For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దాల్చినను గార్డెన్ లో ఉపయోగించడానికి గల ఆరు కారణాలివే

దాల్చినను గార్డెన్ లో ఉపయోగించడానికి గల ఆరు కారణాలివే

|

దాల్చినలో ఔషధగుణాలు సమృద్ధిగా లభిస్తాయి. ఇవి ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. అనేక ఆరోగ్య సమస్యల నుంచి విముక్తిని కలిగిస్తాయి. ఆరోమాథెరపీలో దాల్చిన పాత్ర ప్రత్యేకమైనది. దాల్చిన సువాసనతో నిండిన గది మనసును ప్రశాంతపరుస్తుంది. దాల్చిన ప్రాముఖ్యత గురించి తెలియనివారుండరనడంలో అతిశయోక్తి లేదు. దాల్చిన ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తుంది.

దాల్చినను కొన్నేళ్లుగా వాడుతూ వస్తున్న వారు దాల్చినలోని రుచితో పాటు మరొక్క విషయం ఖచ్చితంగా గమనించే ఉండుంటారు. ఇది ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకారి. బ్లడ్ షుగర్ ను అదుపులో ఉంచుకోవడానికి అలాగే గుండె వ్యాధుల బారిన పడే ప్రమాదాన్ని తగ్గించుకోవడానికి దాల్చినను రోజువారీ కొద్ది మొత్తంలో తీసుకోవాలని వైద్యులు సూచిస్తూ ఉండటం తెలిసిన విషయమే.

6 Things Cinnamon Does For Your Garden

అలాగే, సౌందర్యాన్ని పరిరక్షించే విషయంలో కూడా దాల్చిన విశిష్టమైన ప్రాధాన్యత కలిగి ఉంటుంది. ఈ విషయం అందరికీ తెలిసినదే. ఫేస్ ప్యాక్ ల రూపంలో దాల్చినను అనేకవిధాల వాడతారు. దాల్చిన ఫేస్ ప్యాక్ లు ఈ మధ్యకాలంలో అత్యంత ప్రాచుర్యం పొందాయి. ఫేస్ స్క్రబ్ లా కూడా దాల్చినను ఉపయోగిస్తున్నారు. తద్వారా, సౌందర్య పోషణకై దాల్చిన లోంచి అనేక ప్రయోజనాలను పొందవచ్చు.

అయితే, దాల్చినకు సంబంధించిన ఒక విషయం ప్రాచుర్యం పొందలేదు. అదేంటంటే, ఇది కేవలం ఆరోగ్య అలాగే సౌందర్య పోషణకే పరిమితం కాలేదు. గార్డెన్ ని సంరక్షించడంలో కూడా దాల్చిన నుంచి అనేక ప్రయోజనాలను పొందవచ్చు. తోటలో దాల్చినను ఉపయోగించడం వలన తోట సంరక్షణ సులభమవుతుంది.

ఈ ఆర్టికల్ లో గార్డెన్ సంరక్షణకై దాల్చినను ఏ విధంగా వాడాలో వివరంగా తెలుసుకుందాం. ఈ ఆర్టికల్ ను చదువుతుండగానే మీకు దాల్చినతో గార్డెన్ సంరక్షణ చేయాలన్న ఉద్దేశ్యం మొదలవుతుంది. ముఖ్యంగా, గార్డెనింగ్ అనే హాబీ కలిగిన వారికి దాల్చిన వలన గార్డెన్ ను సంరక్షించే విషయం ఈ పాటికే తెలిసి ఉంటుంది.

1. చీమలను నిరోధిస్తుంది:

1. చీమలను నిరోధిస్తుంది:

గార్డెన్ లో చీమల వలన కలిగే న్యూసెన్స్ అంతా ఇంతా కాదు. చీమలు ఆకులను తినేస్తాయి. ఇవి ఆకులను దెబ్బతీసి మొక్కల అందాన్ని పోగొడతాయి. మొక్కల ఎదుగుదలకు కూడా ఇవి ఇబ్బందులు తీసుకొస్తాయి. ఒక చిన్న చీమ వలన మొక్కలకు ఇబ్బంది ఏర్పడదు. ఇక్కడ అర్థం చేసుకోవలసిన విషయం ఏంటంటే చీమలు చిన్నవిగా ఉన్నా అవి గుంపులుగా రావడంచేత వాటి వలన డేమేజ్ ఎక్కువగా కలుగుతుంది. అందువలన, మొక్కల సంరక్షణ కష్టతరంగా మారుతుంది.

అటువంటి సందర్భాలలో, ఒక చీమను ఇంకొక చీమతో కమ్యూనికేట్ అవకుండా చేయడం ద్వారా చీమలను నిరోధించి వాటి వలన మొక్కలకు కలిగే ఇబ్బందులను అరికట్టవచ్చు. దాల్చిన సువాసన చీమలకు అంతగా పడదు. అవి, ఉక్కిరిబిక్కిరి అయిపోతాయి. దాల్చిన ఘాటుకు అవి గందరగోళానికి గురవుతాయి. అందువలన, మొక్కలకు చీమ ద్వారా తలెత్తే డేమేజ్ తీవ్రత తగ్గుతుంది.

2. ఫంగస్ పై పోరాటం:

2. ఫంగస్ పై పోరాటం:

మొక్కల ఆరోగ్యకరమైన ఎదుగుదలను అడ్డుకునేందుకు ఫంగస్ తనదైన పాత్ర పోషిస్తుంది. ఫంగస్ బారిన పడని గార్డెన్స్ అత్యంత తక్కువగా ఉన్నాయనడంలో సందేహం లేదు. ఇండియన్ సబ్ కాంటినెంట్ లో వైల్డ్ మష్రూమ్స్ ఎక్కువగా పెరగడం ఆందోళనను కలిగించే అంశం.

అటువంటి సందర్భాలలో, దాల్చిన అనేది మీకెంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. ఇక్కడ, మీరు చేయవలసిందల్లా దాల్చినను ఒక పొడిగా మార్చుకోవాలి. ఆ తరువాత, ఫంగై ఉందని అనిపించిన ప్రాంతాలలో దాల్చిన పొడిని చల్లాలి. దీని వలన ఫంగై త్వరగా నాశనమైపోతుంది. మొక్కలకు తగినంత పోషణ అంది పూవులు త్వరగా వికసిస్తాయి.

3. విత్తనాల సంరక్షణ:

3. విత్తనాల సంరక్షణ:

విత్తనాలు మొలకెత్తడమనేది అత్యంత సున్నితమైన అంశం. పొత్తిళ్ళలో పాపాయిని సంరక్షించుకున్నట్టే విత్తనాలు మొలకెత్తే దశలో అత్యంత శ్రద్ధను కనబరచాలి. వాతావరణ మార్పులు, ఫంగస్ తో పాటు మొక్కలకు సోకే మరికొన్ని వ్యాధుల వంటి ఫ్యాక్టర్స్ నుంచి విత్తనాలను సంరక్షించాలి. విపరీతమైన తేమ వలన మొలకెత్తే దశలోని విత్తనాలు పాడవకుండా తగిన జాగ్రత్తలను తీసుకోవాలి.

దాల్చినలో లభ్యమయ్యే యాంటీ ఫంగల్ మరియు యాంటీ బాక్టీరియల్ ప్రాపర్టీస్ వలన ఈ అంశంలో సంరక్షణ సాధ్యమవుతుంది. విత్తనాలు మొలకెత్తేందుకు అనుకూలమైన వాతావరణంలోనే ఈ ప్రాసెస్ ను ముందుకు తీసుకెళ్లాలి. మొలకెత్తిన విత్తనాలు మొక్కగా మారుతున్న క్రమంలో కొంత ఇబ్బంది తగ్గుతుంది. అప్పుడు, దాల్చినను వాడవలసిన అవసరం లేదు.

4. గ్రాఫ్టింగ్ కి తోడ్పడుతుంది:

4. గ్రాఫ్టింగ్ కి తోడ్పడుతుంది:

గార్డెనింగ్ పై అవగాహన ఉన్నవారికి గ్రాఫ్టింగ్ గురించి సరైన అవగాహన ఉండుంటుంది. గ్రాఫ్టింగ్ మరియు కటింగ్ అనేది మొక్కల రీప్రొడక్టివ్ ప్రాసెస్ కిందకి వస్తుంది. గార్డెనింగ్ పై ఆసక్తి ఉన్నా కూడా గ్రాఫ్టింగ్ ప్రాసెస్ ను ఇంకా పాటించని వారు అతితక్కువ మంది ఉంటారు. ఒక మొక్క నుంచి ఒక భాగాన్ని విడదీసి సేకరించినప్పుడు ఆ భాగం వీక్ అవడం సహజం.

అటువంటి సందర్భాలలో ఆ భాగాన్ని రీప్లాంట్ చేసేటప్పుడు దాల్చిన అమితంగా ఉపయోగపడుతుంది. ఆ మొక్క మరింత బలంగా ఎదుగుతుంది.

5. అనారోగ్యకరమైన మొక్కని కోలుకునేలా చేస్తుంది:

5. అనారోగ్యకరమైన మొక్కని కోలుకునేలా చేస్తుంది:

మిగతా జీవుల్లాగానే మొక్కలు కూడా అనారోగ్యం పాలవుతాయి. వాటికి కూడా గేయమవుతుంది. గార్డెనింగ్ సమయంలో అటువంటి మొక్కలను మీరు చూసే ఉంటారు. అయితే, మొక్కలకు తగినంత సంరక్షణను అందిస్తే అవి మరింత త్వరగా కోలుకుంటాయి. వాటిపై మీరు శ్రద్ధ కనబరచాలి. వాటిని తిరిగి పూర్వ స్థితికి తీసుకురావడం తేలికే.

ఇలాంటి సమయంలోనే దాల్చిన అమితంగా సహాయపడుతుంది. ప్రతి రోజూ ఒక చిటికెడు దాల్చినను మొక్కలపై జల్లుతూ ఉంటే అవి త్వరగా కోలుకుంటాయి. మొక్కలకు తగినంత నీటిని పోస్తూ ఈ విధానాన్ని పాటించాలి. నాలుగు నుంచి ఐదు రోజుల వరకు ఈ ప్రాసెస్ ను ఫాలో అయితే మొక్కల ఆరోగ్యం మెరుగవుతుంది.

6. దోమల బాధను తగ్గిస్తుంది:

6. దోమల బాధను తగ్గిస్తుంది:

దోమలతో పాటు మరికొన్ని కీటకాలకు దాల్చిన వాసన పడదు. మొక్కల ద్వారా వ్యాప్తి చెందే కీటకాలను అలాగే దోమలను అరికట్టేందుకు దాల్చిన తోడ్పడుతుంది.

గార్డెన్ లో తరచూ కొంత మొత్తం దాల్చిన పొడిని చల్లుతూ ఉంటే దోమల బాధ తగ్గుతుంది. దీని వలన డెంగ్యూ మరియు మలేరియా వంటి సమస్యల బారిన పడే ప్రమాదం తగ్గుతుంది. ఇది మీ ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు మొక్కల ఆరోగ్యాన్ని కూడా సంరక్షిస్తుంది. మొక్కలు ఆరోగ్యంగా ఎదుగుతాయి. మీ గార్డెన్ అందం మరింత రెట్టింపవుతుంది. గార్డెన్ ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

English summary

6 Things Cinnamon Does For Your Garden

Did you know that cinnamon can be used in the garden as there are several benefits of the same? Yes, if there are ants in your garden which are harmful for the garden, just spread some cinnamon and you will notice that ants eventually disappear. Cinnamon has antifungal and antibacterial properties which help to protect seedlings.
Desktop Bottom Promotion