Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
కూలర్ కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..!
ఇప్పుడు ఎండాకాలంలో ఇంట్లో భరించలేని వేడితో సతమతమవుతుంటాం. ఆఫీసులకు వెళ్లే వారికి ఉదయం సమయంలో ఇంటితో పని ఉండదు కానీ ఇంట్లో పెద్దవారు, పిల్లలకు కూలర్, ఏసీ లాంటివి లేకపోతే చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఏసీ కాకున్నా తాత్కాలికంగా కూలర్ కొనడానికి చాలా మంది ముందుకు వస్తారు. అయితే ఎలాంటి కూలర్ కొనాలి, కొనే ముందు ఎలాంటి జాగ్రత్తలు చూసుకోవాలనే విషయాలు చాలా మందికి తెలియదు. కూలర్ కొన్న తరువాత అందులోని ఫీచర్స్ అనుకున్నట్లుగా, సంతృప్తిగా లేకపోతే మళ్లీ బాధపడతారు. కాబట్టి కూలర్ కొనే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మీకు ఈ ఆర్టికల్‌లో అందిస్తున్నాము.

కూలర్ ప్యాడ్స్
మార్కెట్లో కూలర్లకు రెండు రకాల ప్యాడ్స్‌తో వస్తాయ్. కూలర్ లోపల మూడు దిక్కులు ఈ ప్యాడ్‌లతోనే కవర్ చేసి ఉంటుంది. రెండు రకాల ప్యాడ్స్‌లో ఒకటి యాస్పెన్ ప్యాడ్, మరొకటి హనీ ప్యాడ్. యాస్పెన్ ప్యాడ్ పూర్తిగా ఎండిపోయిన పచ్చ రంగు గడ్డితో నిండి ఉంటుంది. ఇక రెండవ రకం హనీ ప్యాడ్‌లో గడ్డి కాకుండా వాటి స్థానంలో గట్టిపేపర్ వాల్స్ లాగా తేనె పట్టును పోలి ఉండే ప్యాడ్స్ ఉంటాయ్. యాస్పెన్ ప్యాడ్స్‌తో పోలిస్తే ఈ హనీ ప్యాడ్స్ వల్లే కూలర్ ఎక్కవ చల్లాదనాన్ని రూంలో నింపుతుంది. కానీ హనీప్యాడ్స్ కూలర్ ధర కూడా అలాగే కొంచం ఎక్కువగా ఉంటుంది.
కెపాసిటీ
కూలర్ కొనే సమయంలో లీటర్ సామర్ధ్యం కూడా చాలా ముఖ్యం. 5 లీటర్ల సామర్ధ్యం నుంచి 40, 50 లీటర్ల సామర్ధ్యం వరకు కూలర్లు అందుబాటులో ఉంటాయ్. చిన్న రూం అయితే 20 లీటర్ల కూలర్ సరిపోతుంది. కానీ 30 నుంచి 40 లీటర్ల సామర్ధ్యం గల కూలర్ కొనగలిగితే అప్పుడు చిన్న రూముల్లోకైనా సంతృప్తిపొందవచ్చు. ఎండాకాలం కాబట్టి 20 లీటర్లు తీసుకుంటే త్వరగా నీళ్లు అయిపోతాయ్. కాబట్టి ఒకేసారి ఎక్కువ సామర్ధ్యం గల కూలర్ తీసుకోవడమే మేలు.
ఈ ఫీచర్లు ముఖ్యం
రిమోట్ ఉన్న ఆప్షన్ గల కూలర్‌ను తీసుకోవడమే మంచిది, ఎందుకంటే ఈ ఎండాకాలంలో అలసిపోయి ఇంటికి వస్తాం. కూలర్ దగ్గరికి వెళ్లి ఆన్ చేసుకునే శక్తి కూడా ఉండకపోవచ్చు. పిల్లలు ఉన్న ఇంట్లో ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. రాత్రసమయంలో కూడా అవసరం లేనప్పుడు పడుకొనే ఆఫ్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది.
ఐస్ చాంబర్ కూడా ఉన్న కూలర్‌ను కొనుగోలు చేసుకుంటే ఐస్ క్యూబ్స్‌ను ఐస్ చాంబర్‌లో వేసుకొని కూలర్ గాలి మరింత చల్లగా వచ్చేట్టు చేసుకోవచ్చు. కొంత అధిక రేటు అయినప్పటికీ ఇలాంటి కూలర్‌ను కొనుగోలు చేయండి.
కొన్ని కూలర్లు అధిక చప్పుడు చస్తుంటాయ్. అందుకోసం చప్పుడు తక్కువగా ఉండే కూలర్లను కొనుగోలు చేయాలి. మార్కెట్లో, షోరూముల్లోనే చప్పుడు ఎంతవరకు వస్తుందో చెక్ చేసుకొని కూలర్‌ను కొనుగోలు చేయాలి.
కూలర్‌లో డస్ట్ ఫిల్టర్ ఉండే విధంగా చూసుకోండి.. డస్ట్ ఫిల్టర్ ద్వారా కూలర్ దానంతట అదే క్లీన్ చేసుకోగలిగితే కూలర్ వల్ల ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటుంది. కూలర్ కింద వీల్స్ ఉండే విధంగా ఎంపిక చేసుకోండి. అప్పుడు మీ కూలర్‌ను మీకు అవసరం ఉన్న ప్రదేశంలోకి సులభంగా తరలించవచ్చు. చాలా సందర్భాల్లో కూలర్ నీటితో నిండి ఉంటుంది కాబట్టి వీల్స్ ఉన్న కూలర్‌ను ఎంపిక చేసుకుంటేనే మంచిది.



Click it and Unblock the Notifications