Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
నీడలో పెరిగే మొక్కల సంరక్షణ...

1. ఇంట్లో పెంచుకునే మొక్కల్ని నేరుగా సూర్యరశ్మి సోకని ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకోవాలి. అధిక వేడి నుంచి వీటిని కాపాడుకోవాలి. 20 నుంచి 27 డిగ్రీల వేడి అయితే ఫర్వాలేదుగానీ, ఆపై వేడి అయితే మొక్కలు సరిగా పెరగవు.
2. ఇంట్లో పెంచే మొక్కలకు వారానికి రెండుసార్లు నీళ్ళు పడితే సరిపోతుంది. కుండీలో కాస్త చెమ్మ ఉంటే మళ్ళీ నీళ్ళు పట్టాల్సిన పనిలేదు.
3. ఇంట్లో పెంచుకునే మొక్కలకు నీళ్లెంత అవసరమనే విషయాన్ని చేతితో కుండిలోని మట్టిని తాకగానే తెలిసిపోతుంది. ఒకసారి తాకగానే ఎండిపోయినట్లు కనిపిస్తే వెంటనే నీళ్లు పోయాలని అర్థం. కుండీల్లోని మట్టి స్వల్పంగా తడిగా ఉన్నట్లు అనిపిస్తే ఒకట్రెండు రోజులు వేచి చూడటం ఉత్తమం. నీరు ఎక్కువైనా, తక్కువైనా మొక్కలు పాడవుతాయి. మొక్కల్ని కొన్న తొలి రోజుల్లోనే నీళ్లు పోయటంలో తేడాలొస్తే పచ్చగా మారిపోయి చనిపోతాయి కాబట్టి జాగ్రత్త వహించటం మంచిది.
4. ఇంట్లో పెంచుకునే మొక్కల కుండీలలో ఎర్రమట్టి, గుర్రపు ఎరువు, గొర్రె ఎరువులాంటివి మొక్కలకు మంచి లాభాన్నిస్తాయి. దీంతో మొక్కలు పుష్టిగా పెరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
5. ఎరువుల మోతాదు విషయానికి వస్తే... కనీసం నెలకోసారి 20-20-20 రసాయాన్ని ప్రతి లీటరు నీటికి ఐదు గ్రాములు కలిపి పోస్తే మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి. ఎరువుల మోతాదు ఏమాత్రం పెరిగినా మొక్కలు మరణించే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విషయాన్నిఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోవద్దు. ఈ పాటి జాగ్రత్తలు తీసుకొన్నట్లైతే ఇండోర్ ఫ్లాంట్స్‌ను అందంగా ఆరోగ్యంగా పెంచుకోవచ్చును.



Click it and Unblock the Notifications