For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ ఇంట్టో గాలిని శుభ్రపరిచే ఇంట్లో పెరిగే మొక్కలు

By Super
|

కొన్ని మొక్కలు గాలిలోని కార్బన్ డై ఆక్సైడ్ ను పీల్చటమే కాదు. గాలిలోని మలినాలను విషవాయువులను కూడా పీల్చి పరిశుభ్రం చేస్తాయి. వీటిని ఇండోర్ మొక్కలుగా పెంచుకుంటే ఆరోగ్యం బాగుంటుందని నిపుణులు చెపుతున్నారు. మీరు ఇప్పటికే ఇండోర్ గార్డెన్ నిర్వహిస్తున్నట్లయితే, తక్షణమే వీటికి మీ ఇంట్లో స్ధానం కల్పించి కాలుష్యం లేని చక్కటి గాలితో ఆరోగ్యాన్ని పొందండి.

ఈ క్రింది మొక్కలతో మీరు ఉండే ప్రదేశాలను అలంకరించుకుంటే మీరు పీల్చే గాలి స్వచ్చంగా ఉంటుంది.

వెదురు మొక్క చాలా గొప్పది, దాన్ని మీఇంట్లో పెంచినట్లయితే వాతావరణంలో ఉండే అన్నిరకాల రసాయనాలని తొలగిస్తుంది. దీనికి ఎక్కువ సూర్యకాంతి అవసరం లేదు, అందువల్ల ఇంట్లోనే నీడ ఉన్న చోట పెంచవచ్చు. ఇది కార్బన్ మోనాక్సైడ్, బెంజేన్, ఫార్మాల్డిహైడ్, గ్సైలిన్, క్లోరోఫారం వంటి వాటిని తొలగిస్తుంది, వీటిని లాండ్రీ రూమ్, లివింగ్ రూమ్ లేదా బెడ్ రూమ్ లో ఉంచడం మంచిది.

Houseplants that will purify your home

భారతదేశంలో రబ్బరు చెట్లు చాలా సర్వసాధారణం. వాటిని ఆరోగ్యంగా ఉంచడానికి ఎక్కువ వెలుగు, నీరు, ఎరువులు ఎక్కువ మోతాదులో అవసరం. ఇది కార్బన్ మోనాక్సైడ్, ఫార్మాల్డిహైడ్, ట్రైక్లోరోథైలిన్ ని తొలగించడానికి మంచి ఎంపిక.


వెదురు లాగానే పోక చెక్క మొక్క కూడా ఒకటి. దీని ఆకులు అల్లుకున్నట్లు ఉండి చాలా ఆకర్షణీయంగా, అందంగా కనిపిస్తాయి. వీటి పెరుగుదలకు ఎక్కువ సూర్యకాంతి, నీరు అవసరం. ఇది బెంజీన్, కార్బన్ మోనాక్సైడ్, గ్సైలిన్, ట్రైక్లోరోథైలిన్, ఫార్మాల్డిహైడ్ ని తొలగించడమే కాకుండా గాలిని చల్లబరుస్తుంది కూడా.


అందమైన తులిప్ మొక్కలు ఇంట్లో అందంగా కనిపించడమే కాకుండా, గాలిని స్వచ్చ పరుస్తాయి. నేరుగా సూర్యకాంతి పాడనీ చోట వీటిని ఉంచి, ప్రతిరోజూ తేమగా ఉందొ లేదో అని మట్టిని పరీక్షించాలి. ఇది అమ్మోనియాను పారద్రోలుతుంది.

English summary

Houseplants that will purify your home

Decorate your living spaces with the following plants to that will filter the air you breathe.
Story first published: Saturday, June 13, 2015, 11:18 [IST]
Desktop Bottom Promotion