For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వంటలో ఘుమఘుమలు!

By B N Sharma
|

4 Common Spices That Can Grow In Your Garden
సువాసనలు.. సుగంధ ద్రవ్యాలు వేయందే ఇంటిలో ఏ వంటకం తయారు కాదు. ఉదాహరణకు కొత్తిమీర లేని ఏ ఐటమ్ కూడా రుచించదు. అన్ని మార్కెట్ నుండి తెచ్చుకున్నప్పటికి కొత్తిమీర వంటి రుచినిచ్చే ఐటమ్ లు తెచ్చుకోడం అపుడపుడూ మరచి పోతూ వుంటాం కూడాను. అటువంటి వాటిని మన ఇంటి గార్డెన్ లోనే పెంచుకోవచ్చు. వాటికి పెద్దగా పోషణ చేయాల్సింది కూడా లేదు.

1. పచ్చిమిరప: గార్డెన్ లో పెంచదగిన 25 వెరైటీలున్నాయి. కాని సాధారణంగా మనం తినే పచ్చిమిరప గార్డెన్ లో తేలికగానే పెరుగుతుంది. వేడిగా వుండే ప్రదేశాలు వీటికి అనుకూలం. 20 నుండి 30 డిగ్రీల ఉష్ణోగ్రత వీటికి చాలు. విత్తనాలు వేస్తే చాలు మొలకలు వచ్చేస్తాయి. విత్తనాలు కూడా ఇంట్లోనే దొరుకుతాయి. ఒక మిరప కాయ తుంచి విత్తనాలు భూమిలో వేస్తే చాలు మొక్కలు వచ్చేస్తాయి.

2. తులసి: తులసి హిందువులకు పవిత్రం. ఇటాలియన్ ఫుడ్ వండాలంటే దీనిని విరివిగా వాడేస్తారు. అటు పవిత్రమైన పూజలకు, ఇటు రుచికరమైన వంటలకు కూడా దీనిని వాడేస్తారు. విత్తనాలు చల్లినా, లేక కొమ్మలు తుంచి పెట్టినా ఇది మరల ఎదుగుతుంది. రోజూ రెండు సార్లు నీరు పోయాలు లేకుంటే ఎండిపోతుంది. దీనికి పూలు రాకుండా చూడాలి. పూలు వస్తే ఎండిపోతుంది. కనుక మొక్క పై భాగాలు ఎపుడూ తుంచి వాడండి. తులసి మంచి ఔషధ విలువలు కల మొక్క.

3. కొత్తిమీర : ఔషధ జాతికి చెందిన ఈ మొక్క ఆకులు ఎంతో సువాసననిస్తాయి. మన వేడి ప్రదేశాలు వీటి పెంపకానికి అనుకూలం. విత్తనాలు చల్లాలి. వీటి వేళ్ళు పెద్దవిగా వుంటాయి కనుక కుండీ పెంపకం కుదరదు. కనుక నేలలోనే వరుసగా వేయండి. ఆకులను ఎప్పటికపుడు కోసి వాడాలి. ఒకసారి వేస్తే చాలు అది పెరుగుతూనే వుంటుంది.

4. అల్లం: సాధారణంగా అన్నింటిలో వాడే ఈ సుగంధ ద్రవ్యం ఒక వేరు జాతి. దాని నుండే పెరుగుతుంది. ఒక్క ముక్క అల్లం పాతిపెడితే దాని నుండి పిలకలు పుట్టుకు వస్తాయి. దీనికి మంచి నేల వుంటే చాలు. మన వేడి ప్రదేశాలు దీని పెరుగుదలకు అనుకూలమే. ప్రతి రోజూ నీరు పెట్టాలి. ఒక సారి పాతితే చాలు పిలకలు వస్తూనే వుంటాయి.

ఈ సుగంధ ద్రవ్య మొక్కలు మీ ఇంటి గార్డెన్ లో తేలికగా పెంచదగినవే కనుక ప్రయత్నించండి.

English summary

4 Common Spices That Can Grow In Your Garden | పెరటిలో సువాసనలు....!

Ginger: This common spice used in almost all our recipes is actually a root and grows from it self. A piece if ginger will have 'growth buds' on it from which the shoots will sprout. All you need to grow this spice is really good soil. The climatic conditions of our country are ideal for ginger as it absorbs lot of moisture. Water it regularly but don't let it get water-logged.
Story first published:Tuesday, September 27, 2011, 16:51 [IST]
Desktop Bottom Promotion