For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెరట్లో మొక్కల ఆరోగ్యానికి వంటింటి చిట్కాలు

By Nutheti
|

ఇంటిని అందంగా.. ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుంటే అతివలకు ఆ ఆనందమే వేరు. రకరకాల మొక్కలు.. పూల మొక్కలతో పెరటి అందాన్ని పెంచండి. రోజూ మీ ఇంటిని కొత్తగా అలంకరించి.. నిత్యనూతన శోభను తీసుకురండి. అయితే రోజూ కొత్తగా ఆలోచించాలంటే.. కష్టమే. అందుకే మీ కోసం మేము ఇంట్రెస్టింగ్ గార్డెనింగ్ టిప్స్ ఇస్తున్నాం.

కొంత మంది గార్డెనింగ్ ని అలవాటుగా మార్చుకుంటారు.. కానీ.. కొంతమంది వృత్తిలా ఫీలవుతారు. ఎలా అనుకున్నా.. గార్డెనింగ్ మాత్రం మగువలకు ఇష్టమైనదే. కొన్నిసందర్భాల్లో మనం చేస్తున్న పనుల ద్వారా కూడా.. గార్డెనింగ్ ఐడియాలు వస్తుంటాయి. కొన్ని చిట్కాలు భలే గమ్మత్తుగా.. క్రేజీగా అనిపిస్తాయి. కానీ.. అవి ప్రయత్నించి చూస్తే మంచి ప్రయోజనం ఉంటుంది.

ఎగ్ షెల్స్

ఎగ్ షెల్స్

కోడిగుడ్డు లోపలి భాగాన్ని వాడుకుని.. షెల్ ని చెత్తబుట్టలో పడేస్తున్నారా ? ఇకపై అలా చేయకండి. ఎండిపోయిన ఎగ్ షెల్స్ లో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. కాబట్టి వాటిని బాగా పొడిచేసి.. మట్టిలో కలిపాక.. మొక్కలు నాటండి. లేదా.. కుంపట్లో వేయండి.

ఎప్సమ్ సాల్ట్

ఎప్సమ్ సాల్ట్

ఎప్సమ్ సాల్ట్ లో మెగ్నీషియం, సల్ఫేట్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. మొక్కల ఎదుగుదలకు ఈ పోషకాలు చాలా అవసరం. టమోటాలు, మిరియాలకు ఈ చిట్కా బాగా ఉపయోగపడుతుంది. మొక్కలు నాటే ముందు.. ఒక టేబుల్ స్పూన్ ఎప్సమ్ సాల్ట్ ను మట్టిలో కలిపితే.. ప్రయోజనం ఉంటుంది.

డైపర్స్

డైపర్స్

మొక్కలు ఏపుగా పెరగడానికి డైపర్స్ ఉపయోగపడతాయని ఎప్పుడు ఊహించలేదు కదా ? డైపర్ లోపల ఉండే జెల్ తీసి వాటర్ లో కలపండి. తర్వాత ఈ జెల్ ని మట్టిలో కలిపితే.. మొక్కలు బాగా పెరుగుతాయి. అయితే ఈ జెల్ ఆహారంగా తీసుకునే మొక్కలకు వాడకూడదు.

ఫోర్క్స్ ఫర్ పెట్ప్

ఫోర్క్స్ ఫర్ పెట్ప్

మీ గార్డెన్ లో చిందర వందరగా తిరుగుతూ.. గెంతుతూ.. మీ పెంపుడు జంతువులు మొక్కలను నాశనం చేస్తున్నాయా ? అయితే.. ప్లాస్టిక్ ఫోర్క్స్ తీసుకొచ్చి.. మీ గార్డెన్ లో అక్కడక్కడ పెట్టండి. ఇంకోసారి.. మీకిష్టమైన గార్డెన్ కు దూరంగా ఉంటాయి పెట్స్.

పౌడర్డ్ మిల్క్

పౌడర్డ్ మిల్క్

పౌడర్ పాలు.. మొక్కల పెరుగుదలకు బాగా ఉపయోగపడతాయి. ఈ పాలను టమోటా మొక్కలకు వేస్తే.. తియ్యటి, జ్యూసీ టమోటాలు పండుతాయి.

తియ్యటి దోసకాయలు

తియ్యటి దోసకాయలు

మీకు మామూలుగా కంటే.. తియ్యగా ఉండే దోసకాయలు కావాలా ? అయితే.. సన్ ఫ్లవర్ కి దగ్గరగా ఈ మొక్క నాటండి. దోసకాయ తీగ ఏర్పడటానికి సన్ ఫ్లవర్ ఉపయోగపడుతుంది.

వంటకు ఉపయోగించిన నీళ్లు

వంటకు ఉపయోగించిన నీళ్లు

కూరగాయలు ఉడకబెట్టడానికి ఉపయోగించిన నీటిని వృధా చేయకండి. ఇందులో చాలా పోషకాలుంటాయి. కాబట్టి మొక్కలకు ఇది ఎరువుగా పనిచేస్తుంది. ఉడికించిన నీటిని చల్లారాక.. మొక్కలకు పోయండి.

English summary

Weird Gardening Tips That You Never Knew: gardening in telugu

Gardening is one of the most enjoyable hobbies. This will make your life colourful and will fill each day with the hope of something new for the next day. While looking for improving your effort, you might have come across many of the effective tips that are constantly told by experts in the field. But, it is interesting to know that there are many weird garden tips that can bring you surprising results.
Story first published: Friday, September 25, 2015, 14:01 [IST]
Desktop Bottom Promotion