Latest Updates
-
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.!
తేలికగా పెరిగే పూజా పూలు!

బంతి పువ్వు: ఇంటి గార్డెన్ లో పెంచటానికి అనువైనది. ఏ రకమైన నేల అయినా పెరుగుతుంది. విత్తనాలు చల్లితే చాలు మొక్క వచ్చేస్తుంది. మొక్క రెండు అంగుళాలకు రాగానే తీసి విడివిడిగా పెట్టడి. ఎండు ఆకులు తుంచేయండి. రోజు విడిచి రోజు నీరు పెట్టండి. సూర్యరశ్మి అధికంగా వుండాలి.
చైనా రోస్: ఈ మొక్కను అంటుకట్టటం ద్వారా పెంచవచ్చు. రంగులు కంటికి ఇంపుగా వుంటాయి. లేటుగా అంటే కనీసం 6 నెలలు దాటితే గాని ఈ మొక్క పూలనివ్వదు. ప్రతి దినం నీరు పెట్టాలి. సూర్య రశ్మి అధికంగా వున్న ప్రదేశంలో పెట్టండి. కొమ్మలు విస్తరిస్తుంటే వాటిని కట్ చేసి ట్రిమ్మింగ్ చేయండి. చూడటానికి చెట్టు బాగుంటుంది.
గులాబి చెట్టు: ఈ మొక్కను చిన్నపాటి కుండీలలో కూడా పెంచవచ్చు. అవసరమనుకుంటే ఇంటిలోపలకూడా అలంకరణలకు ఈ కుండీలను ఉపయోగించవచ్చు. వేసవి కాలమంతా చక్కటి పూలను ఈ మొక్కలు వివిధ రంగులలో అందిస్తాయి. ప్రతిదినం నీరు పెట్టాలి. సూర్యరశ్మి ఈ మొక్కలకు పాక్షికంగా తగిలితే చాలు.
పూజకు పనికివచ్చే ఈ పూలను మీ ఇంటి గార్డెన్ లో పెంచి అవసరానికి, ఆహ్లాదానికి వాడుకోవచ్చు. ఈ మొక్కలను పెంచటానికి అధికంగా శ్రమపడాల్సిన పనిలేదు.



Click it and Unblock the Notifications
