Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
బోన్సాయ్ మొక్కలను ఎలా పెంచాలి..?

మీరు నివసించే దరిదాపుల్లోనే కొనటం మంచిది, ఎందుకంటే వాతావరణ మార్పులు ఆ చెట్టు జీవనానికి అనుకూలించకపోవచ్చు. మీరు ఏ చెట్టుని బోన్సాయ్‌గా తయారుచేయాలనుకుంటున్నారో! ఆ చెట్టు రకాన్ని నెలనుంచి ఏడాదిలోపుమొక్కను తీసుకోండి. మొక్క మూలవేరును ఎక్కువ పెరగకుండా కోసివేస్తూ ఉండాలి. దీంతో చెట్టు సులభంగా పెరుగుతుంది. దాంతోపాటు చిన్నదిగానూ ఉంటుంది. సాధారణంగా బోన్సాయ్‌ను తక్కువ లోతుగల పళ్ళెలాంటి పూల కుండీల్లో వుంచుతారు. దీని వేర్లను ఎక్కువగా పెరగకుండా కత్తిరించివేస్తూ చెట్టును మరగుజ్జులా ఉంచేందుకు ప్రయత్నిస్తారు. వాటికి వేసే ఎరువులు, రసాయనాలను కూడా తెలుసుకొని వాడటం మంచిది. ఈ బోన్సాయ్ మొక్కలను పెంచడానికి మంచి కుంపటిని ఎన్నుకొని మొక్క వేర్లు పూర్తిగా పాట్ లోని ఎరువులోపలిగా ఇమిడేటట్లు చూసుకోవాలి. కుంపటికి క్రింది బాగంలో ఒకప్రక్క నీరు పోవడానికి రంద్రం ఉండేలా చూసుకోవాలి. లోమీ ఎరువు ఈ బోన్సాయ్ బాగా పెరిగేలా చేస్తుంది.
ఈ బోన్సాయ్ మొక్కలను చక్క పెరుగుతుంది కాబట్టి చక్కటి ఆకృతి కోసం చిన్న మొక్కప్పుడే మొక్కచుట్టూ ఏదైనా దారం, లేదా వైర్ చుట్టితే అదే ఆకారంలో చెట్టు పెరిగి చూడముచ్చటగా ఉంటుంది. ఈ మొక్కకు తగినంత నీరు, సూర్యరశ్మి అందేలా చూసుకోవాలి. ఈ మొక్కలను ఇంటిలోపల, ఇంటిబయట కూడా పెంచుకోచ్చు. ఏడాదికి ఒకసారి బోన్సాయ్ ఎండిన వేర్లను కోసి, కొత్త ఎరువును వేస్తూ ఉండాలి. ఎరువు రూపంలో వర్మీ కంపోస్టు, వేప విత్తనం, తెలగపిండి వేస్తారు. కుండీలో మొక్క మొదళ్ళు చుట్టూ గులకరాళ్ళను అమర్చినట్లైతే ఇవి నీటిని పీల్చుకొని మొక్క ఎప్పుడూ తేమగా ఉండేటట్లు చేస్తుంది. బోన్సాయ్ చెట్లలో అన్నిటికంటే ముఖ్యమైనది- దాన్ని తెంపడం, కత్తిరించడం, ఎల్లప్పుడూ పచ్చగా ఉండేలా చేయాలి. కాబట్టి మెయింటెనెన్స్ కూడా సులభమే, ఎక్కువ స్థలం ఆక్రమించని ఈ మొక్కను అపార్ట్ మెంట్లో ఇంటీరియర్ డెకరేషన్ గా కూడా సులభంగా పెంచుకోవచ్చు.



Click it and Unblock the Notifications