For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దంప‌తుల స్నానాల గ‌దిలో ప్ర‌త్యేక స‌దుపాయాలుండాల్సిందే!

By Sujeeth Kumar
|

దంప‌తుల‌న్నాక అనేక విష‌యాలు పంచుకోవాల్సి ఉంటుంది. మాట‌లు, భావోద్వేగాల‌ప‌రంగానే కాదు వ‌స్తువుల‌ను, వ‌స‌తుల‌ను, స‌దుపాయాల‌ను పంచుకోవాల్సి ఉంటుంది. అలా చేసే క్ర‌మంలో ఒక‌రి వ్య‌క్తిగ‌త స్వేచ్ఛ‌కు భంగం క‌ల‌గ‌కుండా చూసుకోవ‌డం ముఖ్యం. ఇంట్లో ఇద్ద‌రికీ స‌మాన స్థాయిలో వ‌స్తువులు ఉండాలి. ఇద్ద‌రి అవ‌స‌రాల‌కు స‌రిప‌డా స‌దుపాయాలుండాలి.

స‌మ‌తులంగా ఉండే స‌దుపాయాల దిశ‌గా ప్ర‌తి దంపతులు త‌మ ఇంటిని డిజైన్ చేయించుకోవ‌డం మేలు. ఇక బాత్‌రూమ్ ఫ‌ర్నీచ‌ర్ విష‌యానికొచ్చేస‌రికి మ‌రింత శ్ర‌ద్ధ తీసుకోవాలి. దంప‌తులు ఇద్ద‌రికీ కావల‌సిన‌వ‌న్నీ స‌మ‌పాళ్ల‌లో ఉండేలా చూసుకోవాలి. మ‌రి అలాంటివేమిటో చూద్దామా...

కొవ్వొత్తుల‌ హోల్డ‌ర్‌

కొత్త‌గా పెళ్ల‌యిన వారికి క్యాండిల్ హోల్డ‌ర్ చాలా అవ‌స‌రం. చుట్టూ కొవ్వొత్తులు పెట్టుకొని రొమాంటిక్ స్నానం చేస్తే ఆ మ‌ధుర క్ష‌ణాలు వ‌ర్ణించ‌లేనిది. కొవ్వొత్తుల హోల్డ‌ర్లు ఉంటే బాత్‌రూమ్‌కు కొత్త అందాలు, ప్ర‌కాశం వ‌స్తాయి. క్లాసీ లుక్ ఇచ్చేందుకైనా, రొమాంటిక్ మూడ్‌ను తెప్పించేందుకైనా కొవ్వొత్తుల వెలుగు అవ‌స‌ర‌మే.

ప‌రిమ‌ళాలు

స్నానాల గ‌దిలో సుగంధ ప‌రిమళాల అవ‌స‌రం ఎంతో చెప్ప‌లేం. మంచి పూల‌, పండ్ల సువాస‌లు కలిగిన ప‌రిమ‌ళాలు అద్దితే ఆ అనుభూతే వేరు. మ‌హిళ‌లకు చెడు వాస‌న‌లంటే న‌చ్చ‌దు. ముఖ్యంగా మ‌గ‌వారి నుంచి దుర్వాస‌న వ‌స్తుంటే కాస్త సెన్సిటివ్‌గా ఉంటారు. ఇలాంటి వాటి వ‌ల్ల చిన్న చిన్న గొడ‌వ‌లు వ‌స్తాయ‌నుకుంటే దానికి ప‌రిష్కారంగా మాంఛి సుగంధ ప‌రిమ‌ళాన్ని జ‌ల్లుకోవాలి. మ‌రింత రొమాంటిక్ వాతావ‌ర‌ణం తెప్పించేందుకు లావెండ‌ర్ లేదా రోజ్ ఫ్లేవ‌ర్ ఉన్న ప‌రిమ‌ళాల‌ను వాడితే బాగుంటుంది. ఇవ‌న్నీ ప్ర‌తి దంప‌తుల సాధార‌ణ స్నానాల గ‌దిలో ఉండాల్సిందే.

ప‌త్రిక‌ల స్టాండ్‌

దంప‌తులు ఒకే స్నానాల గ‌దిని పంచుకునేట‌ప్పుడు అది ప్ర‌త్యేకంగా మ‌గ‌వారికో లేదా ఆడ‌వారికో అనుకూలంగా ఉండ‌కూడ‌దు. ఫ‌ర్నీచ‌ర్ విష‌యంలో ఇదే ప‌ద్ధ‌తిని పాటించాలి. ఉదాహ‌ర‌ణ‌కు కొంద‌రికి స్నానాల గ‌దిలో ప‌త్రిక‌లు చ‌దివే అల‌వాటు ఉంటుంది. మ‌గ‌వారికి ఇది మ‌రీ ఎక్కువ‌. అందుకే ఈ అవ‌స‌రానికి ఒక న్యూస్‌పేప‌ర్ స్టాండ్ ఉంచుకోవ‌డం మేలు. బాత్‌రూమ్ కు ఇది మ‌రింత శోభ‌నిస్తుంది. స్నానాల గదిలోని టైల్స్‌, రంగుల‌కు స‌రిపోయే స్టాండ్‌ను వాడితే మ‌రింత బాగుంటుంది.

ప్ర‌త్యేక క‌ప్‌బోర్డులు

ఆడ‌వారు, మ‌గ‌వారు వాడే వివిధ సౌంద‌ర్య సాధనాలు వేరువేరుగా ఉంటాయి. షాంపూలు, స‌బ్బులు అన్నీ ఒక‌దానితో ఒక‌టి క‌లిసి పోతే ఇద్ద‌రికీ చిరాకుగా ఉంటుంది. అందుకే ఇద్ద‌రికీ డ‌బుల్ డోర్ క‌ప్‌బోర్డ్ ఉన్న‌దాన్ని వాడుకోవ‌డం ఉత్త‌మం. మ‌హిళలు చాలా కాస్మొటిక్స్ వాడ‌తారు. కాబ‌ట్టి వీరికి పెద్ద క‌ప్‌బోర్డ్ ఉంటే అనువుగా ఉంటుంది! అదీ కాకుండా వేరు వేరు క‌ప్‌బోర్డులు ఉంటే అన‌వ‌స‌ర గంద‌ర‌గోళానికి తావుండ‌దు.

ఓ పెద్ద అద్దం

మ‌గ‌వారు అంత‌గా అద్దంలో చూసుకోరు. ఏదో అలా మామూలుగా చూసుకుంటారు. అదే ఆడ‌వారికైతే త‌ర‌చూ అద్దంలో చూసుకుంటూ ఉంటారు. స్నానాల గ‌దిలో ఓ పెద్ద అద్దం ఉంచుకుంటే బాగుంటుంది. ఇద్ద‌రూ క‌లిసి ష‌వ‌ర్ స్నానం చేసేట‌ప్పుడు ఎదురుగా అద్దం ఉంటే మ‌రింత అనుభూతినిస్తుంది!

ఈ చిన్న చిన్న చిట్కాలు మీ స్నానాల గ‌దిని మ‌రింత అందంగా తీర్చిదిద్దుతాయ‌నుకుంటున్నాం. ఇవి కాకుండా టూత్‌బ్ర‌ష్ హోల్డ‌ర్‌, పొడి బ‌ట్ట‌ల బిన్‌, హ్యాంగ‌ర్ లాంటివీ ఉండాలి. అయితే ఇన్ని సామాన్లు పెట్టేసి స్నానాల గ‌దిని ఇరుగ్గా మాత్రం చేసుకోకండి!

English summary

Essential Bathroom Accessories | Bathroom Decor | Couple Bathroom

Essential Bathroom Accessories,Bathroom Decor, Couple Bathroom, A few such bathroom accessories for couples are mentioned below
Story first published: Monday, February 5, 2018, 13:30 [IST]