లివింగ్ రూమ్ మరింత వైభంగా ఉంచే ఇండోర్ మొక్కలు

Best Plants For Living Room || ఇండోర్ మొక్కలు || Boldsky Telugu

ఇండోర్ ప్లాంట్స్ ఇంట్లో ఉంటే ఆ ఇంటికే ఒక అందం. మొక్కలు ఉండే ఆ వాతవరణమే చాలా ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ప్రస్తుత రోజుల్లో చెట్లను డెకరేషన్ కోసం మాత్రమే కాకుండా ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు అనుగుణంగా కాలుష్యాన్ని నివారించాలంటే మొక్కలు చిన్న, పెద్ద మొక్కలు పెంచుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా పెద్ద పెద్ద నగరాల్లో చాలా ఇరుకైన ఇండ్లలో, జీవనం గడిపే వారికి, గాలి కాలుష్యం, నీటి కాలుష్యంతో అనేక ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. కనీసం వారికి ఉన్న కొద్ది స్థలంలోనే సాధ్యమైనంత వరకూ మొక్కలు పెంచుకోవడం వల్ల తాజాగాలిని పొందవచ్చు. మొక్కలు అనేవి ఆకర్షణ అందానికి మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా ముఖ్యం అనే విషయాన్ని తెలుసుకోవాలి.

కొన్ని సందర్భల్లో ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ పెంచుకోవడం ఒక రకంగా మంచి ఉపాయం అనే అనిపిస్తుంది. ఇండోర్ ప్లాంట్స్ ఇంటికి సరికొత్త అందాన్ని తీసుకొస్తాయి. ముఖ్యంగా అందరూ వచ్చివల్లే ముఖ్యమైన ప్రదేశంలో లివింగ్ రూమ్. ఈ లివింగ్ రూమ్ లో కనుక ఇండోర్ ప్లాంట్స్ ను అమర్చుకొన్నట్లైతే ఈ గదికి ఒక కొత్త వైభవం జతచేస్తుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇండోర్ ప్లాంట్స్ వల్ల ఇంట్లో ఒక స్వచ్చమైన గాలి మరియు ఆరోగ్యకరమైన గాలిని పొందడానికి సహాయపడుతుంది. కాబట్టి, మీరు లివింగ్ రూమ్ ను మరింత ఆహ్లాదభరితంగాను మరియు వైభవంగాను, ఆరోగ్యకరంగాను నిర్వహించగల కొన్ని రకాల మొక్కలను ఇక్కడ ఇస్తున్నాం. మరి మన లివింగ్ రూమ్ కు సరిపోయే బెస్ట్ ప్లాంట్స్ ఏంటో చూడండి...

Best Plants To Decorate Your Living Room

1. ఏరిక పామ్: మీ లివింగ్ రూమ్ కు ఏరికా ప్లాంట్ చాలా అద్భుతమైన మొక్క. ఈ మొక్క గాలిని స్వచ్చంగా మార్చే, కార్భన్ డై యాక్సైడ్ ను మరియు గాలిలోని టాక్సిన్స్ ను తొలగించే ఒక గొప్ప మొక్క. ఈ మొక్కను మీరు చాలా సులభంగా మీ సోఫా దగ్గర లేదా సోఫా సమీపంలో ఉంచవచ్చు. ఈ మొక్కను విండోకు దగ్గరగా ఉంచడం మరింత మంచిది. సన్నని ఆకులతో అందాలిచ్చే ఈ మొక్క అన్ని ఇళ్లలో కనిపించేదే.. వీటిలో లేడీ పామ్‌, బాంబూ పామ్‌, డ్వార్ఫ్‌ పామ్‌ రకాలున్నాయి.

2. రబ్బర్‌ ప్లాంట్లు : రబ్బర్ ట్రీ రబ్బర్ ట్రీ ని ఒక మంచి ఇండోర్ మొక్క అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది చూడటానికి అందంగా ఆకులు పెద్దగా పొడవుగా ఉంటాయి. చాలా మంది ఇల్లల్లో ఈ మొక్కను విరివిగా పెంచుకొంటారు. ఈ మొక్క కాండాన్ని పూర్తిగా పాట్ లో పాతి గ్రీన్ గా ఉన్న మొక్కగా భాగాన్ని మాత్రం పైకి కనబడేలా నాటాలి. ఈ మొక్క సూర్యరశ్మిలోనూ పెట్టుకోవచ్చు లేదా బాల్కనీలోనూ పెట్టుకోవచ్చు. ఈ మొక్కకు రెగ్యులర్ గా నీటిని పోయాల్సి ఉంటుంది. ఈ మొక్క ఇంట్లో పెట్టడం ద్వారా ఒక అందమైన అర్నమెంట్ గా తెలుస్తుంది. పొట్టిగా ఉండే ఈ మొక్కలని చిన్న కుండీలలో పెంచుకోవచ్చు. అయితే ఈ ఆకులు విషపూరితాలు కనుక వీటిని చిన్నారు లకు, పశువులకు దూరంగా ఉండేట్లు చూసు కోవాలి. జిగురు ఎక్కువగా ఉండటం వల్ల ఎప్పట కపðడు దీనినుండి మలినాలు తొలగించుకోవాలి.

3. స్నేక్ ప్లాంట్: ఈ మొక్క గాలిలో వున్న విషవాయువులను పీలుస్తుందని చెపుతారు. మంచితేమను కలిగి వుండి దాని పరిసరాలలో సహజమైన తేమను ఏర్పరుస్తుంది. ఇది లక్ మాత్రమే కాక ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. ఈ మొక్క గాలిలో వున్న విషవాయువులను పీలుస్తుందని చెపుతారు. మంచితేమను కలిగి వుండి దాని పరిసరాలలో సహజమైన తేమను ఏర్పరుస్తుంది. ఇది లక్ మాత్రమే కాక ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. ఈ మొక్కల సూర్మ రశ్మిలోనూ, నీడలో కూడా పెరుగుతాయి. వీటికి నీటి రెగ్యులర్ గా పోయాల్సిన అవసరం ఉండదు. ఈ మొక్క ఆకులు చాలా చిన్నగా ఉంటాయి. అందులోనూ చాలా వెరైటీలు గల మొక్కలు అందుబాటులో ఉన్నాయి.

4. అలోయి: అలోయి ప్లాంట్స్ ఇంట్లో పెంచుకోవడం వల్ల చాలా ఉపయోగాలే ఉన్నాయి. ఇది చర్మ సమస్యలకు చాలా మంచి చేస్తుంది. అంతే కాదు మెడిసినల్స్ బెనిఫిట్స్ కూడా అధికమే. కాబట్టి ఇంట్లో పెంచుకొనే ఇతర మొక్కలతో పాటు ఈ అలోయి ప్లాంట్ ను కూడా చేర్చండి. దీని నిర్వాహణ బాధ్యత కూడా తక్కువగానే ఉంటుంది. ఈ మొక్కలను ఇంటి ఆవరణంలోని గార్డెన్ లోనో లేదా బాల్కనీలో పెంచుకోవాచ్చు. దీనికి ఎక్కువ నీరు పోయడం వల్ల మొక్క త్వరగా చనిపోతుంది. కాబట్టి అవసరం మేరకు మాత్రమే నీరు పోయాలి.

5. మనీ ప్లాంట్: ఆఫీసు క్యూబికిల్ లో ఈ మొక్క అదృష్టమిస్తుందంటారు. కొద్దిపాటి నీటిలో ఈ మొక్కను పెంచవచ్చు. తక్కువ సూర్య రశ్మి చాలు. ఎరువులు అవసరం లేదు. ఆకులు తుంచేయాల్సిన పని అసలు లేదు. ఎపుడూ పచ్చగా అందంగా కనపడుతాయి.

6. డ్రాసియానా : అనేక షేపు ల్లో లభించే ఈ మొక్కలని జేనెట్‌ క్రెయిగ్‌ అని కూడా పిలుస్తారు. గుబురుగా పెరిగే ఈ మొక్కలు లివింగ్ రూమ్ లో అందాలిస్తాయి.

7. బోస్టన్‌ ఫెర్న్‌ : కుటుంబ సభ్యులకి మంచి ఆరోగ్యాన్ని అందించే మొక్కల్లో ఇది ముందుం టుంది.

8. ఇంగ్లీష్‌ ఐవీ : ఇది కూడా విషపూరిత ఆకులు కలిగినదే అయినప్పటికీ ఆస్మారోగులు ఉన్న గదుల్లో పెంచితే... వారికి మంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే అలర్జీల బారిన పడేవారు ఈ మొక్కలందించే గాలిపీలిస్తే... అవి తొందర గా తగ్గిపోతాయి.

ఈ మొక్కలు కాసిన్ని జాగ్రత్తలు తీసుకుని మీ ఇళ్లలో పెంచితే ఆయుష్షు పెంచుకోవచ్చు.

Desktop Bottom Promotion