For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అపార్ట్ మెంట్ అయినప్పటికి... పూల వానలే!

By B N Sharma
|

Top 4 Indoor Flower Plants
ఇంటిలో పెరిగే పూల మొక్కలు ఇతర మొక్కలకంటే భిన్నంగా వుంటాయి. వీటిని పూలు పూచేలా చేయాలి. ఈ మొక్క పచ్చగా పెరిగేలానే కాకుండా పూలు పూచేటట్లుగా కూడా పెంచాలి. మరి ఆపూలు ఎల్లపుడూ పూచేలా వుండటం కొరకు మరింత కష్టపడాలి. అందుకొరకు ఇంటిలోపల బాగా ఎదిగే మొక్కలను ఎంపిక చేయాలి. ఇంటి లోపలే బాగా పెరిగే 4 పూలమొక్కలేమిటో పరిశీలించండి.

1. ఆఫ్రికన్ వయోలెట్స్ - ఇంటిలోని పూల తోటకు అనువైన మొక్క ఇది. ఈ మొక్కలు బాగా ఎత్తు ఎదగవు. ఈ మొక్కకు సూర్యరశ్మి కావాలి కాని అది మరీ నేరుగా వుండనవసరం లేదు. కిటికీ నీడలో పెట్టినా లేక కర్టెన్ నీడలో పెట్టినా సరే అది పెరుగుతుంది. ఈ మొక్కకు తేమ బాగా వుండాలి. రోజుకు రెండు సార్లు నీరు పోయాలి.

2. ఆర్చిడ్స్ - ఈ మొక్కలు ఇంటిలోపల పెరగటానికి కొంచెం శ్రమించాలి. వీటిలో అనేక రకాలుంటాయి. తక్కువ సూర్యరశ్మితోను, మట్టి లేకుండాను పెరిగే జాతిని ఎంపిక చేయండి. అవి పూలు బాగా పూస్తాయి. వీటికి కూడా డైరెక్ట్ సూర్యరశ్మి అవసరం లేదు.

3. మందార - ఎపుడూ పూలనిస్తుంది. ఎండ అధికంగా కావాలి. పురుగులనుండి రక్షించాలి. ఎప్పటికపుడు మొక్కను చక్కగా కత్తిరిస్తూ సమయానికి నీరు పెడుతూ వుంటే పూలను బాగా ఇస్తుంది.

4. బెగోనియా - ఇది పాకే మొక్క. ఈ మొక్క ఎటువంటి పరిస్ధితులలోనైనా పెరుగుతుంది. కావలసినన్ని పూలనివ్వటమే కాక ఈ మొక్క పచ్చదనాన్ని కూడా బాగా ఇస్తుంది.

పై చిట్కాలు పాటించి మీ అందమైన అపార్ట్మెంట్ గార్డెన్ లో పూల వానలు కురిపించండి.

English summary

Apartment Garden: Top 4 Indoor Flower Plants | అపార్ట్ మెంట్ అయినప్పటికి... పూల వానలే!

Indoor flower plants are pretty much different from any other variety of indoor plants. The most important point of difference is of course that you have to get them to bloom. It is one thing having a lush green plant in your apartment garden but quite another to make it flower. And to keep it in a blossoming state perennially is difficult even for master gardeners.
Story first published:Friday, October 28, 2011, 13:15 [IST]
Desktop Bottom Promotion