Latest Updates
-
దేవీ నవరాత్రులు..ఇంట్లోనే సులభంగా కలశ ప్రతిష్ఠాపన, పూజ ఎలా చేయాలి? -
పాలు తక్కువగా ఉన్నప్పుడు.. టీ చిక్కగా, రుచిగా రావాలంటే ఇలా చేయండి! -
ఛీ ఛీ ఏంటీ పని: 11 ఏళ్ల బాలుడితో సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సెర్ నిషా.. -
పిల్లల్లో జలుబు, దగ్గు తగ్గించే కషాయం..టీకి బదులుగా ఇది తాగితే ఫుల్ ఎనర్జీ.. ఇలా చేసుకోండి -
మలబద్ధకం, మొటిమల సమస్యతో బాధపడుతున్నారా? ఈ 3 ఫుడ్స్ తింటే కడుపు శుభ్రం! -
శృంగారంలో అసలైన మజా కోసం..ఈ పూర్వక్రీడ నియమాలు తెలుసుకోండి -
టిఫిన్స్ లోకి అదిరిపోయే టమాటా పల్లి కుర్మా..గిన్నెలు గిన్నెలు కుర్మానే తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రియుడితో పారిపోయిందని.. భార్యను చెట్టుకు కట్టేసి గ్యాంగ్ రేప్ చేయించిన భర్త, బంధువులు.. -
Vellulli Maramaralu Recipe: కరకరలాడే స్పైసీ వెల్లుల్లి మరమరాలు..ఇలా చేసుకుంటే దీన్ని మించిన స్నాక్ ఉండదు! -
ఘుమఘుమలాడే కేరళ స్టైల్ పొటాటో ఫ్రై..సాంబార్, రసంతో నంజుకుని తింటుంటే మస్త్ మజా
కొయవచ్చు..తినవచ్చు.. అమ్మవచ్చు.. పెంపకం ఎంతో తేలిక

కొబ్బరి చెట్లను పెంచుకోవడం వల్ల అన్ని భాగాలు ఉపయోగపడేవే. కొబ్బరినూనె, కొబ్బరి నీళ్ళు, పాలలో గల సుగుణాలన్నీ ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో బాగో దోహదపడుతాయి. కొబ్బరి కాయల నుంచి అనేక వాణిజ్య ఉత్పత్తులు మార్కెట్‌లోకి వచ్చాయి. ఎండు కొబ్బరి, కొబ్బరి నూనెలతో పాటూ కొబ్బరి పాల పొడి, వెనిగర్, చిప్స్, నీటి కాయల నుంచి కొకొజెల్, మార్కెట్‌లోకి వచ్చాయి. కొబ్బరి కాయల పెంకులు సైతం కాల్చి ఆక్టివేటడ్ కార్బన్ తయారీ, పెంకుల పొడిని, పెంకులపై చెక్కిన వివిధ కళారూపాలను మార్కెట్‌లో తయారు చేసేందుకు ఉపయోగపడుతున్నాయి. కొబ్బరి పీచు, పీచు నుంచి రాలే పొడికి అంతర్జాతీయ గిరాకీ ఏర్పడింది. కొబ్బరి పీచు నుంచి రకరకాల గృహోపకరణాలు లభిస్తున్నాయి. గృహ నిర్మాణంలో కొబ్బరి కాండం, ఆకులు వినియోగపడుతున్నాయి. ఇన్ని లాభాలున్న కొబ్బరి చెట్లు ఇంటిదగ్గర పెంచుకోవడం చాలా ఉపయోగకరం.
అదనంగా సంపాదించాలని అందరికీ వుంటుంది. ఏదో చేయాలను కొంటారు. కాని అందుబాటులో వుండే సదుపాయలతో కూడా కొంతమంది ఏమీ చేయలేకపోయామనుకొంటుంటారు. ఇంటి ముందు కొంచెమయినా చోటు వుంటేచాలు ఏ మొక్కలైనా పెంచుకోవచ్చు. కూరగాయలు పండించలేనివాళ్లు. రెండు కొబ్బరి మొలకలు నాటుకోవచ్చు. చెట్టు పెరగడానికి సమయం పట్టినా చెట్టు పెరిగి పెద్దదైతే తొందరగా కాపుకొస్తాయి. కొబ్బరి చెట్టు బాగా కాయాలంటే నీళ్ళు బాగా వుండాలి. చెట్టు మొదలు తడి ఆరకుండా చూసుకోవాలి.
మనం వాడుకునే నీళ్ళు చెట్టుకు అందేటట్టు చేసుకుంటే చాలు. ప్రతీరోజూ ఉపయోగించే నీళ్ళు చెట్టుకు అందేలా చేయాలంటే చెట్టుకూ చెట్టూ నడుమా ఒక గుంట తీయాలి. గుంటను ఒక బండతో కప్పివేయాలి. మనం వాడిన నీళ్ళు ఈ గుంటలో పడేటట్టు చేయాలి. ఎండాకాలం కూడా గుంటలో తడి ఆరదు.చెట్టు తొందరగా పెరుగుంది. చెట్టుమొదలు దగ్గర కూరలు, ఊరగాయల వంటివి పడవేయకూడదు. ఒక కొబ్బరి చెట్టు సుమారుగా కాపు పడితే ఆదాయంతో పాటు, చక్కటి ఆరోగ్యం లభిస్తుంది. ఇంత కంటే సులభమైన పెంపకం మరొకటి ఉండదు.



Click it and Unblock the Notifications
