Latest Updates
-
కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు నువ్వుల లడ్డూ..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
కృష్ణాష్టమి స్పెషల్: కన్నయ్య మనసు దోచే అటుకుల పాయసం..ఇంట్లోనే చేయండిలా -
మగవారూ అలర్ట్ : మూత్రం పోశాక కూడా చుక్కలు కారుతున్నాయా? ఈ 3 వ్యాధులకు సంకేతం కావచ్చు! -
ఈ కృష్ణాష్టమికి ఇంట్లోనే.. 100% పవిత్రమైన పంచామృత కేక్ తయారు చేయండిలా! -
రోడ్ సైడ్ స్టైల్ ఎగ్ శార్వా..చపాతీ, దోశ, పరోటాల్లోకి అమృతంలా! -
గ్యాస్, అజీర్తి అని ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా? ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ముప్పు కావచ్చు, జాగ్రత్త! -
ఆడవారైనా, మగవారైనా అస్సలు తాగకూడని డ్రింక్ ఏంటో తెలుసా.. డాక్టర్ సలహా ఇదే.! -
ఇడ్లీ, దోశలతో విసిగిపోయారా? ప్రొటీన్ల నిధి,బలాన్నిచ్చే ఎగ్ పరాఠా ట్రై చేయండి! -
సైలెంట్ కిల్లర్స్: పైకి ముక్కుసూటి.. వెనుక మహా కిలాడీలు!..ఈ 3 రాశులు ఎవరో తెలుసా? -
వినాయక చవితి స్పెషల్..ఇంట్లోనే ఈజీగా నోరూరించే చాక్లెట్ మోదక్ ఎలా చేసుకోవాలంటే..
ఔషధ మొక్కల పెంపక లాభాలు అధికమే!

ఔషధమొక్కల పెంపకం ఎలానో పరిశీలిద్దాం.....
1. పెరటి తోటలో కూరగాయల మొక్కలు ఎలా పెంచుతామో అలానే కొన్ని వరుసలలో ఔషధ మొక్కలను పెంచాలి. వీటి పెంపకం ఇతర మొక్కలకు ఫెన్సీంగ్ లా కూడా పని చేస్తుంది. చిన్న పాటి మొక్కలే కనుక కోసుకోవటం కూడా తేలిక.
2. ఔషధ మొక్కలలో లవెండర్, హయసోప్ మొదలైన వాటిని మొక్కలుగానే నాటేయవచ్చు. వీటిని పెరటి మధ్యలో నాటండి.
3. పెరటి గార్డెన్ కు సరిహద్దులుగా బోరేజి (ఛోటా కల్ప), పార్శిలీ, కాంఫ్రీ, మింట్, కాలెండ్యులా (మేరిగోల్డ్) వంటివి నాటితే మరింత రంగు రంగులుగా వుంటుంది.
4. లాన్ లో ధైమ్, బేర్ బెర్రీ, పెన్నీరాయల్, జర్మన్ ఛామోమైల్ మొదలైన ఔషధమొక్కలు నాటండి.
గార్డెన్ నిర్వహణ ఎలా చేయాలి?
-ఎండిన కొమ్మలను మొక్కలనుండి కత్తిరించి కొత్త మొక్కలుగా అదే స్ధలంలో ఖాళీ లేకుండా నాటండి.
-నేలను పురుగులనుండి కాపాడటానికి పురుగు మందులు వేయండి. ఎండలు అధికంగా వుంటే రెగ్యులర్ గా నీరు పోయండి. సాధారణంగా ఔషధ మొక్కలకు నీరు ఎక్కువ అవసరం లేదు.
-ఔషధ మొక్కలకవసరమైన పెస్టిసైడ్ గా పురుగుపట్టని ఎండుటాకులు వాడవచ్చు. లేదా మింట్ మొక్క ఆకులు బాగా పనిచేస్తాయి. ఈ ఆకులను నీటిలో ఉడకపెట్టి, ఆ నీటిని పురుగుపట్టిన మొక్కలకు వేస్తే ఫలితం వుంటుంది.
ఔషధ మొక్కల పెరటి పెంపకం ఇంటి యజమానికి ఎంతో సహకరించటమే కాక గార్డెన్ అంతా అందంగా కనపడుతుంది. వీటిలో కొన్ని రకాల మొక్కలు రెండు సంవత్సరాల వరకు కూడా పెరిగేవి వున్నాయి. ఈ మొక్కలకు కొమ్మలను ఎపుడూ కత్తిరించే పని వుండదు. పెంచటం తేలిక.



Click it and Unblock the Notifications