును పెట్టనవసరం లేదు. ఇవి చౌకగా అందుబాటులో ఉంటాయి. అదే సమయంలో వీటి నుంచి లభించే ఫలితం అద్భుతంగా ఉంటుంది. నిజానికి ఇవన్నీ, పర్యావరణ స్నేహపూర్వక ప్రత్యామ్నాయాలు. వీటిని పాటించడం వలన పర్యావరణానికి నష్టం కలగదు. ఇటువంటి అద్భుతమైన అలాగే సమర్థవంతమైన క్లీనింగ్ హాక్స్ గురించి మీరు ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు. ఇంకెందుకాలస్యం, ఈ క్లీనింగ్ హ్యాక్స్ ను పరిశీలించండి మరి.

1. బేకింగ్ సోడా:

1. బేకింగ్ సోడా:

బేకింగ్ సోడా అనేక విధాలా ఉపయోగకరంగా ఉంటుంది. కేక్స్ లో అలాగే హోంమేడ్ బ్రెడ్స్ లో దీని వినియోగం మనకి తెలుసు. పళ్ళని తెల్లపరచడంలో అలాగే నోటి దుర్వాసనను దూరంగా ఉంచడంలో దీని పాత్ర అమోఘం. ఇంకా ముఖ్యంగా, దీని నుంచి మరెన్నో ప్రయోజనాలను పొందవచ్చు. ఇది ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్. కిచెన్ ను శుభ్రపరచడంలో ఇది ముఖ్య పాత్ర పోషిస్తుంది. గ్యాస్ స్టవ్ ను కూడా శుభ్రపరుస్తుంది. మీరు ఇప్పడివరకు వాడుతున్న ఖరీదైన సంప్రదాయ క్లీనర్స్ ను పక్కకి పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. డేంజరస్ కెమికల్స్ తో నిండి ఉండే ఈ క్లీనర్స్ వలన ఉపయోగం కంటే నష్టమే ఎక్కువ. అలాగే, కమర్షియల్ క్లీనర్స్ నుంచి వచ్చే వాసనను కూడా భరించడం కష్టం. కాబట్టి, బేకింగ్ సోడాను వాడటం ద్వారా మార్కెట్ లో లభ్యమయ్యే క్లీనింగ్ ప్రోడక్ట్స్ ద్వారా తలెత్తే అనేక నష్టాలను తగ్గించుకోవచ్చు. కిచెన్ ను పరిశుభ్రంగా ఉంచుకోవచ్చు.

2. అమోనియా:

2. అమోనియా:

కిచెన్ లో అనేక సమస్యలు ఎదురవుతాయి. గ్యాస్ స్టవ్ బర్నర్ లో ఉండే గ్రేట్స్ ను మేనేజ్ చేయడం మరింత కష్టమైన పని. ఇది గ్రీజ్ కు అలాగే డర్ట్ కు మ్యాగ్నెట్ లా వ్యవహరిస్తుంది. ఈ సమస్య మీరెప్పుడైనా ఫ్రైస్ ను చేసేటప్పుడు మరింత ఎక్కువవుతుంది. ఫ్రైస్ చేసేటప్పుడు నూనె చిందడం ద్వారా స్టవ్ బర్నర్ గ్రేట్స్ అనేవి అపరిశుభ్రంగా మారతాయి. వీటిని క్లీన్ చేయడం కష్టమవుతుంది. ఈ డర్టీ గ్రేట్స్ ను రీప్లేస్ చేయడానికి కొంత డబ్బును ఖర్చుచేయవలసి వస్తుంది. అయితే, ప్రతీ సారి వీటిని రీప్లేస్ చేసేబదులు వీటిని శుభ్రపరచుకునే సులభ చిట్కాలను తెలుసుకుంటే డబ్బు, సమయం అలాగే వీటిని క్లీన్ చేయడానికి అవసరమైన ఎనర్జీని అదా చేసుకోవచ్చు. కాబట్టి, ఇక్కడ అమోనియా అద్భుతంగా ఉపయోగపడుతుంది. గ్యాస్ స్టవ్స్ ని క్లీన్ చేసేటప్పుడు అమోనియాను వాడటం వలన మీకు సమయం వృధా అవాదు. డబ్బు కూడా ఆదా అవుతుంది. అనవసరంగా ప్రయాసకు గురవనవసరం కూడా లేదు. ఒక రెస్పాన్సబిల్ హోమ్ మేకర్ గా మీరు గ్యాస్ స్టవ్ ని అలాగే కిచెన్ ను శుభ్రపరచాలి అనుకోవడం సహజమే. మీ ఆలోచనకు అమలులో పెట్టేందుకు అమోనియా అనేది తోడ్పడుతుది. గ్యాస్ స్టవ్ ని క్లీన్ చేసేటప్పుడు అమోనియాను వాడి చూస్తే మీరు ఆశించిన ఫలితం లభిస్తుంది.

3. నిమ్మ, వినేగార్ మరియు సోడా కాంబినేషన్:

3. నిమ్మ, వినేగార్ మరియు సోడా కాంబినేషన్:

గార్బేజ్ డిస్ఫోజల్ యూనిట్ ను శుభ్రపరచడం అలాగే స్టెయిన్డ్ కిచెన్ సింక్ ను శుభ్రపరచడం కాస్తంత ఛాలెంజింగ్ టాస్క్ అని మనకు తెలిసిన విషయమే. వీటిని క్లీన్ చేయడం కోసం అనేక ప్రోడక్ట్స్ డిజైన్ చేయబడ్డాయి. ఇవి మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. ఆహారపు మిగుళ్ళని, డర్ట్ ను అలాగే మరికొంత చెత్తను తొలగించి క్లాగ్ అయిన సింక్ డ్రెయినేజ్ పాత్ వేను తిరిగి మాములుగా పనిచేసేలా చేయడం వీటి ఉద్దేశ్యం. అయితే, మీరు ఒకవేళ ఎకో ఫ్రెండ్లీ ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నట్టయితే ఈ విషయంలో మీరు ఇంక దిగులు చెందనవసరం లేదు. ఖరీదైన సింక్ క్లీనర్స్ కంటే హోమ్ రెమెడీస్ అద్భుతంగా పనిచేస్తాయి. వీటి వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. డబ్బుతో పాటు సమయం అదా అవుతుంది. అద్భుతమైన ఫలితాలను మీరు గమనించగలుగుతారు. నిమ్మను కిచెన్ క్లీనింగ్ లో ఎంత సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చో తెలిస్తే మీరు సంభ్రమాశ్చర్యాలకు గురవడం జరుగుతుంది. నిమ్మతో పాటు వినేగార్ మరియు బేకింగ్ సోడాలను కూడా ఉపయోగిస్తే మీరు కిచెన్ ను పరిశుభ్రంగా చేసుకోవచ్చు. సులభమైన పద్దతిలో ఈ మూడింటి కాంబినేషన్ తో మీ కిచెన్ శుభ్రంగా తళతళలాడుతుంది. వినేగార్ మరియు నిమ్మ కాంబినేషన్ ను వివిధ విధాలుగా వాడటం వలన కిచెన్ లో మీరు శుభ్రతను గమనించవచ్చు. ఈ రెండూ కిచెన్ క్లీనింగ్ లో మ్యాజిక్ ఇంగ్రీడియెంట్స్ గా పేరొందాయి. గార్బేజ్ డిస్పోజల్ ను క్లీన్ చేసి స్టెయిన్లెస్ స్టీల్ కిచెన్ సింక్ లో పేరుకున్న గ్రీజ్ ను సులభంగా శుభ్రపరుస్తుంది. అలాగే, ఫ్రిడ్జ్ లో తరచూ ఎదురయ్యే దుర్వాసనను కూడా ఈ రెమెడీతో తగ్గించుకోవచ్చు. ఈ కిచెన్ హ్యాక్ అనేది అత్యంత సమర్థవంతమైనది అలాగే ఈ హ్యాక్ తో కిచెన్ తో పాటు ఫ్రిడ్జ్ ను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవచ్చు. ఈ చిట్కా మీకెంతో ఉపశమనాన్ని అందించి ఉంటుంది కదూ.

4. వేడి చేసిన లెమన్ వాటర్

4. వేడి చేసిన లెమన్ వాటర్

కిచెన్ ను పరిశుభ్రంగా ఉంచుకునే విషయంలో మైక్రో వేవ్స్ ను ఇగ్నోర్ చేయడం జరగడం సహజం. కిచెన్ అప్లయన్సెస్ ను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడం ముఖ్యం. మైక్రో వేవ్స్ ను పరిశుభ్రపరచుకోవడం కొంత ఛాలెంజింగ్ టాస్క్. దీన్ని క్లీన్ చేయాలంటే మనం మరింత శ్రద్ధను కనబరచాలి. కిచెన్ సింక్స్ లాగా అలాగే స్టవ్స్ లాగా మైక్రో వేవ్స్ ను క్లీన్ చేయడం కాస్తంత కష్టతరమే. వీటిలో కూడా జిడ్డు పేరుకుపోవడం మనకు తలనొప్పిని కలిగిస్తుంది. అందుకే, తరచూ వీటిలోని జిడ్డును తొలగించుకోవాలి. లేదంటే, ఒక్కసారిగా జిడ్డును పూర్తిగా తొలగించుకోవడం ప్రయాసను కలిగిస్తుంది. మైక్రో వేవ్స్ లో ని జిడ్డును సులభంగా, సమర్థవంతంగా అలాగే త్వరగా సహజమైన పద్దతిలో తొలగించుకోవాలంటే మీరు ఈ చిట్కాను పాటించాలి. కాస్తంత నీటిని ఒక కంటైనర్ లోకి తీసుకోండి. దాంట్లో నిమ్మను జోడించండి. దాన్ని మైక్రో వేవ్ లో ఉంచి వేడి చేయండి. ఇప్పుడు ఈ హాట్ లెమన్ వాటర్ ను పేరుకుపోయిన జిడ్డును తొలగించుకోవడానికి వాడుకోవచ్చు. అలాగే, వాటర్ ని వేడిచేస్తున్నప్పుడు అందులోంచి వచ్చిన ఆవిరి కూడా జిడ్డును సులభంగా తొలగించేందుకు తోడ్పడుతుంది. ఈ విధంగా మైక్రో వేవ్ ను శుభ్రపరచుకోవడం ద్వారా దాన్ని తిరిగి బ్రాండ్ న్యూ మైక్రో వేవ్ గా మార్చుకోవచ్చు.

5. తర్తార్ మరియు నీళ్లు:

5. తర్తార్ మరియు నీళ్లు:

బేకింగ్ సోడా అనేది కిచెన్ లోని జిడ్డును తొలగించి కిచెన్ ను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు అందుబాటులో ఉండే ప్రోడక్ట్. ఇది కిచెన్ తో పాటు అప్లయన్సెస్ లో పేరుకున్న జెర్మ్స్ మరియు బాక్టీరియాను సైతం తొలగిస్తుంది. అయితే, స్టెయిన్ లెస్ స్టీల్ టోస్టర్ ను మంచి కండిషన్ లో ఉంచుకోవాలంటే మీరు దాన్ని తరచూ శుభ్రపరచుకోవాలి. తద్వారా, అది మీకు మరింత ఉపయోగకరంగా ఉంటుంది. ఇక్కడ మీకోసం, స్పెషల్ క్లీనింగ్ హ్యాక్ ను వివరించబోతున్నాము. ఈ సినారియోకు ఇది అత్యద్బుతంగా ఉపయోగపడుతుంది. ఈ హ్యాక్ కోసం మీరు క్రీమ్ ఆఫ్ టార్టార్ ను అలాగే కొంత నీళ్లను తీసుకోవాలి. వీటితో టోస్టర్ ను క్లీన్ చేయడానికి ప్రయత్నించండి. ఈ మిశ్రమం ద్వారా మీరు పొందే ఫలితం మిమ్మల్ని కచ్చితంగా ఆశ్చర్యంలో ముంచెత్తుతుంది.

6. డ్రైయర్ షీట్:

6. డ్రైయర్ షీట్:

ఈ కిచెన్ క్లీనింగ్ హ్యాక్స్ లో దీని కున్న ప్రత్యేకత అపారం. దీని వలన వచ్చే ఉపయోగం మిమ్మల్ని కచ్చితంగా ఆశ్చర్యంలో ముంచెత్తుతుంది. దీని ఒకసారి ప్రయత్నించి చూడండి. దీని వాడటం ద్వారా జిడ్డు, డర్ట్ అలాగే బేక్డ్ ఫుడ్స్ కి సంబంధించిన మిగుళ్లు ప్యాన్ కి అతుక్కుని ఉన్నవి ఇవన్నీ సులభంగా తొలగిపోతాయి. ఇవన్నీ, సాధారణ క్లీనింగ్ పద్దతులలో తొలగిపోవు. వీటిని తొలగించాలంటే ఒక డ్రయర్ షీట్ ను ఒక లేయర్ లా ఉంచి ఇప్పుడు ప్యాన్ లో కాస్తంత వెచ్చటి నీటిని వేసి నింపాలి. నీళ్లు ఆ షీట్ ను టచ్ చేసినప్పుడు ఆ షీట్ అనేది డర్ట్ ను అలాగే జిడ్డును ఆకర్షించి క్లీనింగ్ ప్రాసెస్ ను స్టార్ట్ చేస్తుంది. ఈ పద్దతిలో జిడ్డును అలాగే డర్ట్ ను వేగవంతంగా అలాగే సమర్థవంతంగా క్లీన్ చేసుకోవచ్చు.

English summary

Best Of Kitchen Cleaning Hacks

If you feel that cleaning your stove or your counter-tops, or even removing that stubborn grease off your kitchen when it simply doesn't go away, is more difficult than it might appear, we are here to help.And if you've invested too much money in the professional-grade cleaning products, always hoping that they would dissolve the dirt and finally make it a little bit easier for you to clean up your kitchen and then failed to do the same, these kitchen hacks that we have listed below will help you much more than you can imagine.
Story first published: Tuesday, June 19, 2018, 14:00 [IST]