Latest Updates
-
యదా యదా హి ధర్మస్య.. శ్రీకృష్ణుడి స్ఫూర్తితో మీ బంధుమిత్రులకు జన్మాష్టమి శుభాకాంక్షలు చెప్పండిలా! -
బుధ గ్రహ గోచారం: అదృష్టం అంటే వీరిదే.. సెప్టెంబర్ 7 నుంచి ఈ నాలుగు రాశుల వారికి గోల్డెన్ డేస్.! -
కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు నువ్వుల లడ్డూ..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
కృష్ణాష్టమి స్పెషల్: కన్నయ్య మనసు దోచే అటుకుల పాయసం..ఇంట్లోనే చేయండిలా -
మగవారూ అలర్ట్ : మూత్రం పోశాక కూడా చుక్కలు కారుతున్నాయా? ఈ 3 వ్యాధులకు సంకేతం కావచ్చు! -
ఈ కృష్ణాష్టమికి ఇంట్లోనే.. 100% పవిత్రమైన పంచామృత కేక్ తయారు చేయండిలా! -
రోడ్ సైడ్ స్టైల్ ఎగ్ శార్వా..చపాతీ, దోశ, పరోటాల్లోకి అమృతంలా! -
గ్యాస్, అజీర్తి అని ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా? ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ముప్పు కావచ్చు, జాగ్రత్త! -
ఆడవారైనా, మగవారైనా అస్సలు తాగకూడని డ్రింక్ ఏంటో తెలుసా.. డాక్టర్ సలహా ఇదే.! -
ఇడ్లీ, దోశలతో విసిగిపోయారా? ప్రొటీన్ల నిధి,బలాన్నిచ్చే ఎగ్ పరాఠా ట్రై చేయండి!
ఆకర్షించే పచ్చని మొక్కలు...పెంచే చిన్నారులు...

మన ఇంట్లో చిన్న పిల్లల్లా..చిన్న చిన్న మొక్కలు ఇంట్లో జంటగా వికసిస్తూ ఉంటే ఆ మురిపానికి హద్దే ఉండదు. మొక్కలు పెంచడంలో పెద్దల పాత్రే కాదు, పిల్లల పాత్ర కూడా ఉంటుంది. ప్రతి రోజూ పిల్లలను గార్డెన్ లోనికి తీసుకుపోతే వారికి ఆహ్లాదంతోపాటు కొంచెం అనుభవం కలిగి ఉంటారు. మొక్కలను ప్రేమించడం మొదలు పెడతారు. మొక్కలు పెంచాలనే భావన వారిలో కలుగుతుంది. కాబట్టి పిల్లల్లో మొక్కలు పెంచుకోవాలనే భావన కలిగినప్పుడు వారికి కొన్ని మొక్కలు ఇచ్చి పెంచుకోమని చెప్పాలి. మొక్క నాటే విధానం..నీరు పెట్టే విధానంతో పాటు కొన్ని మెళుకువులు నేర్పినట్లైతే మొక్కల పెంపకంలో వారు భాగస్వాములు అవుతారు. ఇంతకీ పిల్లలు పెంచగలిగే మొక్కలేంటో చూద్దాం...ఇంట్లో తక్కువ వ్యయప్రయాసలతోనే పిల్లలు పెంచుకునేందుకు అనువైన కొన్ని మొక్కలు రకాలుగా మార్కెట్లో దొరుకుతున్నాయి. కొన్ని పిల్లల మొక్కలు మీకోసం.....
అగ్లోనీమా ఇండోర్ ప్లాంట్: నీడపట్టున పెరిగే ఈ ఇండోర్ ప్లాంట్ కు సరిపడా నీటిని అందిస్తే చాలు. మొక్క అందంగా పెరుగుతుంది. సూర్య రశ్మి ఎక్కువగా ఈ మొక్కకు తగలంకుండా మొక్కకు ప్లాస్టింక్ బ్యాగ్ ను మొక్కకు చుడితే మొక్క ఆరోగ్యంగా అందంగా పెరుగుతుంది. అలాగే ఎరువు ఎప్పుడూ తడిగా ఉండేలా చూసుకుంటే అందంగా, రంగురంగుల ఆకులతో పెరిగే ఈ మొక్క... శరవేగంగా పిల్లల మనసుకు హత్తుకుంటుంది.
రసీనా మొడిసినల్ ఇండోర్ ప్లాంట్: గ్రీన్, రెడ్... ఇలా విభిన్న రకాల రంగుల్లో ఆకులు రావడం దీని ప్రత్యేకత. దీనికి కూడా ఏ మాత్రం ఎండ అవసరం లేదు. ఈ మొక్కకు దాని ఆకులు, కాండమే రక్షణ కల్పించుకుంటుంది. తక్కువ నీటి అవసరం మీడియం టెంపరేచర్ ఉంటే సరిపోతుంది. ఈ మొక్కను ఇంట్లో..ఆఫీసులోనూ పెంచుకోవచ్చు.
ఫిలోడెండ్రా: కుండీలో సపోర్ట్‌గా ఏదైనా ఏర్పాటు చేస్తే దాని ఆధారంగా పెరిగే మొక్క ఇది. ఈ మొక్కకు 75-80డిగ్రీల ఫారన్ హీటో ఉంటే చాలు మొక్క 15-30రోజుల లోపు చాలా అందంగా పెరిగిపోతుంది. ఈ మొక్క ఆకులు చూడటానికి విచిత్రంగా ఆకారంలోనూ, సైజ్ లోనూ ఉంటుంది. పసుపుపచ్చ ఆకులతో పిల్లల మోములపై చిరునవ్వుల్ని పూయిస్తుంది.
స్పాతీఫిల్లమ్: ఈ స్పాతీఫిల్లమ్ ను బెడ్ రూంలో, విడో డోర్ల దగ్గర విండో సిల్, ఏసి మీద ఏపుగా పెరుగుతుంది. ఈ మొక్క మీద సూర్య రశ్మి పడిందంటే చాలు ఇల్లంతా కలకలడాతూ ఎక్కువ షైనింగ్ తో మెరుస్తుంటుంది. ఈ ఇండోర్ వెరైటీ మొక్క పిల్లల్ని ఆడిస్తుందని చెప్పొచ్చు. మొక్క నాటిన కొద్ది రోజులకే పాము పడగ శైలిలో తెల్లని ఆకులు వస్తాయి. ఇది ఇండోర్ మొక్కే అయినా అవుట్ డోర్ లో కూడా పెట్టుకొని పెంచుకోవచ్చు. సాధారణంగా ఎలాంటి మొక్కలైనా హానికారక వాయువుల్ని, దుమ్ము ధూళిని సంహరించి స్వచ్ఛమైన వాతావరణానికి తోడ్పడతాయని తెలిసిందే. అయితే ఈ విషయంలో స్పాతీ ఫిల్లమ్ మరింత ప్రభావం చూపిస్తుంది.
పీస్ లిల్లీ: ఇది చూడటానికి డార్క్ గ్లాసీ గ్రీన్ కలర్ లో ఉంటుంది. పెద్ద పెద్ద తెల్లని పూరేకులకు మధ్యలో జొన్న కంకి తరహాలో చారతో అందాల పత్రంలా ఉంటుంది. ఈ ఇండోర్ ప్లాంట్. ఈ ఆకులు విచ్చుకుంటుంటే పిల్లల సంతోషాన్ని చూడాల్సిందే. ఇలా ఇండోర్ ప్లాంట్ల్ లో వందల రకాల మొక్కలున్నాయి. ఎవరి ఇష్టాన్ని బట్టి, అభిరుచిని బట్టి వారు ఎంచుకోవచ్చు. అందానికి అందం, పిల్లలకు ఆనందం.



Click it and Unblock the Notifications