Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
కారులో ఎలుకలు దూరితే చాలా డేంజర్..! ఈ చిట్కాలతో ఎలుకల నుంచి తప్పించుకోండి..!
ఇప్పుడు చాలా ఇళ్లల్లో ఎలుకలు పెద్ద సమస్యగా మారిపోయింది. ఇళ్లల్లోనే కాదు కారు లోపల కూడా ఎలుకలు వచేస్తున్నాయి. ఇది చాలా ప్రమాదాకారం. కారు నడిపేటప్పుడు ఎలుకలు కాలు బ్రేక్ కిందకో గేర్ కిందకో వస్తే అప్పుడు ఎదురుకునే సమస్య ప్రాణానికే ప్రమాదం. ఇక ఇంట్లో వాకిట్లో ఎలుకలు చచ్చిపోతే ఆ వాసనను భరించడం ఎవ్వరి వల్లా కాదు.
ఇంట్లోకి డ్రైనేజి నుంచి, చెత్తకుండీల నుంచి ఎలుకలు మన ఇళ్లల్లోకి ప్రవేశిస్తూ ఉంటాయ్. ఎలుకలు ఇంట్లో ఉంటే వంట వస్తువులు, పుస్తకాలు, బట్టలు, డబ్బాలు, ఫర్నిచర్ ఇలా చాలా వస్తువులు దెబ్బతింటాయ్. ఈ ఎలకల వల్ల ప్లేగు వ్యాధి కూడా వచ్చే అవకాశం వుంది. రాత్రుళ్ళు అయితే చిన్నపిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం వుంది. పిల్లలను ప్రత్యేక నెట్ లో ఉంచడం, మంచంలో మధ్యలో పడుకోబెట్టడం చేయాలి. మరి ఈ ఎలుకల బెడద నుంచి ఎలా తప్పించుకోవాలి. ఎలుకలు రాకుండా వుండాలంటే ఏమి చేయాలో మీకు చెప్పబోతున్నాం.
1. మొదటి చిట్కాలో ఆవు పేడను చిన్న చిన్న ఉండలుగా చేసి ఎలుకలు ఎక్కువగా వచ్చే ప్రదేశంలో పెట్టాలి. ఎలుకలు వుండే రంద్రాల వద్ద కూడా ఈ ఆవుపేడ ఉండలను పెట్టాలి.

2. బిర్యాని ఆకులను కూడా ఎలుకలు తిరిగే ప్రాంతంలో పెట్టాలి. మిరియాల పొడిని లేదంటే మిరియాల నూనెను ఎలుకలు తిరిగే చోట వేసినా మంచి ఫలితం ఉంటుంది.
3. ఒక టమాటను తీసుకొని పైన దానికి గాటు పెట్టాలి. ఆ టమాటలో కారంపొడిని, కొంత చెక్కరను వేసుకోవాలి. ఈ టమాటను ఎలుకలు తిరిగే ప్రదేశంలో పెడితే, దీనిని తిన్న తరువాత ఆ ఎలుకకు కడుపులో మంట వచ్చి అక్కడికక్కడే చచ్చిపోతుంది.
4. మనిషి వెంట్రుకలను చూస్తే ఎలుకలకు భయం పుడుతుంది. ఈ వెంట్రుకలను ఎలుకలు వుండే ప్రదేశంలో పెట్టినా ఎలుకలు భయపడి అక్కడి నుంచి పారిపోతాయి.
5. ఎలుకలకు స్వీట్లు అంటే చాలా ఇష్టం. ఏదైనా ఒక స్వీట్ తీసుకొని, దాంట్లో బేకింగ్ సోడాను కలుపుకోవాలి. చిన్న ఉండలుగా చేసి ఎలుకలు వుండే ప్రదేశంలో పెట్టాలి. ఈ స్వీట్ ని గనుక ఎలుకలు తింటే, బేకింగ్ సోడా వల్ల కడుపులో మంట తో కడుపు ఉబ్బి ఆ ఎలుకలు చచ్చిపోతాయ్.
6. పూదీన ఆయిల్‌లో కాటన్ బాల్స్‌ను వేసి బాగా నాననివ్వాలి. ఈ కాటన్ బాల్స్‌ను ఎలుకలు తిరిగే చోట పెట్టాలి. వాటి నుంచే వచ్చే వాసనల వల్ల ఎలుకలు పారిపోతాయ్. ఇంటి చుట్టుపక్కల పూదీన చెట్లను పెంచుకున్నా ఆ వాసనకు ఎలుకలు ఇంట్లోకి బయటి నుంచే వెళ్లిపోయే అవకాశం వుంది. ఎలుకలకు పూదీన వాసన పడదు.
7. ఎలుకలు ఎక్కవగా వుండే ప్రదేశాల్లో, లేదా ఎలుకలు బయటకు వస్తున్న కన్నాల వద్ద పాము బొమ్మలు, గుడ్లగూబ బొమ్మలు పెడితే ఎలుకలు అక్కడి నుంచి పారిపోతాయ్.
8. అమోనియా, డిటెర్జెంట్ పౌడర్‌ను నీళ్లల్లో బాగా కలిపి ఎలుకలు వుండే ప్రదేశాల్లో, ఇంటి బటయ చుట్టుపక్కల చల్లుకుంటే ఎలుకలు రాకుండా వుంటాయ్. వీటి నుండి వచ్చే వాసన వల్ల ఎలుకలు పారిపోతాయ్.



Click it and Unblock the Notifications