For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రేయసి ఇచ్చే గులాబీతో స్వప్నలోకంలో విహరించండి...

|

Red Roses
రోస్ గార్డెన్ మనస్సుకు ఎంతో ఉల్లాన్నిస్తుంది. అదే విధంగా మంచి సువాసననిచ్చే పూలు లేదా మొక్కలు జీవితంలో రొమాన్స్ కలిగిస్తాయి. ప్రేమికుల రోజున మీ భావాలు తెలుపాలంటే మంచి అందమైన, వాసనలు కల పూలు మంచి సాధనం. కనుక ఇంటి వద్ద మంచి రొమాంటిక్ మూడ్ తెచ్చుకోవాలంటే మీ గార్డెన్ లో లేదా ఇంటిలోపలి భాగంలో గులాబి మొక్క తప్పనిసరిగా పెంచుకోవాల్సిందే. ఎర్రటి గులాబి పువ్వు, చూసే వారికి ఎంతో ఆనందం కలిగిస్తుంది. ఎవరికైనా వెంటనే ఇవ్వాలనిపిస్తుంది. వీటిలో అనేక రంగులుంటాయి. ఈ మొక్కను కుండీలలో లేదా బయట కూడా పెంచవచ్చు. ముళ్ళను ఎప్పటికపుడు తీసేస్తూ ప్రతిరోజూ ఒకసారి నీరు పెట్టి, కొద్దిపాటి సూర్యరశ్మి తగిలితే చాలు మొక్క బాగా ఎదిగి పూలనిస్తుంది.

పుష్పాలకు రాణి గులాబి. ప్రేమకు చిహ్నం గులాబి! ఇష్టమైన వారికి ఇచ్చేందుకు ముందుగా గుర్తు వచ్చేది గులాబి! ధనిక, పేద తేడా లేకుండా అందరికీ అందుబాటులో ఉండేది, అతి తక్కువ ఖర్చుతో ప్రేమను వెల్లడించేది గులాబి! ప్రేమను తెలియజేసేందుకు ప్రేమికులు ఎక్కువగా ఉపయో గించే చిట్కా గులాబి ఇవ్వడమే! ఇన్ని ప్రత్యేకతలు ఉన్న గులాబికి ఇక ప్రేమికుల రోజున ఉండే డిమాండ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

వాలెంటైన్ డే వచ్చేస్తోంది ప్రేయసీ ప్రియులు తమ మనసులోని తీయని భావాలను మాలలుగా చేసి గులాబీ రేకులలో దాచి తమ స్వీట్ హార్ట్ కి ఇచ్చేయడానికి రెడీ అయిపోతారు. అన్నట్లు మీ ప్రేయసీ ప్రియులు ఇచ్చిన గులాబీలను మీతోనే ఉంచేసుకోండి. నిద్రపోయేటపుడు ఆ గులాబీలను మీ చెంతనే ఉంటే తీయటి కలలు సొంతమవుతాయట. నిద్రపోయేటపుడు గులాబీ, మల్లె తదితర పూల గుబాళింపులను ఆస్వాదిస్తే ఇక రాత్రంతా మైమరిపించే స్వప్నలోకంలో విహరిస్తారట.

English summary

Red Roses is a Symbol of Love... | ప్రేమకు చిహ్నం గులాబీలు...

Each roses color represents a relationship, whether the two are friends or lovers. I think roses are best for the job. As they are beautiful, they also have their thorns.
Story first published:Tuesday, January 31, 2012, 17:43 [IST]
Desktop Bottom Promotion