For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెరటిలో తేలికగా పెంచే నాలుగు కూరలు!

By B N Sharma
|

Pumpkin Patch
సాధారణంగా కూరలు కావాలంటే అందరూ మార్కెట్ లోని హైబ్రిడ్ విత్తనాలు వేసి, ఎరువులు, విపరీతమైన పురుగుమందులు వేసి పెంచిన వాటిని కొనేసి కాలం వెళ్ళబుచ్చుతారు. కాని కొద్దిపాటి శ్రమ పడితే ఇంటి పెరటిలోనే ఏ కలుషితం లేని కొన్ని కూరల మొక్కలను పెంచి స్వచ్ఛమైన నాణ్యతగల కూరలను ఆనందంగా, రుచిగా తినవచ్చు. మీ ఇంటి పెరటిలో తేలికగా పెంచగల నాలుగు రకాల మొక్కలను పరిశీలించండి.

1. టొమాటోలు: సాధారణంగా టొమాటో మొక్కను అన్ని వెజిటబుల్ గార్డెన్లలోను చూస్తూనే వుంటాం. ఇవి తేలికగా పెరుగుతాయి. మంచి నాణ్యతగల విత్తనాలు వాడాలి. అయితే, కొన్ని జాగ్రత్తలు పాటించండి. విత్తనాలు అన్నీ ఒకే చోట పెట్టవద్దు. ప్రతి విత్తనానికి మధ్య భూమిలో కనీసం 4 నుండి 5 మి.మి.ల దూరం వుండేలా చూడండి. భూమిలో ఎక్కువ లోతుకు పాతిపెడితే మొలక రాదు. విత్తనాలకు నీరు అధికంగా చల్లకండి. మొక్క ఎదిగే సమయంలో నీరు పెట్టండి. మొక్క వచ్చేటంతవరకు రోజు మార్చి రోజు నీరు పెడితే చాలు.

2. వెల్లుల్లి: ఈ మొక్క వేస్తే గార్డన్ అంతా చక్కని వాసనే. వెల్లుల్లి ఒక వేరు సంబంధం. కనుక మొక్క మొక్కకు మధ్య తగినంత జాగా వదలండి. ఈ మొక్కకు అధిక సూర్యరశ్మి కావాలి. వెల్లుల్లి వేసిన భూమికి నీరు ప్రవహించాలి. నీరు నిలువ వుంటే కుళ్ళే ప్రమాదం వుంది. భూమి మెత్తగా అనిపిస్తే కొంత ఇసుక కలపాలి. వెల్లుల్లి కూరలలో ఉపయోగించటానికే కాక కొన్ని సమయాల్లో ఔషధంగా కూడా ఉపయోగిస్తాం. దీనితో పాటు కొన్ని లవంగ మొక్కలు కూడా వేయవచ్చు.

3. సొరకాయ: సైజులో ఎంతో పెద్దది. వేడి వాతావరణానికి అతి తేలికగా మన ఇంటి పెరటిలో పెరుగుతుంది. విత్తనాలు ఎక్కడ పడేసినా మొక్క పుట్టే అతి తేలిక కూరల మొక్క ఇది. తీగలు చాలా దూరం వరకు వ్యాపిస్తాయి. సొరకాయ తీపిగా వుండటం చేత ఫంగస్, ఇతర పురుగులు త్వరగా చేరతాయి. వీటిని తొలగించే ప్రయత్నాలు ఎప్పటికపుడు చేసి గార్డెన్ లోని మొక్కలను రక్షించాలి.

4. బఠాణీ మొక్క: ఈ మొక్క వేళ్ళు భూమిలోకి నైట్రోజన్ చొప్పిస్తాయి. కనుక దీనిని వేస్తే భూమిలో సహజమైన ఎరువు వేసినట్లే. ఇది తీగ మొక్క. కనుక తగినంత పందిరి లేదా కర్రలు ఆధారం ఇచ్చి పెంచాల్సి వస్తుంది. వీటికి తగుమాత్రం నీడ వుంటే చాలు. ఎండ అధికంగా వుంటే మొక్క వాడిపోతుంది.

English summary

4 Easy To Grow Vegetables For Your Garden | పెరటిలో తేలికగా పెంచే నాలుగు కూరలు!

Pumpkin: These huge (and magical) vegetables grow like weeds in your garden as they are perfect for our warm weather. All you have to do is take the effort to throw in the seeds.
Story first published:Saturday, August 27, 2011, 15:17 [IST]
Desktop Bottom Promotion