For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తుమ్మెదల్నీ, సీతాకోక చిలుకల్నీ ఆకర్షించే ఎల్లో బెల్స్ పెంపకం ఎలా

|

కొమ్మ చివరన నాజూగ్గా, గుత్తులు గుత్తులుగా విరబూసే సింగారం ఎల్లో బెల్స్ సొంతం. తక్కువ సమయంలోనే సులభంగా ఎదిగే తత్వం వీటి ప్రత్యేకం. మరి వీటినెలా పెంచుకోవాలంటే ..

ఎల్లో బెల్స్ మొక్క పుట్టిల్లు అమెరికా అయినా ఈ మధ్యకాలంలో మనదేశంలోనూ ఎంతో ప్రాచుర్యం పొందింది. చూడ్డానికి సన్నాయి తరహాలో పసుపు రంగులో ుంటుంది. కాబట్టి దీనికా పేరు వచ్చింది. ప్రతి కొమ్మ చివరనా గుత్తులు గుత్తులుగా విరబూసే పూలు ఈ మొక్కకు నిండుదనాన్ని తీసుకొస్తాయి. పువ్వులు నాజూగ్గా ుంటాయి.

How to Grow Esperanza Yellow Bells

ఇప్పుడు బాల్కనీలు, పోర్టికోలు, ఇంటితోటలే కాదు, పెద్ద పెద్ద రిసార్టులు, స్కూళ్లలో కూడా ఇవి కినిపిస్తున్నాయి. ఇవి శీతాకాలంలో ఎక్కువగా పూలు పూస్తాయి. ఇవి తుమ్మెదల్నీ, సీతాకోక చిలుకల్నీ ఆకర్షిస్తాయి. ఎప్పటికప్పుడు వీటిని కత్తిరించుకోవడాన్ని బట్టి ఇవి నాలుగైదు అడుగుల ఎత్తు వరకూ పెరుగుతాయి.

How to Grow Esperanza Yellow Bells

ఎలా పెంచుకోవాలి:

ఇవి మన దగ్గర ఉన్న అన్ని రకాల నేలల్లో చక్కగా ఎదుగుతాయి. వీటని కుండీల్లో నాటుకునేప్పుడు మాత్రం ఎర్రమట్టి, సేంద్రియ ఎరువుని సమపాళ్లలో కలుపుకోవాలి. ప్రతి మొక్కనీ పెద్ద పరిమాణంలో, బరువుగా ఉన్న కుండీలో నాటుకోవాలి. ఇలా చేయడం వల్ల రెండు మూడేళ్ళ వరకు కూడా కుండీ మార్చాల్సిన అవసరం ఉండదు. కనీసం మూడు, నాలుగు గంటల పాటు ఎండతగిలే ప్రదేశంలో ఉంచాలి. నీళ్లను రోజు విడిచి రోజు పెట్టినా సరిపోతుంది. దీన్ని వివిధ ఆకృతుల్లోనూ తీర్చిదిద్దుకోవచ్చు. అయితే మొక్కను నాటినప్పటి నుంచే అంటే కాండం ముదరకుండానే కొమ్మల్ని కత్తిరించుకుంటూ ఉండాలి. మనకు కావల్సిన ఆకృతి వచ్చాక పువ్వులు పూయడానికి అవసరమైన పోషకాలపై దృష్టి పెట్టాలి. 19:19:19 చొప్పున ఎన్ పీకెను మొక్కకు అందించాలి. అప్పుడే పూలు ఎక్కువగా, అందంగా పూస్తాయి.

How to Grow Esperanza Yellow Bells

ఖనిజాలు లోపిస్తే...

ఈ మొక్కల్ని ఉత్పత్తి చేయడానికి కాండాన్ని కత్తిరించి నాటుకోవడం, విత్తనాలను చల్లడం ద్వారా చేయవచ్చు. ఈ మొక్కను నిస్సారంగా ఉన్న నేలల్లో పెంచినప్పుడు షాస్ఫరస్, మెగ్నీషియం వంటి ఖనిజాలు లోపించే ప్రమాధం ఉంది. దీని వల్ల ఆకులు పాలిపోయి కాంతి విహీనంగా కనిపిస్తాయి. ఇలాంటప్పుడు డీఏపి, యూరియా, కలిపిన మిశ్రమాన్ని మొక్కకు అందించాలి.

వీటికి తెల్లదోమ, పేనుబంక వంటి చీడపీడలు దాడిచేసే ఇబ్బంది లేకపోలేదు. ఇలాంటప్పుడు బహుళ ప్రయోజన సేంద్రియ కీటకనాశనిని ఉపయోగించుకోవచ్చు. ఈ సమస్య శీతాకాలం ప్రారంభ సమయంలో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ మొక్కలు పాతిక నుంచి యాభై రూపాయల్లో లభిస్తాయి.

English summary

How to Grow Esperanza Yellow Bells

Bring on the heat and dry conditions: Yellow bells blooms through the challenges nature throws at it. Native to the North American Southwest, this tough plant has spectacular yellow trumpet-shape blooms from late spring through fall. Grow it as a shrub, using it to screen unsightly views or add color to a mixed border, or plant it in a container to add instant size and structure to your container planting. 
Story first published: Tuesday, March 17, 2015, 16:51 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more