For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సంక్రాంతి సందర్భంగా ఇంటిని అలంకరించుకునే ప్రత్యేకమైన ఐడియాలు

ఏ పండగకైనా, మనచుట్టూ పండగ ప్రత్యేక విషయాలు, పనులు, అలంకరణలు, ఆ వాతావరణం లేకపోతే పండగ వచ్చినట్టే అన్పించదు. ఇదే దక్షిణాది పండగ సంక్రాంతికి కూడా వర్తిస్తుంది.

|

ఏ పండగకైనా, మనచుట్టూ పండగ ప్రత్యేక విషయాలు, పనులు, అలంకరణలు, ఆ వాతావరణం లేకపోతే పండగ వచ్చినట్టే అన్పించదు. ఇదే దక్షిణాది పండగ సంక్రాంతికి కూడా వర్తిస్తుంది.

ఈ పండగను జరుపుకోటంలో కూడా చాలా ఉత్సాహం, ఉల్లాసం దాగున్నా, దీనికోసమే ప్రత్యేకంగా వాడే వంట మరియు ఆహార వస్తువులు ఈ పండగను ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంచి వాటికి తగ్గ అలంకరణలు సంప్రదాయంగా అలానే ఉండేట్లు నిలుపుతున్నాయి.

Unique ideas to decorate your home for Pongal

ఈరోజుల్లో, ఇంటర్నెట్ అందరికీ అందుబాటులో ఉండటం వలన, తప్పనిసరిగా చేయాల్సిన అలంకరణలు మరో మెట్టు పైకెక్కి రకరకాల సమకాలీన నేపథ్యాలు, డిజైన్లు ఇంటిలో సంక్రాంతి జరుపుకోటానికి అందుబాటులోకి వచ్చాయి. పైగా మీ ఇల్లు అందరికన్నా మేటిగా కన్పించాలనే ఒత్తిడి కూడా పెరిగింది.

అందుకనే, మీ ఇల్లును సంక్రాంతికి తయారుచేసే 8 ప్రత్యేక ఐడియాలు మీకోసం ఇక్కడ అందిస్తున్నాం. చదవండి...

అపార్టుమెంటు ఫ్లాట్లలో సంక్రాంతి

అపార్టుమెంటు ఫ్లాట్లలో సంక్రాంతి

నగరాల్లో,పట్టణాల్లో అపార్టుమెంట్లలో నివసించే వారి సంక్రాంతిలో, సంప్రదాయంగా పెరట్లో పొంగలి వండటానికి కట్టెలు పేర్చే సన్నివేశం సాధ్యపడకపోవచ్చు. అలాంటప్పుడు, ఇంటిలోపలే పండగ చేసుకోవటం మంచి పద్ధతి.

కానీ మీరు సంప్రదాయంగా పొంగలి వండే వీలు లేనప్పుడు, దాని కారణంగా మీ పండగ ఉత్సాహాన్ని తగ్గించుకోవక్కర్లేదు. మీ ఇంటిలోపల సంక్రాంతికి కూడా బయట చేసినంత అలంకరణ, ఉత్సాహం ఉంచుకోవచ్చు.

ఒక నేపథ్యం ఎంచుకోండి

ఒక నేపథ్యం ఎంచుకోండి

మీకు పాతరకపు అలంకరణలతో బోర్ కొడితే, మీకు నచ్చిన నేపథ్యాన్ని ఆలోచించి, దాన్నే అమలులో పెట్టవచ్చు.

సరియైన చెరుకుగడలను ఎంచుకోండి

సరియైన చెరుకుగడలను ఎంచుకోండి

మనలో చాలామందికి తెలిసినట్టు, చెరుకుగడలు సంక్రాంతి అలంకరణలో ముఖ్యపాత్రను పోషిస్తాయి. ఇది ఎందుకంటే ఈ రుతువులో చేతికి వచ్చే పంటల్లో ముఖ్యమైనది చెరుకు. అందుకని మీ అలంకరణల్లో ప్రధాన పాత్ర పోషించే విధంగా చెరుకుగడలను ఎన్నుకోండి. ఇది మీ అలంకరణకి కొత్త అందాన్ని, ఆకర్షణని తీసుకొస్తుంది.

పచ్చదనం పరిరక్షించండి

పచ్చదనం పరిరక్షించండి

సమృద్ధిని ఉత్సవంలా జరుపుకునే ఈ సంక్రాంతి పండగ ముఖ్యనేపథ్యం ఎప్పుడూ పచ్చదనంని సూచించే ఆకుపచ్చ రంగు మాత్రమే. దీన్ని దృష్టిలో ఉంచుకుని మీ అలంకరణకి కూడా పర్యావరణానికి ఏ హాని చేయని పేపర్ మాషె ఉత్పత్తులను వాడితే, మీరు ప్రత్యేకంగా కూడా కన్పిస్తారు.

గోవును పూజించే సాంప్రదాయం

గోవును పూజించే సాంప్రదాయం

హిందూమత విశ్వాసం ప్రకారం, అన్ని జంతువులలోకెల్లా ఆవు చాలా పవిత్రమైనది. అందుకని, సంక్రాంతి పండగకి జరిగే అన్ని విశేషాలలో ముఖ్యమైనది గోవును పూజించటం. అది ఎలా అంటే ఆవు ఆకారంలో ముగ్గుని వేయటం మంచి పద్ధతి. ఇది అన్నీ పచ్చగా కళకళలాడే వాతావరణంలో వేరే రంగులను నింపుతుంది.

ఎలక్ట్రిక్ దీపాలను వాడండి

ఎలక్ట్రిక్ దీపాలను వాడండి

సాంప్రదాయంగా, సంక్రాంతి ఉత్సవాలన్నీ పచ్చగా కళకళలాడుతుంటాయి ( అరటి ఆకు, చెరుకుగడ, మావిడాకులు మరియు మీకు నచ్చేవి). కానీ మీకు సమకాలీనంగా కొంచెం కొత్తదనం జతచేయాలనిపిస్తే, ఎలక్ట్రిక్ దీపాలను మీ సంక్రాంతి అలంకరణలో భాగం చేయటం ఉత్తమం.

కుండను అలంకరించటం

కుండను అలంకరించటం

ఈ పండగకి చేసే ముఖ్యమైన పనుల్లో ఒకటి పొంగలిని వండటం. అందుకని దాన్ని వండే కుండకి కూడా అంత ప్రాముఖ్యత ఉంటుంది. దాన్ని రంగుల్లో, పువ్వులతో అలంకరించటం వలన మీ సంక్రాంతి అలంకరణలకి ఒక కొత్త శోభ వస్తుంది.

ఏదీ అతిగా చేయకండి

ఏదీ అతిగా చేయకండి

నగరాల్లో మనకుండే ఇరుకైన ఇళ్లలో, సంక్రాంతి కోసం అలంకరణలు ఇదివరకటి కాలంలో లాగా విశాలంగా చేయటం కుదరదు. అందుకని మీ అలంకరణని సింపుల్ గా ఉంచడం కూడా చాలా ముఖ్యం.

English summary

Unique Ideas To Decorate Your Home For Pongal

This Pongal, decorate your house with some of the best decorating tips. Try with the latest trends such as setting a theme for the festival. Using light decoration, pot decoration, etc., and many more.
Story first published:Monday, January 15, 2018, 15:12 [IST]
Desktop Bottom Promotion