Latest Updates
-
ఆషాఢం బల్కంపేటలో వైభవం.. నేడు ఘనంగా ఎల్లమ్మ తల్లి కళ్యాణం.. ‘జలదుర్గ’ విశేషాలివే.! -
వక్ర గతిలోకి శని గ్రహం.. ఈ నెల 28 వరకు ఈ 3 రాశుల వారికి కష్టాలు తప్పవు.! -
అద్భుతమైన విందు భోజనం కావాలా? అయితే ఈ కోకనట్ మిల్క్ మటన్ పులావ్ ట్రై చేయాల్సిందే -
ప్రోటీన్ రిచ్ రాగి పనీర్ పరాఠా..షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..ఈజీగా చేసుకోండిల -
పని వేళలు కాదు.. పని పూర్తయ్యేవరకు ఉండాల్సిందే.. బ్యాంకు గేటుకు తాళం వేసిన మేనేజర్.. వైరల్ వీడియో.! -
స్నానం చేసేటప్పుడు మొదట ఏ భాగంపై నీళ్లు పోయాలి.?.. ఆయుర్వేదం ప్రకారం సరైన పద్ధతి ఏంటో తెలుసా.? -
తెలంగాణలో ఘనంగా బోనాల వేడుకలు.. ఆధ్యాత్మిక రహస్యం, చరిత్ర ఇదే.! -
మదురై స్పెషల్ మటన్ దోశ.. ఇలా చేస్తే జన్మలో ఆ రుచిని మర్చిపోలేరు! -
సూర్యగ్రహణం 2026..గ్రహణానికి ముందు, తర్వాత చేయాల్సిన పనులివే! -
డ్రై ఫ్రూట్స్ రోజుకు ఎన్ని తినాలో తెలుసా? ఆ తప్పు చేస్తే ప్రమాదమే!
ఈ 5 సింపుల్ చిట్కాలతో దోమలను ఈజీగా తరిమేద్దాం..! ఆలౌట్, హిట్ అవసరం లేవు..!
వర్షాకాలం వస్తోంది. దోమలు ఇక నిద్రపట్టనీయకుండా చేస్తాయ్. ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. ఒక్కసారి దండెత్తాయంటే ఆల్ అవుట్లు, మస్కిటో కాయిల్స్ కూడా పనిచేయవు. దమలు రాకుండా వుండాలంటే ఇంటి పరిసరాలను ముందుగా శుభ్రంగా వుంచుకోవాలి. అయితే ఈ గ్యాప్‌లో అప్పటికప్పుడు దోమలు రాకుండా వుండాలంటే, లేదా ఉన్న దోమలు పారిపోవాలంటే కొన్ని ఇంటి చిట్కాలను మీ ముందుకు తీసుకొని వచ్చాము.
దోమలను తరిమేందుకు ఇంటి చిట్కాలు
1. ముందుగా వేప నూనె కర్పూరం, బిర్యానీ ఆకులను ఉపయోగించి దోమలు రాకుండా చేయవచ్చు. ఈ చిట్కాలో ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ వేపనూనెను వేసుకొవాలి. ఆ వేప నూనెలో 5 నుంచి 6 కర్పూరం బిల్లలను వేసుకోవాలి. వేపనూనెలో కర్పూరం బిల్లలను స్పూన్‌తో బాగా నొక్కాలి. అప్పుడు చిన్న బౌల్‌లో వున్న కర్పూరం బిల్లలు పొడిగా మారుతాయ్. ఇలా కలిపిన వేపనూనె కర్పూరం మిశ్రమాన్ని బిర్యానీ ఆకుకు పూయాలి. ఇలా పూసిన బిర్యానీ ఆకులను అగరబత్తీలు పెట్టుకొని దాంట్లో అమర్చాలి. ఈ ఆకులను అగ్గిపుల్లతో వెలిగించాలి. అప్పుడు ఈ ఆకులు వెలిగి ఆరిపోయి ఒక రకమైన పొగను వెదజల్లుతాయ్. ఈ పొగవల్ల దోమలు రాకుండా వుంటాయ్. సాయంత్రం సమయంలో ఈ చిట్కాను పాటిస్తే మంచి ఫలితం వుంటుంది.
2. వేపనూనె, కర్పూరం వత్తిని ఉపయోగించి కూడా దోమలు రాకుండా చేసుకోవచ్చు. వేపనూనెలో కొన్ని కర్పూరం బిల్లలు వేసుకొని కరిగించుకోవాలి. కరిగిన వేపనూనె, కర్పూరం మిశ్రమాన్ని ఒక చిన్న ప్రమిదలోకి తీసుకోవాలి. ప్రమిదలో ఒక వత్తిని వేసుకొని వెలిగించుకోవాలి. ఈ వత్తి నుంచి వచ్చే పొగవల్ల కూడా దోమలు రాకుండా వుంటయ్.

3. కొబ్బరి నూనె వెల్లుల్లిని ఉపయోగించి కూడా దోమలు రాకుండా చేసుకోవచ్చు. వెల్లుల్లిపాయల నుంచి వెల్లుల్లి రేఖలను విడదీసుకోవాలి. వాటిపైనున్న పొట్టును కూడా తీసివేయాలి. ఇటా పొట్టు తీసిన వెల్లుల్లిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న ప్యాన్‌ను స్టవ్‌పైన పెట్టుకోవాలి. దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరినూనెను పోసుకోవాలి. వేగుతున్న కొబ్బరి నూనెలో కట్ చేసిన వెల్లుల్లి ముక్కలను యాడ్ చేసుకోవాలి. స్టవ్ ను లో ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. కొబ్బరి నూనెలో వెల్లుల్లి ముక్కలు నల్లగా అయ్యేంత వరకు నూనెను వేడి చేస్తూనే వుండాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాని ఒక బాటిల్‌లో భద్రపరుచుకోవాలి. ఈ నూనెను కాళ్లకు, చేతులకు, ముఖానికి రాసుకుంటే దోమలు కుట్టకుండా వుంటాయ్.
4. నిమ్మకాయ లవంగాలను ఉపయోగించి దోమల బాధ నుంచి తప్పించుకోవచ్చు. ముందుగా నిమ్మకాయను రెండు ముక్కలుగా అడ్డంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న నిమ్మకాయపై లవంగాలను కుచ్చుకోవాలి. ఇలా కుచ్చుకున్న నిమ్మకాయ ముక్కలను మంచానికి దగ్గరగా లేదా పడుకున్న చోటుకు దగ్గరగా పెట్టుకుంటే అక్కడ దోమలు రాకుండా వుంటాయ్.
5. వెల్లుల్లి, నీళ్లను ఉపయోగించి కూడా దోమలను తరిమేయవచ్చు. వెల్లుల్లిపాయ నుంచి వెల్లుల్లిని విడదీసుకోవాలి. వీటి పొట్టును కూడా తీసుకొని చిన్న ముక్కులుగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కలను ఒక గిన్నెలో వేసుకొని దాంట్లో ఒక గ్లాసు నీల్లను పోసి స్టవ్‌పై పెట్టుకోవాలి. కొన్ని నిమిశాల వరకు ఈ నిటిని బాగా మరిగించుకోవాలి. వెల్లుల్లి ఘాటు మొత్తం నీళ్లల్లోకి చేరుతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ నీళ్లను చల్లారబెట్టుకోవాలి. ఈ నీళ్లను ఒక స్ప్రే బాటిల్‌లోకి తీసుకొని ఇంట్లో వున్న గోడలకు, కిటికీలకు స్ప్రే చేసుకోవాలి. ఇలా చేస్తే కూడా దోమలు ఇంట్లోకి రాకుండా వుంటాయ్.



Click it and Unblock the Notifications