Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
గుబాళించే సువాసనల పూలు!

ప్రేమను తెలియచేసే 5 రకాల ఆకర్షణీయ పూలు
ఎర్ర గులాబి - ఎర్రటి గులాబి పువ్వు, చూసే వారికి ఎంతో ఆనందం కలిగిస్తుంది. ఎవరికైనా వెంటనే ఇవ్వాలనిపిస్తుంది. వీటిలో అనేక రంగులుంటాయి. ఈ మొక్కను కుండీలలో లేదా బయట కూడా పెంచవచ్చు. ముళ్ళను ఎప్పటికపుడు తీసేస్తూ ప్రతిరోజూ ఒకసారి నీరు పెట్టి, కొద్దిపాటి సూర్యరశ్మి తగిలితే చాలు మొక్క బాగా ఎదిగి పూలనిస్తుంది.
ప్లుమేరియా - గులాబి తర్వాత ప్రేమను తెలుపాలంటే ప్లుమేరియా పువ్వు బాగుంటుంది. మంచి సువాసనలతో రూమంతా ఆహ్లాదాన్నిస్తుంది. ఈ పూలు వివిధ రంగుల్లో వుంటాయి. పెంచటం తేలికే. చలి అధికంగా వుంటే, ఇంటి లోపల కుండీలలో పెంచటం, కొద్దిపాటి నీరు పెడితే చాలు.
జాస్మిన్ - ఈపువ్వు ఘాటైన సువాసనలనిచ్చే ప్రేమికుల పువ్వు. ఇవి అలంకరణకే కాదు ప్రేమికులు మంచి మూడ్ రావటానికి కూడా ఉపయోగిస్తారు. ఇవి వికసించాలంటే ఎండ బాగా వుండాలి. నీరు ఎక్కువ పోస్తే మొక్క బాగా ఎదుగుతుంది.
జాంక్విల్స్ - ప్రేమకు, సాను భూతికి ఈ పువ్వు సంకేతం. ఈ మొక్క పెంచటం తేలికే. పూలు వచ్చే సమయంలో మొక్కకు నీరు బాగా పెట్టాలి. ప్రతి రోజూ 2 నుండి 5 గంటలుకొద్దిపాటి సూర్య రశ్మి వుంటే చాలు.
తులిప్ - ఈ పూలు వివిధ రంగుల్లో వుంటాయి. ఎరుపు, పసుపు ప్రేమికులకు ఆకర్షణీయంగా వుంటాయి. వీటిని ఇంటిలో ఫ్లవర్ వేజ్ లో పెడితే కనీసం ఒక వారం రోజులు వాడకుండా వుంటాయి.
ఈ 5 రకాల పూలు ప్రేమను, ఆకర్షణను కలిగించి మనస్సుకి ఆహ్లాదాన్నిస్తాయి. ఈ పూల మొక్కలతో మీ జీవితాలు ఆనంద భరితం చేసుకోండి.



Click it and Unblock the Notifications