Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
Pressure Cooker: ఈ తప్పులు చేశారంటే మీ కుక్కర్ పేలడం గ్యారెంటీ!..వంటగదిలో ప్రమాదం జరగకుండా ఇలా చేయాలి
వంట చేస్తున్న సమయంలోప్రెషర్ కుక్కర్ సడెన్ గా పేలిపోతున్న ఘటనలు ఇటీవల కాలంలో తరచుగా చూస్తున్నాం. వంటగదిలో కుక్కర్ పేలుడు కొన్నిసార్లు అక్కడే ఉన్న వ్యక్తుల మరణానికి కూడా దారితీస్తుంది కాబట్టి మీ కుక్కర్ గురించి అజాగ్రత్తగా ఉండకండి. పేలిపోతున్నప్రెషర్ కుక్కర్ లు ఏవో నాసిరకంవి అయి ఉంటాయిలే అనుకుంటే పొరపాటే. కొన్నిసార్లు బ్రాండెడ్ కుక్కర్ లు కూడా పేలుతున్నాయి. చాలా సార్లు కుక్కర్ పేలడానికి కారణం కుక్కర్ నాణ్యత కాదు..మనం చేసే తప్పులే. కాబట్టి ప్రెషర్ కుక్కర్ ను ఉపయోగించేటప్పుడు ఖచ్చితంగా దృష్టిలో ఉంచుకోవాల్సిన కొన్ని ముఖ్య విషయాలను ఇక్కడ చూడండి.
మూత,విజిల్ సరిగ్గా పెట్టాలి
ప్రెషర్ కుక్కర్‌ను సరిగ్గా ఉపయోగిస్తున్నారా లేదా అనేది కూడా గమనించడం ముఖ్యం.కుక్కర్ మూతను సరిగ్గా ఉంచాలి, అలాగే దాని విజిల్ కూడా పెట్టాలి. ఎందుకంటే కొన్నిసార్లు విజిల్ లోపల మిగిలి ఉన్న ఆహార కణాలు ఆవిరి బయటకు వెళ్లడం కష్టతరం చేస్తాయి, దీని వలన కుక్కర్ పేలిపోతుంది.

చాలా తక్కువ నీరు కలపడం
ప్రెషర్ కుక్కర్‌లో ఆహారాన్ని వండేటప్పుడు వంట చేయడానికి అవసరమైనంత మాత్రమే నీరు కలపండి. నీరు చాలా తక్కువగా ఉంటే విజిల్ మోగదు, ఆహారం ఉడికిపోతుంది. ఎక్కువ నీరు కలపడం వల్ల కుక్కర్ లోపల ఒత్తిడి ఏర్పడుతుంది, కుక్కర్ పేలిపోతుంది.
ఎక్కువ ఆహారం పెట్టకండి
4 కప్పుల బియ్యం పట్టే రైస్ కుక్కర్ లో ఒక కప్పు బియ్యం అదనంగా వేస్తే సమస్య ఉంటుంది. కుక్కర్ లో ఎప్పుడూ ఎక్కువ ఆహారాన్ని ఉంచే బదులు దానిలో 1/3 వంతు మాత్రమే ఉంచడం మంచిది. ఎక్కువ ఆహారాన్ని ఉంచితే మరిగేటప్పుడు అది మరింత విస్తరిస్తుంది, ఇది ఒత్తిడిని సృష్టించి కుక్కర్ పేలిపోయేలా చేస్తుంది.
కడిగేటప్పుడు
కుక్కర్‌ను వాష్ చేసేటప్పుడ, దాని రబ్బరు, విజిల్ మొత్తాన్ని తీసివేసి కడగాలి. ఎక్కువ నీరు కలిపేటప్పుడు కుక్కర్ లో ఒక చిన్న చెంచా పెట్టడం మంచిది . దీనివల్ల ఎక్కువ నీరు బయటకు పోకుండా ఉంటుంది.
పాతదైతే
మీ కుక్కర్ చాలా పాతదైతే దానిని ఉపయోగించడం కూడా సురక్షితం కాదు. దాన్ని మార్చండి. మంచి కంపెనీ కుక్కర్ ను ఉపయోగించడం సురక్షితం. కుక్కర్ నుండి నీరు బయటకు పోకుండా ఉండటానికి రబ్బరును తరచుగా మార్చండి. ఆవిరిని సరిగ్గా విడుదల చేయని కుక్కర్‌ను మార్చడం బెటర్.



Click it and Unblock the Notifications