For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆఫీస్ లలో ఒత్తిడి లేకుండా పనిచేయాలంటే?

By B N Sharma
|

మీ ఆపీసు క్యూబికిల్ మీకు రెండో ఇల్లు.... కొన్ని మొక్కలకు సూర్య రశ్మి, లేదా మంచి నేల అవసరంలేదు. కాని అవి మంచి తాజా ఆక్సిజన్ ఇచ్చి ఒత్తిడి కలిగించే సందర్భాలలో సైతం హాయిని కలగజేస్తాయి. కనుక కంటికిపచ్చగాను, ఆరోగ్యం ఇచ్చేదిగాను మీ చిన్నపాటి క్యూబికిల్ ను ఎలా మెయిన్టెయిన్ చేయాలో చూద్దాం!

Greenary in Office

1. కాక్టి: ఆఫీసుల్లో లేదా పని చేసే పరిసరాల్లో పెంచటానికి ఇది మంచి అనువైన మొక్క. దీనికి నీరు, ఎరువు కూడా అవసరం లేదు. ఏ పరిస్ధితుల్లోనైనా సరే బాగా పెరుగుతుంది. ఇది ఒక ఎడారి మొక్క కనుక కొద్దిపాటి నీరు, ఒక కుండీ ఇసుక వుంటే చాలు బతికేస్తుంది.

2. లక్కీ బాంబూ: లక్కీ బాంబూ మొక్కలు ఆఫీసులలో వున్న డల్ పరిసరాలకు చక్కటి గ్రీనరీతో లక్ తీసుకు వస్తాయి. వీటిని కుండీలలో మట్టి లేదా నీటిలో కూడా వుంచచ్చు. అన్ని కాలాలలోను పచ్చగా వుంటాయి. ఈజాతిలో డ్రాకాయినా సండేరియానా అనేది మంచి ఇండోర్ మొక్క.

3. మనీ ప్లాంట్: ఆఫీసు క్యూబికిల్ లో ఈ మొక్క అదృష్టమిస్తుందంటారు. కొద్దిపాటి నీటిలో ఈ మొక్కను పెంచవచ్చు. తక్కువ సూర్య రశ్మి చాలు. ఎరువులు అవసరం లేదు. ఆకులు తుంచేయాల్సిన పని అసలు లేదు. ఎపుడూ పచ్చగా అందంగా కనపడుతాయి.

4. బ్రొమేలియడ్స్: పూలనిచ్చే ఈ మొక్కలు ఆఫీసు టేబిల్స్ పై కూడా పెట్టవచ్చు. పూలు అపుడపుడూ వచ్చినప్పటికి వచ్చిన తర్వాత చాలా రోజులే వుంటాయి. వేళ్లు కొద్దిపాటి మట్టిగల నీటిలో వుంచి పెంచవచ్చు. నాలుగు అంగుళాల కుండీ వుంటే చాలు ఈ మొక్కను పెంచవచ్చు.

ఇండోర్ లో పెంచే ఈ ఆఫీసు మొక్కలు ఎపుడూ లోపలే వుంటాయి కనుక మధ్యాహ్న లంచ్ సమయంలో లేదా వారాంతంలో ఒకసారి సహజ వాతావరణం కొరకు బయట పెట్టండి. పచ్చని మొక్కలు ఎక్కడ చూసినప్పటికి కంటికి ఎంతో ఆహ్లాదంగా ఉండి తాజా అనుభూతులు కలుగుతాయి. ఒత్తిడి ఎంత ఉన్నప్పటికి పచ్చని పరిసరాలతో దానిని తేలికగా మరచిపోవచ్చు. కనుక నేడే మీ కార్యాలయాలు, వ్యాపార సంస్ధలలో పచ్చని మొక్కల పెంపకాన్ని చేపట్టి ఆనందించండి.

English summary

How to Make Greenary in Office? | పచ్చని మొక్కలు ఎక్కడైనా సరే!

Money Plant: They need no pruning or manure. They look green and beautiful always.Jade plant or money plant is also a best hydrponic plant. Decorating office cubicle with the money plant is termed lucky and friendly. Money plants can be planted in water and require less sunlight.
Story first published: Friday, July 27, 2012, 13:15 [IST]
Desktop Bottom Promotion