Latest Updates
-
చర్మ అలెర్జీలకు గుడ్ బై!.. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని బెస్ట్ న్యాచురల్ రెమెడీస్ ఇవే! -
పైసా లేదని పెళ్లిళ్లు చేసుకోరు, కానీ పిల్లల్ని కంటారు.. ఈ వింత ఆచారం ఎక్కడో తెలుసా.? -
తమిళుల ఆరోగ్య రహస్యం.. ప్రొటీన్, ఫైబర్ పుష్కలంగా ఉండే తంజావూర్ అడై.. ఒక్కటి తిన్నా చాలు.! -
లాభ దృష్టి యోగం: సెప్టెంబర్ 15 తర్వాత ఈ నాలుగు రాశుల ఇళ్లలో ధనలక్ష్మి తిష్ట! -
కొవిడ్ ఇచ్చిన కిక్.. డిగ్రీ పట్టా లేదు, వ్యాపారం కాదు.. కానీ 20 ఏళ్లకే నెలకు రూ. లక్షల్లో ఆదాయం.! -
పచ్చిమిర్చి ఊరగాయ ఇలా చేస్తే..ఒక్క ముద్ద తినేవాళ్లు నాలుగు ముద్దలు లాగించేస్తారు! -
కౌమార దశలో బాలికలు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య ఏంటో తెలుసా.? -
చికెన్ బిర్యానీ తిన్నా షుగర్, బరువు పెరగకుండా ఉండాలంటే ఇలా చేయండి! -
డా. మంతెన ఆరోగ్య చిట్కాలు.. అన్ని విటమిన్లనూ ఒకే కప్పులో అందించే ప్రకృతి రహస్యం ఇదే.! -
రాత్రి అన్నం మిగిలితే ఇలా ఊతప్పం చేయండి.. పిల్లలు, పెద్దలు లొట్టలేసుకుని తింటారు!
కుంపట్లలో కూరగాయలు పండించవచ్చు: మార్గాలు
తోటపని అంటే ఇష్టపడే వారు చాలా మంది ఉంటారు. పల్లెల్లోనే కాదు పట్టణాల్లో గార్డెన్ ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొని, ఉన్నంత స్థలంలోనే వారు మొక్కలను పెంచుకుంటారు. మీ ఇంట్లో గార్డెన్ స్థలం చాలా తక్కువగా ఉందా లేదా మీరు అపార్ట్ మెంట్ లో నివసిస్తున్నారా? అయితే మీకు గార్డెనింగ్ అంటే ఇష్టమైనప్పుడు ఇండోర్ గార్డెనింగ్ ను నిర్వహించడం చాలా సింపుల్ పరిష్కార మార్గం.
పాంట్ ప్లాంట్ (కుంపట్లలో పెంచుకొనే )మొక్కలు ఇంటి అలంకరణకు ముఖ్యంగా బాల్కనీ అందంగా ఉంచడానికి బాగా సహాయపడుతాయి. ఇండోర్ లో మొక్కలు పెంచుకోవడం వల్ల ఆ ఇంటికే ఒక అందం తెచ్చిపెడుతుంది. పచ్చని ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అంధిస్తుంది. అటువంటి ఆహ్లాదరమైన వాతావరణాన్ని మీరు పొందాలన్ని, మీఇంటిని గ్రీనరీగా ఎకో ఫ్రెండ్లీగా మార్చుకోవాలంటే, పాట్స్ (కుంపట్ల)లలో మొక్కలను పెంచుకోండి.
తచరచుగా చాలా మంది కుంపట్లలో వెజిటేబుల్స్ మొక్కలను పంచడం కష్టం అని భావిస్తారు. వెజిటేబుల్ మొక్కలకు ఎక్కువ స్థలం అవసరం అవుతుందని భావిస్తారు. ఉదాహరణకు వాటర్ మెలోనో(పుచ్చకాయ మరియు క్వాష్ )మొక్కలు చాలా విశాలంగా పెరగాలంటే స్థలం ఉండాలి. అయితే, కొన్ని వెజిటేబుల్స్ కుంపట్లలో పెరుగుతాయి. ఉదాహరణకు: బీన్స్, క్యారెట్, బంగాళదుంప, వంకాయలు, ఉల్లిపాయలు, పచ్చిబఠానీలు మరియు మరికొన్ని ఇతర వెజిటేబుబ్స్ కంపట్లలో పెరుగుతాయి. మరియు కీరదోస వంటి వెజిటేబుల్స్ ను పెద్ద పెద్ద కుంపట్లలో పెంచుకోవచ్చు.
వెజిటేబుల్ యొక్క మొక్కలు మీరు కుంపట్లలో పెంచుకోవాలనుకుంటుంటే, మీకోసం కొన్ని వెజిటేబుల్స్ మొక్కల లిస్ట్ క్రింది లిస్ట్ లో ఇవ్వబడింది. మరికెందుకు ఆలస్యం మీరు కొన్ని ఆర్గానిక్ వెజిటేబుల్స్ మీ డైట్ లో చేర్చుకోవచ్చు. స్వంతా మొక్కలు పెంచుకోవడం, కూరగాయలను పండించుకోవడం వల్ల ఒక స్పెషల్ ట్రీట్ మరియు సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. మరి ఆ స్పెషల్ వెజిటేబుల్ పాట్ ప్లాంట్స్ ఏంటో ఒక సారి చూద్దాం...

ముల్లంగి:
కుంపట్లలో ముల్లంగిని పెంచుకోవడం చాలా సులభం. కుంపట్లో విత్తనాలను చల్లాలి. కుంట్లో ఉన్న ఎరువు సారవంతమైనదిగా ఉండేలా చూసుకోవాలి. తర్వాత ఒక నెలలో ముల్లంగి దుంపలు పండటం మీరు గమనించవచ్చు.

పెప్పర్స్:
పెద్ద కుంపట్లో పెరిగేటటువంటి ఇక బెస్ట్ వెజిటేబుల్. ఈ పెప్పర్స్ పండించుకోవడానికి పెద్ద కుంపట్లు చాలా ఉత్తమం. ఏ 5 గ్యాలన్ పాట్ లో రెండు మూడు మొక్కలను నాటుకోవచ్చు.

గ్రీన్ ఆనియన్స్:
ఉల్లికాడలు (గ్రీన్ ఆనియన్స్) 5గ్యాలన్ కంటైనర్ లో చాలా బాగా పెరుగుతాయి. కుంపట్లకు 2, 3అంగులపైవరకూ ఎరువు మట్టితో నింపాలి. తర్వాత ఉల్లిపాయ విత్తనాలు లేదా ఉల్లిపాయలను రెండు మూడు అంగుళాల లోతులోపనికి పూడ్చాలి.

లెట్యూస్:
ఈ గ్రీన్ వెజిటేబుల్ కంటైనర్స్ లో చాలా సులభంగా పెరుగుతుంది. లెట్యూస్ యొక్క విత్తనాలను కుంపట్లో ఎరువుపైన చల్లాలి. తర్వాత అవసరం అయినప్పుడు నీరు పట్టడం వల్ల లెట్యూస్ చాలా త్వరగా మరియు సులభంగా పెరుగుతుంది.

టమోటోలు:
కుంపట్లలో చాలా సులభంగా పెరిగే వెజిటేబుల్ మొక్క. వివిధ రకాల టమోటో విత్తనాలను తీసుకొచ్చి కుంపట్లలో చల్లడం వల్ల టమోటో మొక్కలు చాలా సులభంగా పెరుగుతాయి. మరియు అవసరం అయినప్పుడు నీరు పడుతుండాలి.

బీట్ రూట్:
కుంపట్లలో ఏవెరైటీ దుంపలైన చాలా సులభంగా పెరుగుతాయి. ముఖ్యంగా ఎర్రదుంపలు చాలా త్వరగా పెరుగుతాయి. అయితే ఈ దుంపలను నాటే ముందు 12అంగుళాలలోతుగా నాటిలి. మరింత లోతుగా నాటడం వల్ల దుంపలు చెడిపోవడం జరగుతుంది.



Click it and Unblock the Notifications
