Latest Updates
-
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
నల్లేరు మొక్క అందించే ఔషధ ప్రయోజనాలు....!

మనకు వచ్చే చిన్ని చిన్న ఆరోగ్య సమస్యలకు మనం వెచ్చించే ఖర్చు రోజురోజుకు పెరిగిపోతోంది. ఇంగ్లీష్ మందుల వాడంక ద్వారా తాత్కాలిక ఉపశమనం కలుగుతోంది. ఒక్కోసారి ఈ మందులు సైడ్ ఎఫెక్ట్ ను కలగజేస్తున్నాయి. ఔషద మొక్కలను పెరటి మొక్కలుగా పెంచి ఉపయోగించుకోవడం ద్వారా వీటి ఉపయోగాన్ని ఈ తరం వారికి అందించవచ్చు. దాంతో పాటి ఇంటి ఆవరణంలో పచ్చదనాన్ని పెంపొందించుకోవచ్చు.
ఇంటిల్లిపాదికీ ఆరోగ్యాన్నిచ్చే మొక్క నల్లేరు. నాలుగు పలకలు కలిగిన కాండంతో సన్నగా పెరిగే తీగజాతి మొక్క నల్లేరు. గణుపు విరిచి మట్టిలో గుచ్చితే చాలు బతుకుతుంది. దీన్ని పెరట్లో నేలలో, కుండీల్లోనూ సులభంగా పెంచుకోవచ్చు. విరిగిన ఎముకలను అతికించడంలో దీని పాత్ర అమోఘం. పసిపిల్లల ఎముకలు దృఢంగా పెరగడానికి దోహదపడుతుంది. మధ్య వయస్కులకు కీళ్ల నొప్పులు రాకుండా చూస్తుంది. కీళ్ల నొప్పులుంటే తగ్గిస్తుంది.
ఎముకలు పెళుసెక్కడం, ఎముకలు పటుత్వం తగ్గడం వంటి వయోవృద్ధుల సమస్యలకు ఇది చక్కని పరిష్కారం. దీన్ని నాలుగు వైపులా తొక్క తీసేసి వాడాలి. తొక్కతో పాటు వాడితే నోరు దురద పెడుతుంది. దీన్ని చట్నీ చేసుకోవచ్చు. చిన్న ముక్కలు చేసి కూరల్లో కలుపుకోవచ్చు. రుబ్బి చపాతీలతో కలిపి వాడుకోవచ్చు. వారానికోసారి బజ్జీలు చేసుకోవచ్చు. ఎండబెట్టి చూర్ణంగా చేసుకొని వాడుకోవచ్చు. నల్లేరు రసం తీసి, రోజూ 2 చెంచాలు తాగుతుంటే విరిగిన ఎముకలు త్వరగా కట్టుకుంటాయి.
ఎముక పుష్ఠిని పెంచుతుంది. ఎముకలు విరిగిన వారికి ఆహారంలో ఇవ్వవచ్చు. నల్లేరు కాండాన్ని మెత్తగా నూరి గాయంపై వేసి కట్టుకట్టొచ్చు. 2 చుక్కల నల్లేరు కాడల రసం చెవిలో వేస్తే పోటు తగ్గుతుంది. నల్లేరు ఆకుల రసం 1,2 చెంచాలు తాగితే నీళ్ల విరేచనాలు తగ్గుతాయి. కంచెల్లో.. చాలా చోట్ల కనిపించే నల్లేరు ఔషధ గుణాలు తెలుసుకొని వాడుకుంటే బతుకు నల్లేరుపై నడకేనంటే అతిశయోక్తి కాదు.



Click it and Unblock the Notifications
