Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
తీగ మొక్కలను ఎక్కడ పెంచుకోవచ్చు...

అల్లుకునే స్వభావం గల తీగ జాతి మొక్కలను బిల్డింగ్ లేదా కాంపౌండ్ గోడ సపోర్ట్ గా పెరగ నివ్వకూడదు. ఇటువంటి మొక్కలు కేవలం తోటలలో మాత్రమే పెంచుకోవాలి. అలాగే వీటిని ఇంటి పరిసర ప్రాంతాల్లో పెంచుకోవా లనుకుంటే వీటికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రాంతంలో మాత్రమే పెరిగేలా చేయాలి. పందిరి వేయడం వంటివి చేయాలి. ఎత్తులకెగబాగే తీగలు, ఇతర మొక్కలు గార్డెన్ ను పూర్తిగా రంగులతో నింపేస్తాయి. గోడలపైనా, నేలపైనా పాకుతాయి. వీటి కాండాలు మెత్తగా, సున్నితంగా వుంటాయి. కనుక మనకు కావలసిన రీతిలో గోడలపైనా లేదా ఎంట్రన్స్ లో ఎక్కడ కావాలంటే అక్కడ చక్కటి వంపులతో పాకించవచ్చు.
ఏదైనా ఒక చెట్టును ఇంటి పరిసర ప్రాంతాల నుండి తొలగించాలనుకుంటే.. ఏదైనా నష్టదాయకంగా వున్నా.. లేదా మరే కారణంతోనైనా సరే వాటిని కేవలం మాఘం లేదా బాధ్రపద మాసాల్లోనే తొలగించాలి. చెట్టును నరికేసే ముందు రోజు దానికి పూజ చేయాలి. అలాగే పూర్తిగా వేళ్ళతో సహా తొలగించి వేయాలి. కేవలం మొదలు వరకు తీసివేసి వేళ్ళను అలాగే వుంచడం శ్రేయస్కరం కాదు. దాని స్థానంలో మరో మొక్కను నాటేందుకు ప్రమాణం చేయాలి. అది కూడా మూడు నెలలోపే చేయాలి. అలాగే మరో విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. చెట్టు నరికిన తరువాత అది కూలిపోయే దిక్కు కూడా చాలా ముఖ్యం. అందుకే తూర్పు లేదా, ఉత్తరం వైపుగా లేదా నైరుతి వైపుగా పడేలా జాగ్రత్త తీసుకోవాలి.



Click it and Unblock the Notifications