For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వంట గది నిర్మాణం విషయంలో పాటించవలసిన వాస్తు నియమాలు

|

ఏ సంస్కృతిలో పుట్టి పెరిగినా, మనం తీసుకునే ఆహారం, మన ఆరోగ్యం మరియు శ్రేయస్సులో ప్రధాన పాత్ర పోషిస్తుంది. మనం తీసుకునే ఆహారం పోషక పరంగా మన శరీరం మరియు మనస్సును ప్రభావితం చేస్తుందనడాన్ని ఎవరూ కాదనలేరు. వాస్తవానికి, మనం ఆహారం సిద్ధం చేసేటప్పుడు పాటించే పరిశుభ్రత కూడా మన ఆరోగ్య విషయంలో ప్రధాన్యత సంతరించుకుంది.

అందువల్ల, దేశంలో ఏ మూలకి వెళ్లినా, వంటగది యొక్క పరిశుభ్రతకు అత్యంత ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది. గతంలో, సాంప్రదాయిక గృహాలలో, వంటగది ఇంటి నుండి పూర్తిగా వేరుగా ఉండేది.

వంట గది నిర్మాణం విషయంలో పాటించవలసిన వాస్తు చిట్కాలు

ఈ రోజుల్లో చాలా గృహాలలో (ఫ్లాట్లతో సహా), వంటగదిని ఆనుకుని డైనింగ్ హాల్ కలిగివున్నప్పటికీ, గృహంలో వంటగది యొక్క స్థానం ఆ గృహంలోని సంపద మరియు ఆరోగ్యాన్ని నిర్దేశిస్తుంది.

పైన చెప్పినవన్నీ వాస్తవానికి, భారతీయ సంప్రదాయ వాస్తు శాస్త్రంలో చెప్పబడిన విషయాలే! నేడు, ఆధునిక మనస్తత్వవేత్తలు కూడా వంటగది యొక్క స్థానం, మన మానసిక శ్రేయస్సు విషయంలో ముఖ్యపాత్రను పోషిస్తుందని ధ్రువీకరించారు. ఈ వ్యాసం ద్వారా, మనము ఇంట్లో వంటగది యొక్క స్థానం గురించి తెలుసుకుందాం. వాస్తు శాస్త్రంలో పేర్కొన్న విధంగా, మీరు ఖచ్చితంగా అమలు చేయడం సాధ్యం కాకపోతే, అనుసరించదగిన మార్గాలను ఇప్పుడు చర్చిద్దాము.
వంటగది యొక్క దిశ

శాస్త్ర ప్రకారం, మీ ఇల్లు ఏ దిశలో ఉన్నా , వంటగది మాత్రం ఎల్లప్పుడూ ఆగ్నేయ దిశలోనే ఉండాలి. వంటగది లోపల, మీరు ఆహారాన్ని వండే గట్టు తూర్పు వైపుగా ఉండాలి. ఆధునిక హంగులను సమకూర్చుకున్న వంటగదిలో, మైక్రోవేవ్ ఓవెన్, ఇండక్షన్ ఓవెన్, గ్యాస్ బర్నర్, మొదలైనటు వంటి పలు సదుపాయాలు ఉంటాయి.

వంటగది గట్టుపై మీరు ఏ పద్దతిని ఉపయోగించి వంట చేస్తారో డానికి అనుకూలమైన పరికరాలను అమార్చాలి. ఆహారాన్ని తయారుచేసే సమయంలో, తయారు చేసే వారు, తూర్పు ముఖంగా ఉంటే, వారి తనుమనస్సులను వంటలో సంపూర్ణంగా నిమగ్నం చేయగలుగుతారు. దీని వల్ల ఆహారంలో రుచి, శుచి మరియు ఆరోగ్యం నిండుతాయని వాస్తు శాస్త్రం పేర్కొంది.

మానవులపై దీని ప్రభావం:

ఇక్కడ గమనించదగ్గ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, వంటగది సరైన స్థానంలో ఉంటే వంట చేసే వ్యక్తికి సదుపాయంగా ఉండటమే కాక, ఆహారాన్ని తినే వారికి కూడా మేలుచేస్తుందనే వాస్తవాన్ని వాస్తు శాస్త్రం కనుగొంది.

అటువంటి స్వల్ప మార్పులు చేసుకోవడం వలన కలిగే ఫలితం మూలంగా, మొత్తం కుటుంబ సభ్యులలో అనుకూల భావాలు నిండి ఉంటారు. అంతేకాక, కుటుంబ సభ్యులు వివిధ రకాల దుష్ప్రభావాల నుండి దూరంగా ఉంటారు. ఇటువంటి పరిస్థితులు నెలకొన్న కుటుంబంలోని సభ్యుల మధ్య ప్రేమ మరియు మెరుగైన పరస్పర అవగాహన ఉంటుంది.

త్యామ్నాయ పరిష్కారాలు:

కొన్ని సందర్భాల్లో పైన పేర్కొన్న విధంగా సరైన దిశలో వంటగదిని నిర్మించటం సాధ్యం కాకపోవచ్చు. అటువంటి సందర్భంలో, వంటగది ఇంటి మధ్యభాగంలో లేదా ఉత్తర దిశ ముఖంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకుండా చూసుకోవాలి.

అటువంటి దిశలో కట్టబడిన వంటగది, మీ కుటుంబం యొక్క శ్రేయస్సుకి హానికరంగా పరిణమిస్తుంది. మీ ప్రస్తుత ఇంట్లో వంటగది, ఇటువంటి ప్రదేశాలలో ఉన్నట్లయితే, మీ కుటుంబానికి జరగబోయే హాని లేదా అనారోగ్యం యొక్క ప్రభావం తగ్గించడానికి మీరు వీలైనంత త్వరగా అవసరమైన మార్పులను చేసుకోండి.
తర చిట్కాలు మరియు సూచనలు:

ఈ రోజుల్లో రిఫ్రిజిరేటర్ లేని వంటగదిని ఊహించలేము. వాస్తు శాస్త్ర ప్రకారం, రిఫ్రిజిరేటర్ ను వంటగది యొక్క పశ్చిమంలో పెట్టాలి. అంతేకాదు, ఆహారం సిద్ధం చేయడానికి రూపొందింపబడిన వంటగదిలో, ఎట్టి పరిస్థితిలోను, ప్రార్థనల కోసం ప్రాంతం కేటాయించడం లేదా ఏ రూపంలో అయినా పూజ చేయడం కూడదు. గుర్తుంచుకోవలసిన ఇంకో విషయం ఏమిటంటే, వంటగది పూజ గదిపైన ఉండకూడదు.

ఇప్పుడు మీకు ఇంట్లో ఏ వైపుగా వండుకోవాలో తెలుసు కనుక , మీరు మీ కలల సౌధం యొక్క నిర్మాణం చేపట్టాలనుకుంటున్నప్పుడు, ఈ విషయాలను అన్నింటిని మనస్సు లో ఉంచుకోండి. ఒకవేళ మీరు పైన చెప్పబడిన దానికి భిన్నంగా ఉన్న ఇంట్లో నివసిస్తున్నట్లైతే, మీ వంటగది వాస్తుప్రకారం ఉండేవిధంగా మార్పులు చేసుకోవాలి. ఇది మీ కుటుంబానికి సంతోషం మరియు సంపదను చేకూర్చడమే కాక, మీ కుటుంబ సభ్యుల ఆరోగ్య ప్రయోజనాలను కాపాడుతుందని తెలుసుకోండి.

English summary

Vastu Tips For Kitchen Direction

The aforementioned concept was originally a suggestion of the Indian tradition of Vaastu Shastra. Today, modern psychologists have confirmed the role that the position of the kitchen plays in the overall mental well-being of the people living in the same. In this article, we shall discuss the ideal position of the kitchen, the steps that you can follow if it is not possible for you to cook in the exact direction as specified and other such details.