Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
పెరట్లో సుగుణాల రాశి కలబంద ఒక్కటి చాలు...!

దీనిని కాస్మోటిక్స్ లోను, ఆయుర్వేద వైద్య విధానాల్లోను విరివిగా వాడుతున్నారు. దీనితో లోషన్లు, యోగర్ట్స్ క్రీంలు, పానకాలు తయారు చేస్తున్నారు. జీర్ణశక్తిని పెంపొందించుకోడానికి, గుండె మంటని తగ్గించుకునేందుకు, అజీర్తివల్ల ఏర్పడే వ్యాధులు అరికట్టడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. కలబంద గుజ్జుని రోజ్‌వాటర్‌లో కలిపి శరీరానికి పూస్తే, శరీరంలోని మృత కణాలుపోతాయి. శరీరం కాలిన చోట కలబంద రసాన్ని వాడితే పూర్తి ప్రయోజనం చేకూరుతుంది. ఉదయాన్నే పరగడుపున కల బంద ఆకుని తింటే, కడుపులో ఉన్న అన్ని రకాల వ్యాధుల్ని మటుమాయం చేస్తుంది. అలాగే సాధారణ వినియోగంలోకి వస్తే, కలబంద ఆకుల రసంలో కొబ్బరినీటిని కలిపి శరీరంలో ఉండే నల్లని భాగాలలో రాస్తూ వుంటే నల్ల మచ్చలుగానీ, మూలల్లో ఏర్పడిన నలుపుగానీ వెంటనే పోయి శరీర కాంతి పెరుగుతుంది. మరి ఇన్ని సుగుణాలున్న ఈ మొక్కను ఎలా పెంచుకోవాలో చూద్దాం...
1. ఈ కలబంద మొక్కకు ముఖ్యంగా కావల్సిందే తగినటువంటి సూర్యరశ్మి. రోజంతా ఎండలో ఉన్నాకూడా మొక్కకు ఎటువంటి ఇబ్బంది కలగదు. నేలమీదైనా, కుండీలోనైనా బాగా పెరుగుతుంది.
2. అప్పుడప్పుడు ఈ మొక్కకు నీళ్ళు పోస్తే సరిపోతుంది.
3. దీనిని పెంచుకోవాలనుకొనే వారు జూన్, జూలైలో నాటుకొంటే బాగా పెరుగుతుంది. వేరు పిలకలు, కొమ్ము కత్తిరింపుల ద్వారా ప్రవర్ధనం చెందుతుంది. అలాగే ఈ మొక్కకు సాధారణ ఎరువు సరిపోతుంది.
4. అన్నిరకాల జాగ్రత్తలు తీసుకొంటున్న మొక్క పసుపు వర్ణంలోనికి మారితే అప్పుడు నీళ్ళు ఎక్కువ అవుతున్నట్టు గమనించి జాగ్రత్తపడాలి. తగినంత నీరు మాత్రమే పోయాలి.
5. శీతాకాలంలో ఈ మొక్కను అవుట్ డోర్ లో పెట్టుకోవడం కంటే ఇన్ డోర్ లో పెట్టుకోవడమే మంచిది. లేకుంటే మొక్కకు ఎక్కవ తేమ అంది మొక్క పెరగకుండా చేస్తుంది.
ఇటువంటి చిన్న పాటి జాగ్రత్తలు తీసుకొన్నట్లైతే ప్రతి ఇంట్లో కలబంద మొక్కను విరివిగా కుండీలలో పెంచుకోచ్చు.



Click it and Unblock the Notifications