For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆహ్లాదాన్నిచ్చే పచ్చని మొక్కల పెంపకం!

By B N Sharma
|

Different Shades Of Green Plants For Feng Shui
ఫెంగ్ షూయిలో పచ్చటి మొక్కలు అంటే పాజిటివ్ ఎనర్జీని ఇచ్చేవని భావిస్తారు. ఫెంగ్ షూయి లో ప్రతి రంగుకు ఒక ప్రాముఖ్యత వుంది. వివిధరంగులను సరైన రీతిలో కలిపి పాజిటివ్ ఎనర్జీ ఎలా క్రియేట్ చేయాలనేది ఫెంగ్ షూయి చెపుతుంది. ఫెంగ్ షూయి లో ఆకుపచ్చ చెక్క కు సంబంధించిన మూలకం. వుడ్ అయిశ్వర్యాన్ని, ఆస్తులను ఇస్తుంది. ఇంటిలో పెట్టటానకి ఎంతో ముఖ్యమైనది. కనుక ఇంటిలో ఆకుపచ్చ ఎక్కడ వున్నప్పటికి మంచిదే. ఇంటిలో పచ్చదనానికి మించిన కలరు కంటికి మెరుగైనది వేరేదీ లేదని కూడా చెప్పవచ్చు. ఫెంగ్ షూయి సిద్ధాంతాల మేరకు ఒకే రకమైన ఆకుపచ్చ ఇంటిలో చాలదు. ఆకుపచ్చ లోనే వివిధ రకాలుండాలి.

ఫెంగు షూయి సిద్ధాంతాలమేరకు వివిధ రకాల ఆకుపచ్చ మొక్కలను ఇంటిలో ఎలా పెంచవచ్చో పరిశీలిద్దాం! మొదటగా, మీరు ఫెంగ్ షూయి ఎనర్జీ మేప్ ను మీ ఇంటిలో వుంచుకోండి. దాని ప్రమాణాల మేరకు, తూర్పు, ఆగ్నేయం, మరియు దక్షిణం లు వుడ్ లేదా చెక్కు అనుకూలంగా వుంటాయి. కనుక పచ్చటి మొక్కలను ఈ దిక్కులలో పెడితే ప్రయోజనం వుంటుంది. ఉత్తరం వైపు వదిలేయండి.

వివిధ రకాల ఆకుపచ్చ కొరకు ఫెంగ్ షూయి మొక్కలైన ఫెర్న్స్ ఎంచుకోవచ్చు. ఈ మొక్క వివిధ షేడ్లలో లైట్ గ్రీన్ నుండి డార్క్ గ్రీన్ వరకు వుంటుంది. డీప్ బాటిల్ గ్రీన్ కావాలంటే మనీ ప్లాంట్ పెట్టండి. దాని ఆకులు నాణేల ఆకారంలో వుండటంచే మెటల్ కు కూడా ప్రాముఖ్యత లభిస్తుంది. లక్కీ బాంబూ మొక్క లైట్ గ్రీన్ రంగులో వుండి మీకు జీవితంలో అవసరమైన నివారణలు చేకూరుస్తుంది. కుండీలలో పెరిగే అరేకా పామ్ ఆకుపచ్చ మీకు విశ్రాంతిని్వగలదు.

డ్రాసినా మొక్క పసుపు బేబీ గ్రీన్, మాస్ గ్రీన్, పామ్ గ్రీన్ లలో పెద్ద ఆకులతో వుంటుంది. ఈ రకంగా ఒకే ఆకుపచ్చలో వివిధ రకాల షేడ్లు మీ ఇంటికి ఫెంగ్ షూయి సిద్ధాంతం మేరకు పని చేస్తాయి. పచ్చటి మొక్కలు చైనీయుల ఫెంగ్ షూయి మేరకు మీ ఇంటికి ఐశ్వర్యాన్ని తెచ్చిపెట్టటమే కాదు. పర్యావరణ స్నేహితంగా వుండి మీకు ఆహ్లాదాన్ని కూడా తెచ్చపెడతాయి.

English summary

Different Shades Of Green Plants For Feng Shui | ఆహ్లాదాన్నిచ్చే పచ్చని మొక్కల పెంపకం!

So use all the shades of green that you can get hold of in your garden. Not only does it have a positive meaning in Chinese art of home decoration but it makes you home an eco-friendly green haven!
Story first published:Thursday, September 29, 2011, 8:28 [IST]
Desktop Bottom Promotion