Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
వెస్టర్న్ టాయిలెట్ ఫ్లష్‌పై 2 బటన్లు ఎందుకు వుంటాయో తెలుసా..? కారణం ఇదే..!
మనందరి జీవనశైలి మారిపోయింది. జీవినశైలితో పాటు మనము ఉపయోగించే వస్తువులు కూడా మారిపోయాయ్. రోజూ వెళ్లే టాయిలెట్, బాత్‌రూం కూడా మారిపోయింది. ఒకప్పుడు ఇండిన్ టాయిలెట్లనే ఉపయోగించాం. కొన్నేళ్ల క్రితం వెస్టర్న్ టాయిలెట్లు కేవలం హోటళ్లలో, అతి పెద్ద కార్యాలయాల్లో మాత్రమే వుండేవి. కానీ ప్రస్తుతం వాటినే ఎక్కువగా ఉపయోగిస్తున్నాం. జీవిన శైలితో పాటు మనమూ మారలనే తలంపు, పాత పధ్దతులను ఎందుకు పాటించాలనే ప్రశ్నలు జీవన విధానాన్ని కాలానికి తగ్గట్టు మారుస్తున్నాం.
వెస్టర్న్ టాయిలెట్ ఉపయోగించేవారి సంఖ్య
ఇక వెస్టర్న్ టాయిలెట్లను ప్రతి రోజూ ఉపయోగించేవారి సంఖ్య చాలానే వుంది. అయితే వీటికి సంబంధించిన సమాచారం మనకు ఎక్కువగా తెలిసే అవకాశం లేకపోవద్దు. ఎందుకంటే వీటిని కొన్నేళ్ల క్రితం నుంచే ఉపయోగిస్తున్నాము కాబట్టి. బాత్‌రూంలో ఫ్లష్ చేసే దగ్గర రెండు బటన్లు వుంటాయ్. కానీ చాలా మంది పెద్ద బటన్‌ను మాత్రమే ఫష్ చేయడానికి ఉపయోగిస్తారు. చిన్న బటన్‌ను పట్టించుకోరు. ఫష్ బాక్స్ పైన రెండు బటన్లు వుంటాయన్న విషయాన్ని కూడా చాలా మంది గ్రహించి వుండరు. ఫ్లష్ బాక్స్‌పైన రెండు బటన్‌లు ఎందుకు వుంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఫ్లష్ చేయడానికి 2 బటన్లు
ప్రస్తుతం వస్తున్న ఫ్లష్‌లకు రెండు రకాలు బటన్లు వస్తున్నాయ్. ఒకటి చిన్న బటన్ రెండు పెద్ద బటన్. వీటిని డ్యూయల్ ఫ్లాష్‌గా పిలుస్తాం. ఈ రెండు బటన్లు వున్నా ఏ బటన్ ఎందుకు పనిచేస్తుందనే వియాయాన్ని గమనించి వుండరు. కాని చిన్న బటన్ కన్నా కూడా పెద్ద బటన్‌ను నొక్కడం వల్ల ఎక్కువ ఫ్లష్ అవుతుంది. పెద్ద బటన్ నొక్కితే 6 నుంచి 9 లీటర్ల నీరు ఫ్లష్ అవుతుంది. అదే చిన్న బటన్ నొక్కితే 4 నుంచి 5 లీటర్ల వరకు నీరు ఫ్లష్ అవుతుంది.
బాత్‌రూం షింక్‌లో లేదా మనము సాధారణంగా పిలుచుకునే కుండీలో రెండు రకాల వ్యర్ధాలు వుంటాయ్. గట్టిగా వున్న వ్యర్ధాలను పెద్ద బటన్ నొక్కడం వల్ల ఫ్లష్ చేయవచ్చు, ఇక మూత్రం లాంటి ఇతర వాటిని చిన్న బటన్ నొక్కితే ఫ్లష్ అవుతాయ్.
డ్యూయల్ ఫ్లష్
ఈ డ్యూయల్ ఫ్లష్ ఐడియా 1976లో పుట్టింది. అమెరికన్ పారిశ్రామిక డిజైనర్ ఈ డ్యూయల్ ఫ్లష్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఈ డిజైన్‌ను ఆయన తాను స్వయంగా రచించిన "డిజైన్ ఫర్ రియల్ వరల్డ్ అనే పుస్తకంలో ప్రతిపాదించారు. ఈ డ్యూయల్ ఫ్లష్‌ను మొట్టమొదటి సారిగా 1980లో ఆస్ట్రేలియాలో ఉపయోగించారు.

పర్యావరణానికి రక్షణగా
దీని డిజైన్ వెనక పర్యావరణ పరిరక్షన బాధ్యత కూడా కనిపిస్తుందని కనుగ్గొన్నారు. చాలా మంది టాయిలెట్ పోయినా సరే పెద్ద బటన్‌నే ఫ్లష్ చేయడానికి ఉపయోగిస్తారు. దీని వల్ల చాలా నీరు వ్యర్ధమైపోతుందని అంటున్నారు. మూత్రానికి వెళ్లినప్పుడు చిన్న బటన్‌ను మాత్రమే ఉపయోగించడం వల్ల ఒక ఇంట్లో సంవత్సరానికి 20వేల లీటర్ల నీరు ఆదా అవుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
టాయిలెట్‌కు వెళ్లిన తరువాత ఫ్లష్ చేయకపోతే కలిగే ప్రమాదాలు
బాత్‌రూం వెళ్లిన తరువాత ఖచ్ఛితంగా ఫ్లష్ చేయాలి. టాయిలెట్‌కు వెళ్లినా సరే ఫ్లష్ చేయాల్సిందే. లేదంటే హానికర బ్యాక్టీరియా పెరిగి అది మూత్రసంబంధిత వ్యాధులకు (యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్) కారణం అయ్యే అవకాశం వుంది. కాబట్టి అటు పర్యావరణం, ఇటు ఆరోగ్యం, రెండింటినీ దృష్టిలో పెట్టుకొని టాయిలెట్‌కు వెళ్లిన తరువాత ఖచ్ఛితంగా ఫ్లష్ చేయడం మరిచిపోవద్దు.



Click it and Unblock the Notifications