Latest Updates
-
చికెన్, మటన్ బిర్యానీలను మరిపించే స్పైసీ టమాటా బిర్యానీ..కుక్కర్ లో ఈజీగా చేసేయండిలా.. -
తులసి తీర్థం మహిమ? చనిపోయిన మహిళ బతికింది! -
రెస్టారెంట్ రుచిని మించేలా ఇంట్లోనే బిసిబేలే బాత్.. సులభంగా ఎలా చేయాలంటే? -
కరివేపాకు vs వేప ఆకు..పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాల్లో ఏది బెస్ట్ అంటే..! -
నవరాత్రి స్పెషల్: రుచితో పాటు ఆరోగ్యం.. జీర్ణశక్తిని పెంచే అద్భుతమైన తమలపాకు కేసరి ప్రసాదం -
నోరూరించే ఆమ్లెట్ పులుసు.. పుల్లపుల్లగా, కారంకారంగా రుచి అదరహో! -
దీపావళికి ముందే ధ్వజ యోగం.. ఈ 4 రాశుల జాతకులు కోటీశ్వరులు కావడం ఖాయమా? -
నల్ల పాలు తాగుతున్న తెలుగు హీరోయిన్..ప్రయోజనాలేంటో,ఎలా చేసుకోవాలో తెలుసా? -
మటన్ సాంబార్ వండేటప్పుడు ఈ మసాలా పడితే ఆ రుచే వేరు..రాగి సంగటి, చపాతీ,అన్నంలోకి కేక -
రోగనిరోధక శక్తిని పెంచే జామకాయ పచ్చడి.. ఊరనివ్వాల్సిన పనే లేకుండా అప్పటికప్పుడే రెడీ!
Christmas Tree: క్రిస్మస్ ట్రీని ఇంట్లోనే తయారు చేసుకోండి
క్రిస్మస్ వేడుకలకు ఎంతో ముఖ్యమైన క్రిస్మస్ చెట్టును ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అది కూడా చాలా సులభంగా. పిల్లలు కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇది చూడటానికి అందంగా ఉండటమే కాకుండా పిల్లల్లో సృజనాత్మకతను పెంపొందిస్తుం
Christmas Tree: క్రిస్మస్ అనగానే వెంటనే గుర్తుకు వచ్చేది క్రిస్మస్ చెట్టు. ఇంటి ముందు రంగురంగుల లైట్లు, బెలూన్లు, రిబ్బన్లతో అలంకరించిన క్రిస్మస్ చెట్టును చూడటం భలే సరదాగా ఉంటుంది. క్రిస్మస్ కోసం చాలా రోజుల నుండి ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు చాలా మంది. క్రిస్మస్ రోజు ఇంటిని, ఇంటి పరిసరాలను అందంగా అలంకరిస్తారు. ఈ అలంకరణలోనూ కొంత మంది పోటీ కనబరుస్తారు. తమ పొరుగు ఇళ్ల కంటే తమ ఇళ్లే అందంగా కనిపించాలని అనుకుంటారు.

క్రిస్మస్ వేడుకలకు ఎంతో ముఖ్యమైన క్రిస్మస్ చెట్టును ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అది కూడా చాలా సులభంగా. పిల్లలు కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇది చూడటానికి అందంగా ఉండటమే కాకుండా పిల్లల్లో సృజనాత్మకతను పెంపొందిస్తుంది.

క్రిస్మస్ చెట్టుకు తయారీకి కావాల్సిన వస్తువులు:
* ఆకుపచ్చ కాగితం
* కత్తెర
* టేప్
* మార్కర్
* చెట్టుకు అలంకరణ కోసం రంగు కాగితాలు, స్టిక్కర్లు, గ్లిట్టర్ పేపర్, రిబ్బన్ మొదలైనవి.

eక్రిస్మస్ చెట్టు తయారీ విధానం:
స్టెప్ 1:
కాగితాన్ని రెండు ఒకేలా చెట్టు ఆకారాలుగా కత్తిరించాలి. రెండు కాగితపు షీట్లను ఒకదానితో ఒకటి ఉంచాలి. వాటిని సగానికి మడవాలి. మార్కర్ తో వాటిపై క్రిస్మస్ చెట్టు ఆకులను గీయాలి. ఇప్పుడు గీసిన విధంగా కట్ చేయాలి.
స్టెప్ 2:
వాటిని కలపడానికి చెక్క ఆకారంలో మధ్యలో చీలికలుగా కత్తిరించండి. ఒక చెట్టులో పై నుండి మధ్య గుర్తు వరకు ఒక చీలికను కత్తిరించాలి. మరొక చెట్టును దిగువ నుండి మధ్యకు కత్తిరించండి.
స్టెప్ 3:
ఇప్పుడు చెట్టును తయారు చేయడానికి రెండు ఆకారాలను కలపాలి. ఈ చెట్లను గట్టిగా, కలిసి ఉంచడానికి చెట్టు పైభాగంలో, దిగువ భాగంలో కొన్ని తెల్లటి గమ్ టేప్ ముక్కలను అతికించాలి.

స్టెప్ 4:
ఇప్పుడు క్రిస్మస్ చెట్టును అలంకరించాలి. క్రిస్మస్ చెట్టును స్పార్కర్లు, రిబ్బన్లు, దారం లేదా ఏదైనా ఇతర అలంకరణ వస్తువులతో అలంకరించండి.



Click it and Unblock the Notifications
