Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
టెర్రస్ తోట..అలసిన మనసుకు ఎంతో ఊరట..!

టెర్రస్ పై ఏ కొద్ది స్థలం దొరికినా దాన్ని ఉపయోగించుకోవాలి. టెర్రస్ అంచుల్లో అడుగున్నర ఎత్తున ఎర్రమట్టితో, సేంద్రియ ఎరువులతో తోటలా తయారు చేసుకొని ఆ తోటలో సొర, కాకరకాయ, అలసంద, నిమ్మ, మిరప, చేమ, అరటి, పాలకూర, మెంతి, పుదీనా, కరివేపాకుతో పాటు అనేక పూల మొక్కలు, ఔషధ మొక్కలు కూడా పెంచుకోవచ్చు.
సొర తదితర తీగ జాతి మొక్కలను ఇనుప తీగలను పందిరిగా కట్టి పాకించి వదిలేస్తే చాలు చాలా అందంగా అల్లుకొంటూ కాయలు కాస్తాయి. టెర్రస్ మధ్యలో లాన్ ను కూడా ఏర్పాటుచేయడంతో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మొక్కలకు ఎటువంటి రసాయనిక ఎరువులు వాడకూడదు. బయోగ్యాస్ ప్లాంటు నుంచి వెలువడే 'స్లర్రీ'ని తీసుకొచ్చి అందులో పది రెట్లు నీటిని కలిపి మొక్కలకు పోస్తే మొక్కలు ఏపుగా పెరగడంతోపాటు క్రిమి కీటకాలు దరిచేరకుండా చేస్తుంది.
పట్టణాలు, నగరాల్లో నివసించే వారు టెర్రస్ పై ఓ చిన్న తోటను ఏర్పాటుచేస్తే.. నగర కాలుష్యాన్ని అరికట్టడంతోపాటు ఇంటికి అవసరమయ్యే కూరగాయలను పండించవచ్చు. ఉదయం, సాయంత్రం పక్షుల కిలకిలారావాలతో టెర్రస్ సందడిగా ఉంటుంది. తోటలో కాసేపు కూర్చుంటే చాలు.. అలసిన మనసుకు ఎంతో ఊరటనిస్తుంది టెర్రస్.!



Click it and Unblock the Notifications