For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అతి వేగంగా పెరిగే ఐదు రకాల గార్డెన్ మొక్కలు

|

గార్డెన్ పెంచుకోవాలనుకొనే వారికి మొక్కల మీదా చాలా ఆసక్తి కలిగి ఉంటారు. గార్డెన్ లో కొత్త కొత్త రకాలను మొక్కలను పెంచుకొంటూ ఆనందిస్తుంటారు. వాటిలో ఏవైనా అతివేగంగా చిగురించో .. లేదా మొగ్గ విడిచో .. పువ్వు పూచో కనిపిస్తే ఆ ఆనందానికి అంతే ఉండదు. ఎందుకంటే ప్రకతి సహజంగా మొక్కలు పెరగడం పువ్వులు పూయడం ఓ అద్భుతం కాబట్టి. అయితే కొన్ని మొక్కలు పెరగడానికి ఎక్కువ సమయం తీసుకొంటాయి. అదే మరికొన్ని ముక్కలు అతి త్వరగా పెరుగుతాయి. అలాంటి మొక్కలు మీ గార్డెన్ లో కూడా పెంచుకోవాలంటే, కొన్ని మొక్కల పేర్లను మీ కోసం...

Fastest Growing plants for your Garden

మ్యారిగోల్డ్(బంతిపూలు): బంతి పూల మొక్కలు అతి వేగంగా, సులభంగా పెరుగుతాయి. రెండు నెలల్లోనే మీ గార్డెన్ లో కలర్ ఫుల్ గా కళకళలాడాలంటే ఈ మొక్కలను తప్పనిసరిగా పెంచుకోవాల్సిందే. బంతిపూల విత్తనాలు లేదా చిన్న మొక్కలను భూమిలో లేదా కుంపటిలో నాటుకొన్నా సరిపోతుంది. మనం సాధారణంగా చూస్తూనే ఉంటాం బంతిపూలు రెండు మూడు కలర్స్ లో పూస్తుంటాయి. ఆరెంజ్, పసుపు, మెరూన్ ఎల్లో మిక్స్ ఇలా కలర్ కలర్ గా గార్డె అంతా కళకళలాడుతుంది. పువ్వులు ఆకారంలో, షేప్ లో కూడా వ్యత్యాసం కలిగి ఉంటాయి. ఈ మొక్కలను కోసం ఎక్కువగా రిస్క్ తీసుకోవనవసరం లేదు. ఇవి ఎటువంటి నేలలోనైనా అతి సులభంగా పెరుగుతాయి. వీటి కోసం ప్రత్యే శ్రధ్ద తీసుకోవలసిన అవసరంలేదు. మొక్కలకు ప్రతి రోజూ నీళ్ళు పడుతూ, సూర్యరశ్మి మొక్కలపై పడేట్లు చూసుకొంటే సరిపోతుంది. ఒక సారి పువ్వులు వికసించడం మొదలు పెట్టిన తరవాత వాటి కుంపట్లను నీడలోనికి మార్చుకోవాలి. ఈ మొక్కలు చాలా చిన్నవిగా ఉండటం వల్ల వీటిని నిర్వహాణ చాలా సులభంగా ఉంటుంది.

రాయల్ పామ్: మీ గార్డెన్ లో పొడవైన పామ్ ట్రీ పెంచుకోవానుకొంటున్నారా? అతి వేగంగా పెరిగే ఈ మొక్కను కూడా మీ గార్డెన్ లో మొక్కల జాబితాలో చేర్చేయండి. రాయల్ పామ్ మొక్క అతి వేగంగా పెరుగుతుంది. ఇది 50అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. అలాదే ఈ మొక్క ఆకులు పొడవైన ఆకులను కలిగి ఉంటుంది. రాయల్ పామ్ చెట్లు వివిధ రకాల మట్టిలో పెరుగుతి. వీటికి తప్పనిసరిగా సూర్యరశ్మి పడే ప్రదేశంలోనే నాటుకోవాల్సి ఉంటుంది. ప్రతి రోజూ నీటిని అందించడం వల్ల అతి వేగంగా పెరుగుతుంది.

స్పైడర్ ప్లాంట్: ఇది కూడా అతి వేగంగా పెరిగే మొక్కే. ఇలాంటి మొక్కలను మనం సాధారణంగా అనేక ఇళ్ళల్లో గమనించే ఉంటాం. ఈ మొక్కలను ఇంటిలోపాల, లేదా ఇంటి బయట కూడా పెంచుకోవచ్చు. స్పైడర్ ప్లాంట్ మట్టిలోనే పెరుగుతాయి. వీటిని ప్రతి రోజూ నీటినందిస్తూ , మూడు నుండి నాలుగు గంటల సేపు సూర్యరశ్మి తగిలేవిధంగా చూసుకోవాలి. ఇది ముఖ్యంగా కుంపట్లో పెరిగే మొక్క.

క్యాలెండులా: గార్డెన్ మొక్కలలో అతి వేగంగా పెరిగే మొక్కలలో ఈ కలర్ ఫుల్ క్యాండులా మొక్క కూడా ఒకటి. దీన్ని కుండ బంతి పువ్వు లేదా ముద్దబంతి పువ్వు అని పిలుస్తారు. ఇది చిన్నసైజు బంతి పువ్వు. సంవత్సరంలో ఒక సారి మాత్రమే పూచే ఈ మొక్కనిర్వాహణ బాధ్యతలు సులభం. క్యాండులాను చర్మసంరక్షణ ఉత్పత్తులలో కూడా విరివిగా ఉపయోగిస్తుంటారు.

బ్యాంబు ప్లాంట్: ఈ వెదురు మొక్క కూడా అతి సులభంగా.. అతి త్వరగా కూడా పెరిగే మొక్క! బ్యాంబు లేదా నందినా డొమాస్టికా జాతికి చెందిన మొక్కలు అతివేగంగా పెరుగుతాయి. కొన్ని నెలల్లోనే అతి వేగంగా పెరిగి గార్డెన్ లో ముదురు పచ్చదనంతో ఎప్పుడూ కళకళలాడుతుంటుంది. మీ తోటను అందంగా తీర్చిదిద్దుకోవాలంటే ఈ మొక్కను కూడా పెంచుకోవడం అవసరం. మీ తోటలో అక్కడక్కడా పొదలులాగా గుబురు గుబురుగా కనబడాలంటే ఈ మొక్కలను పెంచుకోవాల్సిందే.

ఈ మొక్కలు అతి సులభంగా అతివేగంగా పెరిగే మొక్కలు మరియు పువ్వులు. ఈ మొక్కలకు ఎక్కువ నిర్వాహాణ బాధ్యతలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇటువంటి మొక్కలు ఎటువంటి మంటిలోనైన, వాతావరణంలోనై అతి సులభంగా పెరుగుతాయి. కాబట్టి ఈ మొక్కలను మీ గార్డెన్ లో తప్పనిసరిగా ఉండేట్లు చూసుకోండి. ఇంకా ఏవైనా అతి త్వరగా పెరిగే మొక్కలు మీకు తెలుసా...?

English summary

Fastest Growing plants for your Garden | అతి వేగంగా పెరిగే గార్డెన్ మొక్కలు

When you start gardening, you are too anxious to include plants that grow as early as possible. Garden lovers are very curious to see the plants show its result. But, the plants take their own time to grow and blossom. If you are too impatient to include such plants in your garden, here are few simple names of plants that grow quickly.
Desktop Bottom Promotion