Latest Updates
-
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.!
పచ్చని మొక్కలను అభిలషించే నేటి యువత

పట్టణాలల్లోని యువ ఇంటి అలంకరణలో ఎప్పుడూ ముందుంటారు. ఇంటిలోపల కానీ ఇంటి బయట కాని పూల మొక్కలను పెంచుకోవడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు. మనుషులు ఫ్రెండ్ షిప్ కంటే మొక్కలను ఫ్రెండ్ షిప్పే బెస్ట్ అంటున్నారు. మొక్కలు సుగంద పరిమళాలను, ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కురిపిస్తాయి కాబట్టి వాటిమీదే ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. కొంతమంది ఇంటిముందు విరబూసిన పువ్వులను చూస్తే మంచి జరుగుతుందని భావిస్తున్నారు.
మొక్కల ఎంపిక విషయంలో అబ్బాయిలు, అమ్మాయిలు వేరు వేరుగా ఉం టారు. అమ్మాయిలు ఎక్కువగా పూల మొక్కలను పెంచడానికి ఇష్టపడు తుంటారు. ఇక అబ్బాయిలైతే అరుదైన మొక్కలు, కుండీలలో పెంచే క్రోటన్ మొక్కలను చాలా ఆసక్తిగా కొనుగోలు చేస్తుంటారు. చాలామంది కుర్రకారు ఎక్కడా సాధారణంగా దొరకని అరుదైన మొక్కలను పెంచడానికి ఇష్టపడుతుంటారు. వీటికోసం అనేక ప్రదేశాలు తిరిగి మరీ సేకరిస్తుంటారు. అలాగా కొత్తరకం పూల మొక్కలను కూడా పెంచుకోవడానికి ఎనలేని ఆసక్తిని కనబరుస్తుంటారు.
మొక్కలను పెంచుకోవాలనే ఆసక్తి తో మొక్కలను ఎంచుకొనేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా మీరు పెంచుకోవాలనుకొనే మొక్కలు ఏప్రదేశంలో పెంచాలనుకుంటున్నారో ఫస్ట్ డిసైడ్ చేసుకొని వాటికి తగ్గ వాటినే ఎంచుకోవాలి. కొత్త మొక్కలను పెంచేటప్పుడు వాటి వివరాలను ముందుగానే అమ్మకందారుని వద్ద పూర్తిగా అడిగి తెలుసుకోవాలి. పెరడులో, కుండీలలో పెంచడానికి వేరువేరుగా ప్రత్యేకమైనవి దొరుకుతాయి. అలంకరణ కోసం కుండీలలో పెంచే సైకస్, ట్యుటోనియా, క్యాక్టస్, కోలెస్, మనీప్లాంట్, ఎడీనియం, ఆర్కిడ్స్, బ్యాంబుక్ రాజ్ తదితర జాతుల మొక్కలను ఎంచుకుంటే మంచిది.



Click it and Unblock the Notifications
