For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వర్షపు నీటితో మీ గార్డెన్ మొక్కలను సంరక్షించండి...

|

భయంకరమైన ఎండలు, వేడి నుండి తప్పించుకొని వర్షాకాలం వచ్చేసింది. అదీ తొలకరి జల్లులంటే చిన్న, పెద్ద అని తేడా లేకుండా అందరికీ ఎంత ఆనందమో... ఆ తొలకరి జల్లుల్లో తడవడానికి, ఆడుకోవడనాకి చాలా మంది ఇష్టపడుతుంటారు. వర్షాన్ని ఎక్కువగా ఇష్టపడేవారు ప్రకృతిని కూడా ఎక్కువగా ప్రేమిస్తారనే నమ్మకం ఉంది. ఎందుకంటే ప్రకృతిలో ఒక బాగమే ఈ వర్షం కూడా. ప్రకృతిని ప్రేమించే వారు ఈ వర్షపు నీటిని ఎలా ఉపయోగించుకోవాలో చూద్దాం....

Ways To Use Rains For Your Garden...!

వర్షపు నీరు గార్డెనింగ్ కు బాగా ఉపయోగపడుతుంది. సంవత్సరం అంతా మొక్కలను పెంచుకోవాడానికి నీటిని ఎలా నిల్వ చేసుకోవాలో. ఈ వర్షపు నీటితో లాభనష్టాలేంటో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ ను చదవాల్సిందే. వర్షం పడటం వల్ల మీ శ్రమను కొంత వరకు తగ్గిస్తుంది. ఎందుకంటే గార్డెన్ మెయింటైన్ చేసావారు. ఈ సీజన్ లో కొద్దిగా రిలాక్స్ అవుతారు. ఎందుకంటే మొక్కలకు నీరు పట్టే పని ఉండదు కాబట్టి. అయితే మొక్కలను నీరు పట్టకపోయినా ఈ సీజన్లో వాటి జాగ్రత్త మాత్రం తీసుకోవడం అవసరం.

వాన నీటి వినయోగం: మీకు తెలుసా ప్రపంచంలో 2/3భాగం భూమిని నీటితోనే నిండి ఉంటుంది. అయితే ఆ నీరంతా ఉప్పునీరే? ఈ ప్రపంచంలో ఏదో కొద్దో గొప్ప తాజాగా స్వచ్చమైన నీళ్ళు దొరకడం అంటే వర్షపు నీరే. ఈ స్వచ్చమైన నీటిని ఎలా ఉపయోగించాంటే. వర్షాల పడే సమయం, ఆ వర్షపు నీటిని నిల్వ చేసుకొని ఆ నీటిని కనీసం రెండు మూడు నెలలైనా మొక్కలకు వినియోగించుకోవచ్చు. వాన నీటికోసం ప్రత్యేకంగా మేడ పైన లేద గార్డెన్ ప్రదేశంలోనో కత్రిమంగా నీటి నిల్వ చేయడానికి ఏదైనా తొట్టెలను, టాంక్ లను ఆరేంజ్ చేసుకోవచ్చు.

నేచ్యురల్ స్ప్రింక్లర్లు: ఈ సహజ స్ప్రింక్లర్లు ద్వారా మీ గార్డెన్ లో నీటిని పిచికారీ చేయవచ్చు. మొక్కలను నేరుగా మగ్గుతోనో లేదా బకెట్ తోనో నీటిని పోయడం కంటే ఈ స్ప్రింక్లర్లు అమర్చుకోవడం వల్ల మొక్కలకు సులభంగా నీటిని స్ప్రే చేయవచ్చు. ఇలా చేయడం వల్ల మొక్కల మొత్తం మీద వర్షపు నీరులా, తుంపరలా జల్లులు కురిపించిన వారమవుతాం. అదేవిధంగా నీటినీ ఆదా చేసుకోవచ్చు. కాబట్టి మొక్కలు వర్షపు నీరు అనుభూతిని కలిగి ఉంటాయి.

షేడింగ్: మీ ఇంటి బయట గార్డెన్ కలిగి ఉంటే, ఒక్కొక్కప్పుడు గార్డెన్ కు మెయింటైన్ చేయడం కష్టమవుతుంది. ఎందుకంటే సాధారణ వర్షం కాకుండా కుండపోత వర్షం కనుక పడినట్లైతే ఆ తోటలోని సారవంతమైన మట్టి అంతా వర్షపు నీటిలో కొట్టుకొనిపోతుంది. దాంతో మొక్కలకు హాని జరుగుతుంది. చాలా మంది తమ గార్డెన్ లో మొక్కలను రక్షించుకోవడానికి గార్డెన్ కి సరిపడే ప్లాస్టిక్ షీట్ తో కవర్ చేసుకొంటారు. పూర్తిగా పారదర్శకమైన ప్లాస్టిక్ షీట్ ను ఉపయోగించడం కంటే కొద్దిగా పలుచగా చిల్లులున్న గార్డెన్ షీట్ ను అమర్చుకొంటే కొంత వరకూ వర్షపు నీటిని మొక్కలు అందించవచ్చు. ఈ విధంగా వర్షపు నీటితో మొక్కలను కాపాడు కోవచ్చు.

సూచన: ముఖ్యంగా మొదటిగా పడే వర్షపు నీరు మీ కుండీ మొక్కలకు హాని కలిగించవచ్చు. కాబట్టి కుండీ మొక్కలను తొలకరిజల్లులకు దూరంగా ఉంచండి. మొదటగా కురిసే వర్షపు నీటిలో వాతావరణ, కాలుష్యం(పొగ, దుమ్మ, ధూళి)తో నిండి ఉండటం వల్ల అవి మొక్కలకు హాని కలిగించే అవకాశం ఉంటుంది.

వర్షపు నీరు, వర్షం వచ్చే సమయంలో వీచే గాలి మీ మొక్కలకు చాలా మంచిది. అయితే తుఫాను లేదా ఈదురు గాలుల నుండి మీ మొక్కలను మీరు కాపాడుకోవాల్సి ఉంటుంది. అందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకొంటే సరిపోతుంది. ఈదురు గాలులు చాలా బలంగా వీచడం వల్ల మొక్కల నిర్మూలం చేందే అవకాశం వుంది.

కాబట్టి ఈ వర్షపు నీటిని వృదా చేయకుండా, గార్డెన్ కు ఉపయోగించుకోవడం, తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మీ గార్డెన్ చాలా కాలం పాటు సురక్షితంగా ఉంటుంది.

English summary

Ways To Use Rains For Your Garden...! | గార్డెన్ మొక్కల ఎదుగుదలకు వర్షపు నీరే శ్రేష్టం.....

The rains have finally arrived breaking through the oppressive heat. Most of us are happy to see the first rains even if they do not make life very comfortable while travelling. Even if you are a fan of this wet and soggy season, you can make the most of it as a gardener. Yes, using the rains for your garden is a very viable idea.
Story first published: Thursday, July 19, 2012, 16:06 [IST]
Desktop Bottom Promotion