Latest Updates
-
కర్ణాటక స్టైల్ గ్రీన్ చికెన్ బిర్యానీ.. ఇలా చేస్తే ఫిదా అవ్వాల్సిందే! -
దరిద్రం పోయి అదృష్టం..జూలై 20 నుంచి ఈ 3 రాశులకు తిరుగుండదు! -
పల్లెటూరి స్టైల్ లో మట్టికుండలో చేపల కుర్మా..అన్నం, ఇడ్లీ, దోసె దేనిలోకైనా అదుర్స్! -
కళ్లు ఎర్రబడి, నీరు కారుతోందా? కండ్లకలక లక్షణాలు, నివారణ మార్గాలివే! -
వైజాగ్ లో కథ మాములుగా లేదుగా..దానికోసం ఏఐ తెగ వాడేస్తున్నారంట! -
నానబెట్టే పనిలేదు,పిండి రుబ్బే పనిలేదు.15 నిమిషాల్లో అటుకుల ఇడ్లీ..డయాబెటిస్ ఉన్నవారికీ బెస్ట్ -
శని తిరోగమనం..ఈ 5 రాశుల వాళ్లు ఆ పని చేయకుంటే అగమాగం ఐపోతరు! -
రొటీన్ బజ్జీలు, పకోడీలు బోర్ కొట్టాయా? అయితే ఈసారి పొటాటో లాలిపాప్ ట్రై చేయండి -
రాత్రంతా తేనెలో ఓట్స్ నానబెట్టి ఉదయాన్నే తింటే ఏమవుతుందో తెలుసా? -
జీర్ణ సమస్యలను చిటికెలో మాయం చేసే పుదీనా రసం.. వేడి అన్నంలోకి అమృతంలా..
ఇంట్లో ఈగలు ముసురుకుంటున్నాయా? ఇలా చేస్తే రమ్మన్నా రావు
వర్షాకాలం వచ్చేసింది. ఒకటీ రెండ్రోజులు వర్షాలు కురిసి మళ్లా పత్తా లేకుండా పోయాయి. కానీ వానలకంటే వేగంగా ఈగలు వచ్చేస్తున్నాయి. ఉదయం నుంచి ఈగల పోరు ఇబ్బంది పెడుతుంటాయి. ఇంట్లో ముసురుకునే ఈగలను చూస్తే చాలా మంది చిరాకేస్తుంది. ఈగలతో పాటు రోగాలు కూడా క్యూ కడతాయి. కలరా, విరేచనాలు, టైఫాయిడ్, అతిసారం, డెంగ్యూ వంటి రోగాలు వస్తాయి.
ఇల్లలో ఈగలు సాధారణంగా శుభ్రత లేని ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. చెత్తా చెదారం, తినేటప్పుడు పడే అంట్లతో ఈగలు ముసురుకుంటాయి. కొన్ని సార్లు శుభ్రంగా ఉన్న చోట కూడా ఈగలు ముసురుకుంటాయి. ఇంటిని ఎన్నిసార్లు శుభ్రం చేసుకున్నా, తలుపులకు, కిటికీలకు నెట్ కట్టుకున్నా ఈగలు తెగ వచ్చేస్తుంటాయి. మీరూ ఇదే సమస్యతో ఇబ్బంది పడుతుంటే ఈగలను తరిమికొట్టడానికి ఏం చేయాలో, ఎలాంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

యూవీ ట్రాప్స్:
ఆల్ట్రా వయోలెట్ ట్రాప్స్.. ఈగలను తరిమికొట్టడానికి చాలా బాగా పని చేస్తాయి. ఇంట్లోని ఈ ఆల్ట్రా వయోలెట్ ఈగలను బాగా ఆకర్షిస్తాయి. అలా వాటి వద్దకు వెళ్లిన ఈగలు షాక్ తో చనిపోతాయి. అలా ఈగల బెడద తగ్గిపోతుంది.
కర్పూరం:
కర్పూరానికి ఘాటైన వాసన ఉంటుంది. ఈ వాసనతోనే ఈగలను తరిమికొట్టవచ్చు. ఈగలు ఎక్కువగా ఉన్నట్లయితే కర్పూరం చక్కగా పని చేస్తుంది. కర్పూరాన్ని వెలిగించి ఈగలను దూరం చేయవచ్చు.
తులసి:
తులసిలో ఎన్నో ఔషధగుణాలు ఉన్న విషయం తెలిసిందే. ఔషధపరంగా, ఆధ్యాత్మికపరంగా తులసికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అలాగే తులసి ఆకులతో ఈగలను తరిమికొట్టవచ్చు. పుదీనా, లావెండర్, మ్యారీగోల్డ్ మొక్కలు కూడా ఈగలను తరిమికొడతాయి.
గ్రీన్ ఆపిల్ సోప్:
గ్రీన్ ఆపిల్ లిక్విడ్ సోప్ ఈగలను తరిమికొడుతుంది. చిన్న జార్ లో రెండు టీస్పూన్స గ్రీన్ ఆపిల్ లిక్విడ్ సోప్ వేసి అందులో కొన్ని నీళ్లు పోసి ఓ మూలన ఉంచాలి. గ్రీన్ ఆపిల్ లిక్విడ్ సోప్ ఘాటైన వాసన వల్ల ఈగలు రావు.
ఆపిల్ సైడర్ వెనిగర్:
ఈగలు రాకుండా నివారించడానికి ఇది చాలా ఉత్తమమైన మార్గం. ఒక చిన్న గిన్నెలో ఆపిల్ సైడర్ వెనిగర్ ను తీసుకోవాలి. దానిని ఇంట్లోని ఓ మూలలో ఉంచడం వల్ల ఆ ఘాటైన వాసనకు ఈగలు అటు వైపుకు రావు.
వైట్ వైన్:
డిష్ వాషింగ్ లిక్విడ్ తో వైట్ వైన్ కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక చిన్న గిన్నెలో వేసుకోవాలి. ఇది ఈగలను ఆకర్షిస్తుంది. అలా ఈ గిన్నెపై వాలిన ఈగలు చనిపోతాయి.
దాల్చిన చెక్క:
దాల్చిన చెక్క పొడి మంచి ఫ్లై రిపెల్లెంట్ గా పని చేస్తుంది. దాల్చిన చెక్కను ఎయిర్ రిఫ్రెషనర్ గా ఉపయోగించవచ్చు. ఈగలకు దాల్చిన చెక్క వాసనను ఇష్టపడవు. దాంతో ఇంట్లోకి ఈగలు రావు.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications