For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరు ఒక కిచెన్ గార్డెన్ కలిగి ఉండాలి, ఎదుకు? కారణాలు!

By Super
|

మీరు స్వంతంగా మూలికలమొక్కలను పెంచే ఆలోచనతో ఉంటే, ఖచ్చితంగా అమలు చెయ్యండి! మీ వంటగది లేదా బాల్కనీలో గాని ఒక విండో దగ్గర ఒక స్పాట్ ఎంచుకోండి, మరియు మొక్కలతో నింపండి. మీరు ఎందుకిలా చేశానా అని ఏమి పశ్చాతాపపడరు! కిచెన్ గార్డెన్స్ ఎందుకు అద్భుతంగా కనిపిస్తాయో ఇక్కడ చూద్దాం.

 మీకు కావలసినప్పుడు తాజాగా మూలికలు పొందండి.

మీకు కావలసినప్పుడు తాజాగా మూలికలు పొందండి.

మీకు కొన్ని తులసి లేదా కాది పట్టా ఆకులు కావాలనుకుంటున్నారా! మీరు వాటిని కొనే బదులు మరుక్షణంలో వాటిని తెంపి వాడుకోవచ్చు.ఇంకా మీరు కేవలం కొన్ని ఆకుల కోసం మొత్తం కట్టను కొనే అవసరం లేదు.

మీరు ఆహారంలో ఏమేమి తీసుకుంటున్నారు అని ఖచ్చితంగా తెలుసుకోవటం

మీరు ఆహారంలో ఏమేమి తీసుకుంటున్నారు అని ఖచ్చితంగా తెలుసుకోవటం

అనేక రకాల పురుగుమందులతో పంటలు పండిస్తున్న ఈ రోజుల్లో, ఏ ఆహారం తింటే సురక్షితం అని తెలుసుకోవటం కష్టంగా ఉంది. మీకు మీరుగా మొక్కలను పెంచుతూ ఉంటే, ఆ ఆహారం సురక్షితమైనది మరియు రసాయన రహితమైనదని అని తెలుస్తుంది.

ఇది బయటకన్నా చౌకగా లభిస్తుంది

ఇది బయటకన్నా చౌకగా లభిస్తుంది

మొక్కలను పెంచటానికి ఎక్కువగా ఖర్చు చేయనక్కరలేదు మరియు అవి ఒకసారి స్థిరపడ్డాయి అంటే, వాటికి కొద్దిగా నీరు అవసరం.అంతే! కాలక్రమేణా, మీ కిరాణా బిల్లు ఆదా అవుతుంది ప్రత్యేకించి మీరు సాధారణంగా ఆర్గానిక్ ఆహారమును కొంటున్నప్పుడు.

మీరు చాలా ఆరోగ్యవంతులుగా తయారవుతారు

మీరు చాలా ఆరోగ్యవంతులుగా తయారవుతారు

మీరు తులసి మరియు పుదీనా వంటి మొక్కలను పెంచుతూ ఉంటే , మీరు ప్రతి రోజు ఒకటి లేదా రెండు ఆకులు తినడం అలవాటు అవుతుంది లేదా ఉదయంపూట టీలో వాటిని కలిపి సేవించటం ప్రారంభించవచ్చు. ఈ మూలికలు దంతసంరక్షణకు, అలాగే జ్వరం, ఆస్త్మా, ఊపిరితిత్తుల వ్యాధి, గుండె వ్యాధులు మరియు ఒత్తిడికి చికిత్సలాగా, మెరుగైన శ్వాస రుగ్మతల నుండి ఉపశమనం వంటి ఔషధ ప్రయోజనాలతో నిండి ఉన్నాయి.

మీరు ప్రకృతినుండి లభించే ప్రశాంతతను పొందుతారు

మీరు ప్రకృతినుండి లభించే ప్రశాంతతను పొందుతారు

గార్డెనింగ్ మీ ఒత్తిడి స్థాయిలను తగ్గిస్తుంది మరియు మీరు విశ్రాంతి సహాయపడే ఒక ప్రశాంత కార్యకలాపం. ప్రకృతి మీ చుట్టూ ఉండటం భౌతిక మరియు మానసిక ఆరోగ్యానికి మంచిది, మీ మొత్తం శ్రేయస్సు కోసం ఇది అద్భుతాలు చేస్తుందని అనేక అధ్యయనాలు నిరూపిస్తున్నాయి.

మొక్కలు దోమలు వికర్షిస్తాయి.

మొక్కలు దోమలు వికర్షిస్తాయి.

మీరు పెంచాలనుకునే మూలికలమొక్కలను జాగ్రత్తగా ఎంచుకుంటే, అవి మిమ్మలిని దోమల గాట్ల నుండి నిరోధిస్తాయి మరియు డెంగ్యూ లేదా మలేరియా పొందే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఒక మంచి దోమవికర్షక మొక్క బంతి పువ్వు - ప్రతి 2-3 మూలిక మొక్కల తరువాత ఒక బంతి పువ్వు మొక్క పెట్టండి! చాలు - మీరు చాలా ఆరోగ్యంగా బాగుంటారు. రంగురంగుల పువ్వులు మీ ఇంటిని ప్రకాశవంతంగా ఉంచుతాయి!

ఒక నమ్మలేని సాఫల్యత ఉంటుంది

ఒక నమ్మలేని సాఫల్యత ఉంటుంది

మీరు మొక్కలతో సంబంధం ఏర్పరచుకుంటారు అన్న ఆలోచన ఒక వెక్కిరింతగా అనిపించవచ్చు, కానీ మీరు స్వంతంగా మొక్కలపట్ల జాగ్రత్తలు తీసుకోవటం మొదలుపెడితే, మీకు మేము చెప్పేది అర్థం తెలుసుకుంటారు. మీరు నాటే ప్రతి చిన్నమొక్క, కొమ్మ లేదా పుష్పం మీకు వ్యక్తిగత సంతృప్తిని, స్ఫూర్తిని ఇస్తుంది .

English summary

Reasons Why You Should Have A Kitchen Garden

Reasons Why You Should Have A Kitchen Garden. If you’ve been toying with the idea of growing your own herbs, you should absolutely do it! Pick a spot near a window, either in your kitchen or balcony, and fill it with plants. You won’t regret it! Here’s why kitchen gardens are awesome.
Desktop Bottom Promotion