Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
కిచెన్ గార్డెన్ లో ఉల్లిపాయల పెంపకం..టిప్స్
పల్లెల్లో ఇంటి ఆవరణలో ఖాళీ స్థలాలు ఉండటం సహజం. కానీ పట్టణాల్లో ఇరుకైన ఇళ్లు..ఖాళీ స్థలాలు లేక ఇబ్బందుల పడుతుంటారు. ఉన్న కొంత స్థలాల్లోనూ కూరగాయలు, పండ్లు మొక్కలు పెంచుతూ పలువురు మహిళలు పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. రసాయనిక ఎరువులు లేకుండా సేంద్రియ పద్ధతిలో కూరగాయల, పూల, పండ్ల మొక్కలు పెంచుతున్నారు. ఇంటి ఆవరణలో టమాట, వంకాయ, సోరకాయ, కాకరకాయ, బీరకాయ, నిమ్మ వంటి సాగుచేయవచ్చు. పుదినా, కరివేపాకు, పాలకూర, తోటకూర, ఉల్లి దాదాపు పూలకుండీల్లో పెంచుకోవచ్చు. వీటి పెంపకంలో ఇబ్బందులు ఉండవు. ఇంటి అవరణలో పండిన తాజా కూరగాయలతో పౌష్టికాహారం అందుతుంది.
ఎక్కువ దిగుబడినిచ్చి, ఏడాది పొడవునా కాయగూరల సరఫరాయే కిచెన్ గార్డెన్ ప్రధాన లక్ష్యం. అందుకు చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే ఆ లక్ష్యాన్ని సులభంగా సాధించవచ్చు. ఇలాంటి గార్డెనింగ్ ఒక్క హాబీగానే కాకుండా, ఆర్థికపరమైన ఇబ్బందులను దూరం చేస్తుంది. అంతేకాదు బయటనుండి తెచ్చుకునే కూరగాయలకు ఎక్కువ మోతాదులో రసాయనాలు వినియోగిస్తున్నారు. దాని ప్రభావం ఆరోగ్యంపై తీవ్రంగా ఉంటుంది. వీటన్నింటకీ ఉన్న ఒకేఒక్క సమాధానం కిచెన్ గార్డెన్. ఏడాది పొడవునా పెరిగే చెట్లను తోటకు వెనుకభాగంలో పెంచాలి. దానివల్ల వాటి నీడ మిగిలిన మొక్కలపై పడి వాటికి ఎండ తగలకుండా పోయే ప్రమాదాన్ని నివారించవచ్చు. సాధారణంగా కొన్ని రకాల ఇంటి పంటను ఎలా పెంచుకోవాలో తెలుసు కానీ, ఉల్లిపాయల పెంపకం చాలా మందికి తెలియదు. మరి మన కిచెన్ గార్డెన్లో ఉల్లిపాయను ఏవిధంగా సాగుచేయాలో తెలుసుకందాం...

ఎంపిక చేసుకొనే విధానం: మొదట మీరు ఎలాంటి ఉల్లిపాయలను కోరుకుంటున్నారో వాటిని ఎంపిక చేసుకోవాలి . ఉల్లిపాయల్లో రెడ్, వైట్, ఎల్లో ఆనియన్స్ ఉన్నాయి. వీటిలో ఎలాంటివి మంచిగా పెరుగుతాయన్నది విషయం కాకుండా ఎంపిక చేసుకోవాలి.
పాట్ సెలెక్షన్స్:
గ్రీన్ ఆనియన్స్ పాట్స్ లేదా బాటిల్లోపెంచుకోవచ్చు. సౌర్యాన్ని మరియు స్థలాన్ని బట్టి పెంచుకోవచ్చు.
పాట్ లో పెంపకానికి ఎరువు అవసరం అవుతుంది, బాటిల్లో నీరులో పెరిగినా కూడా మంచి పెంపకం ఉంటుంది . కాబట్టి గ్రీన్ ఆనియన్స్ ఎలా పెంచుకోవాలను మీరే ఆలోచించుకోవాలి.
ఎరువు తయారుచేసుకోవడం: కంపోస్ట్ చేర్చిన ఎరువును తయారుచేసుకోవడం వల్ల మొక్కలు బాగా పెరుగుతాయి . ఎరువును కుంపటిలో నింపి నీటిని పోయడం వల్ల మొక్కలకు మంచి హైడ్రేషన్ అందుతుంది.
కుంపట్లో మొక్కలకు నీరు బాగా గ్రహించే విధంగా కుంపటి ఎంపక ఉండాలి. లేదంటే మొక్కలు సరిగా పెరగవు.

ప్లాంట్ సెట్స్: ఉల్లిపాయ రూట్స్ డౌన్ కు ఉండేట్లు చూసుకోవాలి . ప్రతి ఆనియన్ ఒక ఇంచి డీప్ గా ఉండాలి . ఒక దానికొకటి 11/2 నుండి 2 ఇంచిలీ దూరం ఉండేలా చూసుకోవాలి. అప్పుడే బాగా పెరుగుతుంది .
పాట్స్ ను డైరెక్ట్ సన్ లైట్ పడే చోట అమర్చాలి. ఆనియన్స్ కిచెన్ గార్డెన్ లో పెంచుకోవడానికి ఇది ఒక మంచి ఉపాయం.



Click it and Unblock the Notifications