For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

planting ideas:బాల్కనీలో ఈ మొక్కలను పెంచితే.. మీ మూడ్ కచ్చితంగా మారిపోతుందట...!

మీ ఇంట్లో మరియు బాల్కనీలో ప్లాంటింగ్ ఐడియాల కోసం ఇక్కడ ఓ లుక్కేయండి.

|

మనలో చాలా మందికి ఇంటి ఆవరణంలో మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం. అందుకే ఇండోర్ ప్లాంట్స్ పెంచే విషయంలో చాలా ఎక్కువగా ఆలోచిస్తుంటారు. అయితే ఆ మొక్కల వల్ల తమకు ఏదైనా హాని జరుగుతుందేమో అనే భయం కూడా కొందరిలో ఉంటుంది.

Home garden and planting ideas in the balcony in Telugu

అందుకే కొందరు మొక్కల పెంపకానికి దూరంగా ఉంటారు. అయితే ఇందులో కొంత వాస్తవం కూడా ఉంది. కొన్ని సందర్భాల్లో మన ఇంట్లో ఉండే మొక్కలను పెంపుడు జంతువులు తింటూ ఉండటం.. లేదా వాటిని నలిపేయడమో చేస్తుంటాయి.

Home garden and planting ideas in the balcony in Telugu

ఇలాంటి భయాలతో చాలా మంది ఇండోర్ ప్లాంట్స్ కు దూరమవుతారు. వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. మీ ఇంట్లో పచ్చదనం నింపాలని ఆశిస్తుంటే.. మీరు మంచి ఫ్రెండ్లీ మొక్కలను పెంచేయండి.. అందరిలో ఆనందాన్ని నింపేయండి...

ఇంట్లో అలాంటి పెయింటింగ్స్ ఉంటే - ముందు వాటిని బయట పెట్టేయండి !!ఇంట్లో అలాంటి పెయింటింగ్స్ ఉంటే - ముందు వాటిని బయట పెట్టేయండి !!

తక్కువ వెలుతురులో..

తక్కువ వెలుతురులో..

మీ ఇంటి ఆవరణంలో తక్కువ వెలుతురు ఉంటే.. మీరు స్పైడర్ ప్లాంటును ట్రై చేయొచ్చు. ఇవి చాలా ఫ్రెండ్లీగా అనిపిస్తాయి. వీటికి వచ్చే పిలకలు చూడటానికి చాలా అందంగా ఉంటాయి. ఈ పిలకలను తీసి మరో కుండీలో కూడా పెంచుకోవచ్చు. వీటిని సూర్యరశ్మి ప్రాంతంలో ఉంచినా కూడా చాలా అందంగా పెరుగుతాయి. వీటికి వారినికొకసారి నీరు పోస్తే చాలు. వాటంతట ఏపుగా పెరుగుతాయి.

మనీ ప్లాంట్..

మనీ ప్లాంట్..

మనలో చాలా మందికి ఈ మనీ ప్లాంట్.. మనీ ట్రీ గురించి బాగా తెలుసు. దీన్ని ఇంట్లో పెంచుకుంటే డబ్బుకు కొదువే ఉండదని చాలా మందికి నమ్మకం. అందుకే చాలా మంది ఇళ్లలో ఇవి మనకు కనిపిస్తూ ఉంటాయి. మీరు ఈ మొక్కలపై పెద్దగా శ్రద్ధ చూపాల్సిన అవసరం కూడా ఉండదు. ఈ మొక్కలపై వారానికొకసారి నీరు పోస్తే చాలు. అవి చాలా చక్కగా పెరుగుతాయి.

వేలాడే కుండీల్లో..

వేలాడే కుండీల్లో..

వేలాడే కుండీల్లో(Hanging Pots) బోస్టన్ ఫెర్న్ మొక్కలను వేస్తే కిందికి వేలాడుతూ చాలా అందంగా కనిపిస్తాయి. ముఖ్యంగా వీటిని మీ ఇంటి బాల్కనీలో పెంచితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ మొక్కలు ఎల్లప్పుడూ పచ్చంగా ఉండాలంటే.. మీరు ఈ కుండీలో ఉండే మట్టిని తడిగా ఉండేలా చూసుకుంటే చాలు. ఈ మొక్కలు అనునిత్యం పచ్చగా కనిపిస్తాయి.

వర్షాకాలంలో అందరూ ఎక్కువగా కోరుకునే స్నాక్ ఐటమ్స్ ఇవే...వర్షాకాలంలో అందరూ ఎక్కువగా కోరుకునే స్నాక్ ఐటమ్స్ ఇవే...

రోజ్ ఫ్లవర్స్..

రోజ్ ఫ్లవర్స్..

గులాబీ పూలను ప్రేమకు చిహ్నంగా భావిస్తారు. ఇది వివిధ రంగుల్లో లభిస్తుంది. అయితే ఎర్ర గులాబీలనే ఎక్కువగా లవ్ సింబల్ గా పరిగణిస్తారు. ఇవి అనేక రంగుల్లో ఉంటాయి. ప్రతి ఒక్క రంగుకు ఒక అర్థం ఉంటుంది. వీటిని మీ ఇంటి ఆవరణలో పెంచితే.. మీ మూడ్ ను మార్చడంలో కూడా ఇవి సహాయపడతాయట. వీటి వాసన పీల్చడం వల్ల మనలో మన గురించి.. మన చుట్టూ ఉన్న ప్రపంచం గురించి మంచి భావనలు కలుగుతాటయట. కావాలంటే మీరు కూడా ఓసారి ట్రై చేయండి..

చామంతి పూలు..

చామంతి పూలు..

ఈ పువ్వులు చూడటానికి చాలా అందంగా ఉంటాయి. ఈ పూల మొక్కలను మీ ఇంటి ఆవరణంలో పెంచుకోవడం వల్ల మీరు కోపంలో ఉన్నప్పుడు కూల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. ఈ పూల నుండి వచ్చే వాసన చాలా మంచిగా ఉంటుంది. దీని వాసన పీల్చడం వల్ల నిద్రలేమి సమస్యలు పరిష్కారం అవుతాయట. ఇవి మీ మూడ్ ని తేలిక పరిచి, రోజంతా మిమ్మల్ని ఉత్సాహపరచడంలో సహాయపడతాయట.

బంతి పూలు..

బంతి పూలు..

మీరు ఇంటి ఆవరణంలో మొక్కలను పెంచాలనుకునే మూలికల మొక్కలను జాగ్రత్తగా ఎంచుకోవాలి. ఎందుకంటే అవి మిమ్మల్ని దోమల గాట్ల నుండి నిరోధిస్తాయి మరియు డెంగ్యూ లేదా మలేరియా పొందే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఒక మంచి దోమవికర్షక మొక్క బంతి పువ్వు - ప్రతి 2-3 మూలిక మొక్కల తరువాత ఒక బంతి పువ్వు మొక్క పెట్టండి! చాలు - మీరు చాలా ఆరోగ్యంగా బాగుంటారు. రంగు రంగుల పువ్వులు మీ ఇంటిని ప్రకాశవంతంగా ఉంచుతాయి.

English summary

Home garden and planting ideas in the balcony in Telugu

Here are the home garden and planting ideas in the balcony in Telugu. Have a look
Story first published:Saturday, November 20, 2021, 14:55 [IST]
Desktop Bottom Promotion