For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కిచెన్ గార్డెన్ లో ఉల్లిపాయల పెంపకం..టిప్స్

By Super
|

పల్లెల్లో ఇంటి ఆవరణలో ఖాళీ స్థలాలు ఉండటం సహజం. కానీ పట్టణాల్లో ఇరుకైన ఇళ్లు..ఖాళీ స్థలాలు లేక ఇబ్బందుల పడుతుంటారు. ఉన్న కొంత స్థలాల్లోనూ కూరగాయలు, పండ్లు మొక్కలు పెంచుతూ పలువురు మహిళలు పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. రసాయనిక ఎరువులు లేకుండా సేంద్రియ పద్ధతిలో కూరగాయల, పూల, పండ్ల మొక్కలు పెంచుతున్నారు. ఇంటి ఆవరణలో టమాట, వంకాయ, సోరకాయ, కాకరకాయ, బీరకాయ, నిమ్మ వంటి సాగుచేయవచ్చు. పుదినా, కరివేపాకు, పాలకూర, తోటకూర, ఉల్లి దాదాపు పూలకుండీల్లో పెంచుకోవచ్చు. వీటి పెంపకంలో ఇబ్బందులు ఉండవు. ఇంటి అవరణలో పండిన తాజా కూరగాయలతో పౌష్టికాహారం అందుతుంది.

ఎక్కువ దిగుబడినిచ్చి, ఏడాది పొడవునా కాయగూరల సరఫరాయే కిచెన్‌ గార్డెన్‌ ప్రధాన లక్ష్యం. అందుకు చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే ఆ లక్ష్యాన్ని సులభంగా సాధించవచ్చు. ఇలాంటి గార్డెనింగ్‌ ఒక్క హాబీగానే కాకుండా, ఆర్థికపరమైన ఇబ్బందులను దూరం చేస్తుంది. అంతేకాదు బయటనుండి తెచ్చుకునే కూరగాయలకు ఎక్కువ మోతాదులో రసాయనాలు వినియోగిస్తున్నారు. దాని ప్రభావం ఆరోగ్యంపై తీవ్రంగా ఉంటుంది. వీటన్నింటకీ ఉన్న ఒకేఒక్క సమాధానం కిచెన్‌ గార్డెన్‌. ఏడాది పొడవునా పెరిగే చెట్లను తోటకు వెనుకభాగంలో పెంచాలి. దానివల్ల వాటి నీడ మిగిలిన మొక్కలపై పడి వాటికి ఎండ తగలకుండా పోయే ప్రమాదాన్ని నివారించవచ్చు. సాధారణంగా కొన్ని రకాల ఇంటి పంటను ఎలా పెంచుకోవాలో తెలుసు కానీ, ఉల్లిపాయల పెంపకం చాలా మందికి తెలియదు. మరి మన కిచెన్ గార్డెన్లో ఉల్లిపాయను ఏవిధంగా సాగుచేయాలో తెలుసుకందాం...

How To Grow Green Onions In Kitchen

ఎంపిక చేసుకొనే విధానం: మొదట మీరు ఎలాంటి ఉల్లిపాయలను కోరుకుంటున్నారో వాటిని ఎంపిక చేసుకోవాలి . ఉల్లిపాయల్లో రెడ్, వైట్, ఎల్లో ఆనియన్స్ ఉన్నాయి. వీటిలో ఎలాంటివి మంచిగా పెరుగుతాయన్నది విషయం కాకుండా ఎంపిక చేసుకోవాలి.

పాట్ సెలెక్షన్స్:
గ్రీన్ ఆనియన్స్ పాట్స్ లేదా బాటిల్లోపెంచుకోవచ్చు. సౌర్యాన్ని మరియు స్థలాన్ని బట్టి పెంచుకోవచ్చు.

పాట్ లో పెంపకానికి ఎరువు అవసరం అవుతుంది, బాటిల్లో నీరులో పెరిగినా కూడా మంచి పెంపకం ఉంటుంది . కాబట్టి గ్రీన్ ఆనియన్స్ ఎలా పెంచుకోవాలను మీరే ఆలోచించుకోవాలి.

ఎరువు తయారుచేసుకోవడం: కంపోస్ట్ చేర్చిన ఎరువును తయారుచేసుకోవడం వల్ల మొక్కలు బాగా పెరుగుతాయి . ఎరువును కుంపటిలో నింపి నీటిని పోయడం వల్ల మొక్కలకు మంచి హైడ్రేషన్ అందుతుంది.

కుంపట్లో మొక్కలకు నీరు బాగా గ్రహించే విధంగా కుంపటి ఎంపక ఉండాలి. లేదంటే మొక్కలు సరిగా పెరగవు.

How To Grow Green Onions In Kitchen

ప్లాంట్ సెట్స్: ఉల్లిపాయ రూట్స్ డౌన్ కు ఉండేట్లు చూసుకోవాలి . ప్రతి ఆనియన్ ఒక ఇంచి డీప్ గా ఉండాలి . ఒక దానికొకటి 11/2 నుండి 2 ఇంచిలీ దూరం ఉండేలా చూసుకోవాలి. అప్పుడే బాగా పెరుగుతుంది .

పాట్స్ ను డైరెక్ట్ సన్ లైట్ పడే చోట అమర్చాలి. ఆనియన్స్ కిచెన్ గార్డెన్ లో పెంచుకోవడానికి ఇది ఒక మంచి ఉపాయం.

English summary

How To Grow Green Onions In Kitchen

Buying green onions from supermarket is not a burden for your budget. But, this will never replace the happiness that you will get from harvesting homemade green onions that are fresh and pesticide free.
Story first published: Monday, March 14, 2016, 18:12 [IST]
Desktop Bottom Promotion