For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ముచ్చటైన ముంగిట్లో అందాల స్వాగతాలు!

By B N Sharma
|
5 Easy To Grow Flower Plants
అలసిన శరీరానికి మనసుకు చక్కటి పూలమొక్కలు ఆహ్లాదాన్నిస్తాయి. కాని ఇంటి పెరటిలో గార్డెన్ అంటే ఎంతో శ్రమ అనుకుంటారు. అయితే, మీరు ఎక్కువ శ్రమపడకుండా వాటంతటవే సులభంగా పూలు పూసి మిమ్మల్ని ఆనందపరిచే కొన్ని మొక్కలను పరిశీలించండి.

పేన్సీస్ - వింటర్ లో బాగా పెరుగుతుంది. రంగుల పూలనిస్తుంది. కంటైనర్లలో లేదా కుండీలలో పెంచవచ్చు. ఎండ అధికంగా అవసరం లేదు.

ఆర్చిడ్స్ - వీటిలో 30 వేల రకాలున్నాయి. పూల రంగులు ఇంటిలో అందరూ ఇష్టపడతారు. పెంచటం తేలిక. వీటికి ఎక్కువ వేడి లేదా చల్లదనం కూడా పనికిరాదు. వారానికి లేదా పది రోజులకు నీరు పెడితే చాలు.

గులాబీలు - వీటిని పెంచటం చాలా తేలిక. గులాబీలలో అనేక వెరైటీలున్నాయి. మంచి సుగంధాలను వెదజల్లుతాయి. మొక్క తేలికగానే పెరుగుతుంది. కాని, ముళ్ళను తీయటం, కత్తిరించటం వంటివి చేస్తూండాలి. ఈ మొక్కకు లిక్విడ్ ఎరువులు వాడండి. కొద్దిపాటి ఎండ వుంటే చాలు.

బంతి పూల మొక్క - ప్రతి గార్డెన్ లో తప్పక వుంటుంది. వీటి పూల రంగులు గార్డెన్ లో ఎక్కడ వున్నా ఆకర్షణీయమే. భూమిలో అధిక సారం కావాలి. ఎరువులు, కంపోస్టు వేయండి. ప్రతిరోజూ నీరు పెట్టాలి. కొద్దిపాటి ఎండ వుంటే చాలు.

బెగోనియా -
గులాబీలు వలే వుండే పూలు పూసే మొక్క. కుండీలు లో పెంచవచ్చు. హేంగింగ్ బాస్కెట్ లో కూడా పెంచుతారు. శీతాకాలం దీనిని ఇంటిలోపలే పెంచాలి. విత్తనాలు లేదా మొక్క పెంచవచ్చు. దీనికి కూడా ప్రతి నెల లిక్విడ్ ఎరువులు వాడండి.

English summary

5 Easy To Grow Flower Plants | శ్రమ ఇవ్వని పూలమొక్కలు!

A flowering garden creates a vibrant and colourful mood and ambiance in the house. Growing and maintaining gardens make people think twice before sowing seeds but easy to grow flower plants doesn't require much maintenance. Lets take a look at the easy to grow and maintain flower plants for your home.
Story first published:Thursday, November 10, 2011, 12:07 [IST]
Desktop Bottom Promotion