Latest Updates
-
గోధుమ పిండిలో ఈ 5 పదార్థాలు కలిపితే..జీవితంలో హాస్పిటల్స్ కు వెళ్లాల్సిన పనే ఉండదు! -
లివర్ ఆరోగ్యంగా, క్లీన్ గా ఉండాలంటే డాక్టర్ చెప్పిన 5 సింపుల్ టిప్స్.. -
ఇంట్లోనే హోటల్ స్టైల్ దోశ పిండి..ఎలా తయారుచేసుకోవాలో చూడండి -
రచితో పాటే ఆరోగ్యం కూడా..గోధుమ రవ్వ పొంగల్ ఇలా చేస్తే..తింటుంటే మర్చిపోలేని మజా.. -
డ్రమ్ లో శవమవడం కంటే ఇదే బెస్ట్.. భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించిన భర్త.. నెటిజన్ల ప్రశంసలు -
చుక్క నూనె లేకుండానే బెస్ట్ స్నాక్..ఒక్కటితో ఆగరు,అంత రుచిగా ఉంటుంది! -
పెళ్లి కాని ప్రసాద్ లు చూస్తే ఏడ్చేస్తారు.. కుక్కను పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చిన బ్యూటీ! -
నాన్ వెజ్ ని మించిన రుచి, ఆరోగ్యం కూడా..చపాతీ, రైస్ లోకి కిర్రాక్ అనిపించే గోంగూర సోయా చేసుకోండిలా.. -
రాజస్థాన్ ఫేమస్ కార్న్ ఢోక్లా..బరువు తగ్గాలనుకునేవాళ్లకి ఇది బెస్ట్! -
గుడ్డు పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ ఎటాక్ వస్తుందా? డాక్టర్ విక్రాంత్ సింగ్ ఏమంటున్నారంటే..
వాషింగ్ మెషిన్‌ను ఎలా శుభ్రం చేసుకోవాలి, ఈ సింపుల్ టిప్స్‌తో పాడవకుండా కాపాడుకోవచ్చు
చాలా మంది వాషింగ్ మెషీన్ లో బట్టలు ఉతికేస్తుంటారు తప్పా దానిని శుభ్రంగా ఉంచుకోవడం గురించి పెద్దగా పట్టించుకోరు. వాషింగ్ మెషిన్ ను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే దాని సర్వీస్ ఎక్కువ రోజులు వస్తుంది. అలాగే దుమ్ము ధూళి, మురికి పేరుకుపోయి పాడవకుండా ఉంటుంది. మరి వాషింగ్ మెషిన్ ను జాగ్రత్తగా ఎలా చూసుకోవాలి, పాడవకుండా ఉండాలంటే ఎలాంటి టిప్స్ పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
వాషింగ్ మెషిన్‌ను ఎలా శుభ్రం చేసుకోవాలి:
ఒక కప్పు వెనిగర్, కొద్దిగా బేకింగ్ సోడా వేసి ఆ మిశ్రమాన్ని వాషింగ్ మెషీన్ డిటర్జెంట్ బాక్స్ లో వేసుకోవాలి. ఇప్పుడు వాషింగ్ మెషిన్ లో బట్టలేవీ వేయకుండానే రన్ చేయాలి. అలాగే 5- 10 నిమిషాల పాటు రన్ అయ్యాక వాషింగ్ మెషీన్ ఆఫ్ చేసుకోవాలి. వాటర్ డ్రైన్ అయిన తర్వాత శుభ్రమైన క్లాత్ తీసుకుని లోపల డ్రమ్ శుభ్రం చేసుకోవాలి. అలాగే ఫ్రంట్ డోర్ వాషింగ్ మెషిన్లు అయితే డోర్ వద్ద ఆగిన నీటిని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేసుకుంటే పాచి పట్టకుండా ఉంటుంది. తర్వాత డోర్ ఓపెన్ చేసి కాసేపు అలా వదిలేయాలి. ఇలా చేస్తే లోపల తడి పోయి పొడిగా ఉంటుంది.

డిటర్జెంట్ బాక్స్ శుభ్రం చేసుకోవాలి:
డిటర్జెంట్ బాక్స్ పురుగుల స్వర్గంగా, ఇరుక్కుపోయిన వాషింగ్ పౌడర్ తో అచ్చుగా ఉంటుంది. సాధ్యమైతే, మొత్తం సొరుగును బయటకు తీసి, ఒక పాత టూత్ బ్రష్ తో శుభ్రం చేసుకోవాలి.
ఫిల్టర్ ను అన్ బ్లాక్ చెయ్యాలి:
ఈ ఫిల్టర్ వెచ్చని మరియు తేమతో కూడి ఉంటుంది కనుక, దీనిలో కూడా పురుగులు ఎక్కువ జమ అవుతాయి. దీనిని ఎప్పటికప్పుడు ఖాళీగా ఉంచాలి. లోపలి చెత్త తీసేయాలి. లోపల జమ అయిన మురికిని అంతా తీసేయాలి.
వాషింగ్ మెషిన్ జాగ్రత్తగా చూసుకోవడానికి మరిన్ని చిట్కాలు:
- వాషింగ్ మెషిన్‌ను గోడకు దగ్గరగా పెట్టకూడదు. దీని వల్ల వెనక ఉండే పైపులు దెబ్బతింటాయి.
- వాషింగ్ మెషిన్ పైపులు లీకేజీ లేకుండా చూసుకోవాలి.
- వాషింగ్ మెషిన్లకు పౌడర్లకు బదులు లిక్విడ్ డిటర్జెంట్లు వాడటం మంచిది. పౌడర్లు వాడటం వల్ల అవి మెషిన్ లో పేరుకుపోయే అవకాశాలు ఉంటాయి.
- వాషింగ్ మెషిన్ లో బట్టలు ఉతికిన తర్వాత డోర్ ఓపెన్ చేసి పెట్టుకోవాలి. దీని వల్ల లోపల తేమ పోయి పొడిగా మారుతుంది. దీని వల్ల బ్యాక్టీరియా వృద్ధి చెందకుండా ఉంటుంది.



Click it and Unblock the Notifications
