Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
మీ గార్డెన్ ను కలర్ ఫుల్ గా మార్చే సమ్మర్ ఫ్లవర్స్ ప్లాంట్స్...!
వేసవి కాలం వచ్చేస్తోంది. చాల మంది సమ్మర్ లో తమ తమ ఇల్లను చల్లగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇంటిని అలా డెకరేషన్ చేసుకొంటారు. వేసవి కాలానికి అనుగునంగా కర్టెన్స్, ఫర్నీచర్ ను అమర్చుకొంటుంటారు. కాబట్టీ మీరూ రాబోయే సీజన్ కు అనుగుణంగా మీ ఇంట్లో మార్పులు చేయడానికి ఇష్టపడుతున్నారా.?
సీజన్ మారేకొద్ది ఆ కాలానికి అనుగుణంగా ఇంటిని డెకరేషన్ చేయడం వల్ల చూడటానికి అందంగా కనిపించడమే కాదు, ఎప్పుడూ తాజాగా ఏదో కొత్తదనం సంతరించుకుంటుంది. అయితే, ఇంటి అలంకరణ విషయానికి వస్తే కొత్తగా కనిపించేలా చేయలంటా కొద్దిగా కాదు..కాదు పెద్ద మొత్తంలోనే ఖర్చు చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా ఇంటి డెకరేషన్ లో ఇండోర్ ప్లాంట్స్ కూడా ఒక మంచి ఎంపిక. ఇది అనుకూలమైన మార్పును తీసుకురావడమే కాదు, ఎకో ఫ్రెండ్లీ ఫీలింగ్ ను కలిగిస్తుంది. కర్చు కూడా తక్కువే అవుతుంది. అంతే కాదు గార్డెన్లోని పూల మొక్కల నుండి వెదజల్లే సువాసనలు మనస్సు గార్డెన్ వైపు ఆకర్షింపబడుతుంది. ఇంకా బాల్కనీలో లేదా గార్డెన్ లో విశ్రాంతి పొందుతూ గార్డెన్ లోని సమ్మర్ ఫ్లవర్స్ ను చూస్తుంటే మనస్సు ఆహ్లాదభరితం అవుతుంది.
ఈ సమ్మర్ సీజన్ లో పెంచుకొనే పూల మొక్కలు చాలానే ఉన్నాయి. బంతి పూలు సమ్మర్ లో ఎక్కువగా పూస్తూ ప్రతి ఇంటి కుండీలలో, గార్డెన్ లలో రంగురంగులుగా అలరిస్తుంటాయి. ఇవి పెరగడానికి ఎక్కువ నిర్వాహాన బాధ్యతులు అవసరంలో చాలా సులభంగా పెరుగుతాయి. ఇటువంటి సమ్మర్ మొక్కలను మీ గార్డెన్ లో చేర్చడం వల్ల రంగురంగుల పువ్వులతో పాటు డిఫరెంట్ గా సువాసనలు వెదజల్లు వేసవి వేడిని తరమగొడుతాయి. మనస్సుకు ఆహ్లాదాన్ని అందిస్తాయి. కాబట్టి ఈ సమ్మర్ సీజన్ లో మీ ఇంటికి సరిపోయే ఇండోర్ ఫ్లవర్ ప్లాంట్స్ ను ఎంపిక చేసి తీసుకొచ్చి ఇంటిన అద్భుతంగా కలర్ ఫుల్ గా అలంకరించండి.

బాల్సమ్: ఈ బాల్సమ్ మొక్కలు సమ్మర్ సీజన్ లో బాగా పెరుగుతాయి. అంతే కాదు, సమ్మర్ సీజన్ మద్యకాలంలో ఈ మొక్కల పువ్వులు విరబూస్తాయి. ఈ మొక్కలు అచ్చం చూడటానికి గార్డె మొక్కల్లాగే అనిపిస్తాయి. వీటిలో వైట్, పింక్ మరియు రెడ్ కలర్స్ ఉన్నాయి.

డాలియా: అరచేతి పరిమాణంలో ఉండి అద్భుతంగా విచ్చుకునే రంగు రంగులతో కాంతుల విరబూసే పుష్పాలు 'డాలియాలు'. రంగు, రూపులోను డాలియాలకు ఏ పుష్పాలు సాటిరావు. అందరి దృష్టి మరల్చుకునే ప్రత్యేకత ఈ డాలియా పుష్పాలకు ఉంది. ఎరుపు, తెలుపు, పసుపు, నీలం, గోధుమ, పింకు, డబుల్ కలర్, తదితర రంగుల్లో లభ్యమవుతూ చూపరుల మనస్సులు దోచుకుంటున్నాయి. పొడవాటి కాండం వచ్చి దాని చిటారున ఏక పూవు పూస్తూ గుబాళిస్తూ ఉం టుంది. విచ్చుకున్న పది నుంచి 15రోజుల వరకు ఈ పువ్వుకాంతులు ఇస్తుంది.

గ్లాడియోలస్: గ్లాడియోలస్ పూలను కట్‍ఫ్లవర్‍గా, అందమైన పూగుచ్ఛాలు తయారు చేయడంలో ఉపయోగిస్తారు. దీనికి సమశీతోష్ణ వాతావరణం అనుకూలం. దుంపల ద్వారా ప్రవర్ధనం చేస్తారు. దుంపలను తవ్వి తీసిన మూడు నెలల వరకు నిద్రావస్థ వుంటుంది. 4 సెంటీమీటర్ల వ్యాసంగల దుంపలని నాటుకొన్నట్లైతే పెద్ద పూల కాడలు వస్తాయి. దుంపలు చిన్నగా వున్నట్లైతే పూలకాడలు చిన్నగా వుంటయి. ఇంకా చిన్నగా వున్నట్లైతే పూల కాడలు ఏర్పడవు. ఇంటి ముంగిట్లో, పెరట్లో ఎక్కువ స్థలం ఉంటే దీన్ని వాణిజ్య అవసరాలకు 'ఫ్లోరికల్చర్' తరహాలో పెంచుకోవచ్చు. దీనికి సారవంతమైన ఎర్రమట్టి నేలలు అనువైనవి. కాస్త విశాలమైన కుండీల్లో మూడు, నాలుగు అంగుళాల లోతులో దుంపను పాతాలి. గ్లాడియోలస్ మొక్క పూలు పూశాక కాండాన్ని కత్తిరిస్తే మళ్లీ పెరుగుతుంది. దుంపని భూమిలో ఉంచేప్పుడే మట్టితో పాటూ ఎరువూ, వేప పిండి వేస్తే ఆరోగ్యంగా పెరుగుతాయి.

బంతి పువ్వు: ఇంటి గార్డెన్ లో పెంచటానికి అనువైనది. ఏ రకమైన నేల అయినా పెరుగుతుంది. విత్తనాలు చల్లితే చాలు మొక్క వచ్చేస్తుంది. మొక్క రెండు అంగుళాలకు రాగానే తీసి విడివిడిగా పెట్టడి. ఎండు ఆకులు తుంచేయండి. రోజు విడిచి రోజు నీరు పెట్టండి. సూర్యరశ్మి అధికంగా వుండాలి.

ఒలియాండర్: గన్నేరు (ఆంగ్లం Oleander) ఒక అందమైన పూలమొక్క. దీని పువ్వులు పసుపు పచ్చ రంగులో ఉంటాయి. మధ్యధరా సముద్ర ప్రాంతంలో పెరిగే గన్నేరు పువ్వులు ఎరుపు, తెలుపు రంగులోనూ ఉంటాయి. ఇది ఐదు నుంచి ఏడు అడుగుల ఎత్తులో ఉంటుంది. కొమ్మలు, సన్నగా పొడుగ్గా ఉంటాయి. దీని గింజల నుంచి నూనె లభిస్తుంది. దీని పాలు విషంతో సమానం. దీని గింజలు తింటే మరణం సంభవిస్తుంది. దీని వేళ్ళను తామర, గజ్జి, కుష్టు వంటి చర్మ వ్యాధుల నివారణకు ఔషధాల నివారణలో ఉపయోగిస్తారు.

పొటెంటిల్లా : సమ్మర్ లో పెరిగే పూలమొక్కల్లో ఇది కూడా ఒక్కటి. ఇది చాలా సులభంగా పెరగుుతుంది. ఈ మొక్కయొక్క పువ్వులు ఎల్లో కలర్ లో అద్భుతంగా ఉంటాయి . ఈ పూలతో మీ గార్డెన్ కలర్ ఫుల్ గా కనబడుతుంది.

స్మోక్ బుష్: ఈ పింక్ కలర్ లో పొగాల లేదా మంచులా కప్పినట్లుండే ఈ మొక్క సమ్మర్ లో పూచే ఒకరకమైనటువంటి పూల మొక్క.

సమ్మర్ స్వీట్: ఇది ఒక అద్భుతమైన ,విచిత్రమైన ఫ్లవర్ మరియు ఈ మొక్క నుండి వచ్చే సువాసన అద్భుతంగా ఉంటుంది. వివిధ కలర్ లో పూచే ఈ మొక్క మట్టిలో పెరుగుతుంది.

మందారం: ఈ మొక్క యొక్క ఆరోగ్య మరియు కేససంరక్షణకు ఎన్ని ప్రయోజనాలను అందిస్తుందో అందరికీ తెలిసిన విషయమే. ఈ మొక్క యొక్క పువ్వులు వివిధ రంగుల్లో ఉన్నాయి. ఈ మొక్కలకు వెచ్చదనం అవసరం అవుతుంది. అలాగా తగినంత తేమ మరియు కాంతి అవసరం అవుతుంది. అందంగా పుష్పించే ఈ మొక్కను ఇండోర్ ప్లాంట్ గా పెంచుకోవడం వల్ల ఇంట్లో చల్లదనంతో పాటు, ప్రశాంత వాతావరణాన్ని అందిస్తుంది.

సన్ ఫ్లవర్: సమ్మర్ లో పెరిగే మొక్కల్లో సన్ ఫ్లవర్ ఒకటి. ఈ హాట్ సీజల్ గార్డెన్స్ లో సన్ ఫ్లవర్ మొక్కలుంటే మనస్సును ఇట్టే ఆకర్షిస్తాయి. ప్రొద్దుతిరుగుడు పువ్వునే సూర్యకాంతి పువ్వు (Sun flower) అంటారు. ఇది బంతి జాతి మొక్కకు చెందినది. ఒకే మొక్కలో అనేక లాభాలనుకునేవారికి అన్నిటికంటే ప్రొద్దుతిరుగుడు పువ్వే మిక్కిలి ముఖ్యమైనది.



Click it and Unblock the Notifications











