Latest Updates
-
శని తిరోగమనం..ఈ 5 రాశుల వాళ్లు ఆ పని చేయకుంటే అగమాగం ఐపోతరు! -
రొటీన్ బజ్జీలు, పకోడీలు బోర్ కొట్టాయా? అయితే ఈసారి పొటాటో లాలిపాప్ ట్రై చేయండి -
రాత్రంతా తేనెలో ఓట్స్ నానబెట్టి ఉదయాన్నే తింటే ఏమవుతుందో తెలుసా? -
జీర్ణ సమస్యలను చిటికెలో మాయం చేసే పుదీనా రసం.. వేడి అన్నంలోకి అమృతంలా.. -
చేపల కన్నా 10 రెట్లు ఎక్కువ ఒమేగా-3 ఇచ్చే వెజిటేరియన్ ఫుడ్స్ ఇవే! -
దాబా స్టైల్ భూనా చికెన్ మసాలా..స్పైసీగా, జ్యూసీగా కేక టేస్ట్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
విష్ణు సహస్రనామ స్తోత్రం చదివినా, విన్నా చాలు.. గ్రహ దోషాల నుంచి సత్వర ఉపశమనం.! -
ఒకే స్థానంలో గురు, రాహు గ్రహాలు.. గురు చండాల యోగంతో జీవితంలో ఈ కష్టాలు తప్పవు.! -
బెండకాయ ఎప్పుడు వండినా జిగురుగా ఉంటుందా.?..ఈ పద్ధతిలో ట్రై చేస్తే అస్సలు వదిలిపెట్టరు.! -
ఆకలినే ఆయుధంగా మార్చి 20 రోజులుగా నిరాహార దీక్ష.. ఎందుకీ ఉద్యమం, ఎవరీ సోనం వాంగ్ చుక్.!
బాత్‌రూంలోంచి దుర్ఘంధం పరార్..! ఎలాంటి కెమికల్స్ లేవు.. ట్రై చేయండి..!
బాత్‌రూంలు సహజంగా దుర్ఘందంగానే ఉంటాయ్. కానీ వాటిని రకరకాలు కెమికల్స్, పర్శ్యూమ్లు, ఒడోనిల్ లాంటి వాటిని వేసి సుగంధం వచ్చేలా చేస్తాం. బాత్‌రూం కంపుకొడితే ఇక దాంట్లో రెండు నిమిషాలు కూడా ఉండలేము. బాత్‌రూంలో చెడు వాసన రాకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలను మీకు అందిస్తాం. వాటిని ట్రై చేయండి.
తినే సోడా
వంటల్లో వాడే తినే సోడా లేదా బేకింక్ సోడా బాత్‌రూంలో వున్న దుర్ఘంధం వెళ్లిపోతుంది. కొద్దిగా బేకింగ్ సోడాను తీసుకొని దాన్ని నీళ్లల్లో కలిపి స్ప్రే చేయడం వల్ల చెడు వాసన రాకుండా వుంటుంది. ఎక్కడెక్కడైతే వాసన వస్తందని మీకనిపిస్తుందో అక్కడ స్ప్రే చేయాలి. ఇది శరీరానికి హానికరం కాదు. కొన్ని కెమికల్స్ శరీరానికి హానికరంగా వుంటాయ్. కానీ ఈ బేకింగ్ సోడా వల్ల ఎలాంటి ప్రమాదం జరగదు. అయినప్పటికీ దీనిని పిల్లల నుంచి దూరంగా వుంచాలి.
కాఫీ బిల్లలు
కాఫీ బిల్లలతో కూడా చెడు వాసన పూర్తిగా తొలగిపోతుంది. బాత్‌రూంలో అక్కడక్కడా లేదంటే నాలుగు మూలల్లో కాఫీ బిల్లలు వేస్తే చెడు వాసర రాకుండా వుంటుంది.

వెనిగర్
వైట్ వెనిగర్‌ను నీళ్ల్లో కలిపి చల్లడం వల్ల కూడా చెడువాసన తొలగిపోతుంది. బాత్‌రూంను ఇదే మిశ్రమంతో క్లీన్ కూడా చేయవచ్చు. దీనితో ఒకసారి బాత్‌రూంను క్లీన్ చేస్తే ఫలితం మేకే తెలుస్తుంది.
వెంటిలేషన్
బాత్‌రూం నుంచి గాలి బయటకు వెళ్లే విధంగా వెంటిలేషన్ ఉండాలి. వెంటిలేషన్ లేకపోయినా గాలి బయటకు వెళ్లే ఏర్పాటు వుండాలి. అప్పుడు మాత్రమే గాలి స్వచ్ఛంగా మారే అవకాశం వుంది. లేదంటే గాలి అక్కడే నిలిచిపోయి దుర్ఘందం పెరిగిపోతుంది. వెంటిలేషన్ లేకపోతే ఒక ఎక్సాస్ట్ ఫ్యాన్ అయినా పెట్టుకోవచ్చు.
కర్పూరం బిల్లలు
గాలిలో వున్న తేమను పీల్చుకునే శక్తి కర్పూరానికి వుంటుంది. కర్పూరం బిల్లలను బాత్‌రూంలో అక్కడక్కడా పెట్టడం వల్ల గాలిలో చెడు వాసనకు కారణమయ్యే తేమను కర్పూరం పీల్చుకుంటుంది. దీంతో చెడు వాసన రాకుండా వుంటుంది.
టవళ్లు శుభ్రంగా వుంచాలి
బాత్‌రూంలో టవల్స్ పచ్చిగా, ఆరకుండా వుండడం వల్ల అందులోంచి దుర్వాసన వస్తుంది. టవళ్లు ఎప్పుడు డ్రైగా, శుభ్రంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది కూడా బాత్‌రూంలో దుర్ఘంధం రావడానికి ప్రధాన కారణం.
క్యాండిల్
బాత్‌రూంలో ఎప్పుడూ క్యాండిల్‌ను వెలిగించి ఉంచడం వల్ల కూడా బాత్‌రూంలో చెడు వాసన రాకుండా వుంటుంది. సాధారణ క్యాండిల్స్ కాకుండా అందంగా అలంకరించే విధంగా వున్న వ్యాండిల్స్‌ను బాత్‌రూంలో ఓ మూలలో వెలిగించే ఏర్పాటు చేస్తే ఇక బాత్‌రూంలోంచి చెడు వాసన పోయినట్టే.
బాత్‌రూం శుభ్రం
బాత్‌రూంను ఎప్పుడూ శుభ్రంగానే వుంచుకుంటే చెడు వాసనకు కొంత కూడా అవకాశం వుండదు. బాత్‌రూంకు వెళ్లిన వెంటనే ఫ్లష్ చేయడం మరిచిపోవద్దు. రెండు మూడు సార్లు ఫ్లష్ చేస్తే కొన్ని నీరు మాత్రమే వృధా అయినా బాత్‌రూం శుభ్రంగా వుంటుంది. వారానికి ఒకసారి బాత్‌రూంను క్లీన్ చేసుకునే కార్యక్రమం పెట్టుకోవాలి. బాత్‌రూంను శుభ్రం చేసుకోకుండా అలాగే వుంచితే అక్కడ హానికరమైన బ్యాక్టీరియా గాల్లో తయారై తరువాత అది టూత్ బ్రెష్‌కు అంటుకునే ప్రమాదాం వుంది. కాబట్టి బాత్‌రూంను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే చాలా సమస్యలు తొలగిపోతాయ్.



Click it and Unblock the Notifications